ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2023 నోటిఫికేషన్, దరఖాస్తు, ఎగ్జామ్ నమూనా
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2023 నోటిఫికేషన్, దరఖాస్తు, ఎగ్జామ్ నమూనా

గ్రాడ్యుయేట్లు యెంతగానో ఎదురు చూసే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2023 నియామక ప్రకటన విడుదల అయ్యింది. తాజా నియామక  ప్రకటన ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో దాదాపు 20 వేల గ్రూపు బి, గ్రూపు సి పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తిచేసి 18 నుండి 32 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు నైపుణ్య పరీక్ష నిర్వహణ ద్వారా జరుగుతుంది. ఈ నియామక ప్రకటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ డిపార్టుమెంట్ కార్యాలయాలు మరియు కేంద్రప్రభుత్వ ఆర్గనైజషన్స్'లో గ్రూపు బి, గ్రూపు సి అధికారులను నియమించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహిస్తుంది. డిగ్రీ అర్హుతతో జాతీయస్థాయిలో నిర్వహించే ఈ నియామక పరీక్షకు దేశ వ్యాప్తంగా ఏటా దాదాపు 50 లక్షల నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు పోటీపడుతున్నారు. నాలుగు దశలలో జరిగే ఈ నియామక పరీక్ష గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ద్వారా భర్తీచేసే పోస్టులు

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ (సిబిఇసి)
ఆదాయపు పన్ను ఇన్స్పెక్టర్ (సిబిడిటి) అసిస్టెంట్స్ (MEA)
సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ (సిబిఇసి) ప్రివెంటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ (సిబిఇసి)
అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (AEO) అసిస్టెంట్ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్)
అసిస్టెంట్ (రైల్వే మంత్రిత్వ శాఖ) డివిజనల్ అకౌంటెంట్ (CAG)
సబ్ ఇన్స్పెక్టర్లు (ఎన్ఐఏ) స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
సబ్ ఇన్స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) ఆడిటర్ సి & ఎజి
టాక్స్ అసిస్టెంట్స్ కంపైలర్ (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా)
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ (మాదకద్రవ్యాలు)
జూనియర్ అకౌంటెంట్ కార్యాలయాలు సబ్ ఇన్స్పెక్టర్లు (సిబిఐ)

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2023 షెడ్యూల్

నోటిఫికేషన్ ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2023
పోస్టుల సంఖ్యా 7,500
దరఖాస్తు ప్రారంభం 03 ఏప్రిల్ 2023
దరఖాస్తు తుది గడువు 03 మే 2023
పరీక్ష ఫీజు 100/-
టైర్ I ఎగ్జామ్ జులై 2023
టైర్ II ఎగ్జామ్ NA
ఫైనల్ రిజల్ట్ NA

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 32 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. కొన్ని పోస్టులకు సంబంధిత డిగ్రీ స్పెషలిజషన్ చేసినవారు మాత్రమే అర్హులు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ దరఖాస్తు ప్రక్రియ

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి.

అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం,
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ నియామక ప్రక్రియ

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పోస్టుల నియామక  రెండు దశలలో నిర్వహించబడుతుంది. మొదటి దశలో టైర్ I కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, రెండవ దశలో టైర్ II సీబీఈ నిర్వహిస్తారు. వివిధ షిఫ్టులలో అభ్యర్థులు సాధించిన మార్కులను నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి తుది షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు.

సీజీఎల్ టైర్ I ఎగ్జామ్ విధానం

టైర్ I స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. గంట నిడివితో జరిగే ఈ పరీక్షలో మొత్తం వంద ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ప్రశ్నలు జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ అవెర్నెస్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంశాలకు సంబంధించి ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 0.50 మార్కులు తొలగిస్తారు.

టైర్ I : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పరీక్షా సరళి
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ 25 50 60 నిముషాలు
జనరల్ అవెర్నెస్ 25 50
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 50
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 50

సీజీఎల్ టైర్ II ఎగ్జామ్ విధానం

టైర్ I లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు టైర్ II పరీక్ష నిర్వహిస్తారు. టైర్ II కూడా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. టైర్ II మొత్తం మూడు పేపర్లుగా జరుపుతారు. ఇందులో పేపర్ I పరీక్షను అన్నిరకాల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది.

పేపర్ II పరీక్షను కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పేపర్ III పరీక్షను టైర్ I లో పేపర్ III కి అర్హుత పొందిన వారికి మాత్రమే నిర్వహిస్తారు.

సీజీఎల్ టైర్ II - పేపర్ I

పేపర్ I పరీక్షను రెండు సెషన్లుగా ఒకే రోజు నిర్వహిస్తారు. మొదటి సెషన్ యందు మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ యందు రెండేసి మాడ్యూల్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి సెషన్ యందు సెక్షన్ I, సెక్షన్ II, మరియు సెక్షన్ III యందు మొదటి మాడ్యూల్ పరీక్షలను నిర్వహిస్తారు. సెషన్ II లో సెక్షన్ III యందు మిగిలిన రెండవ మాడ్యూల్ పరీక్షలను ఉంటుంది.

సెక్షన్ I, సెక్షన్ II పరీక్షలకు ఒక్కో పరీక్షకు 60 నిముషాలు చెప్పున 120 నిముషాలు కేటాయిస్తారు. సెక్షన్ III యందు ఒక్కో మాడ్యూల్ కోసం 15 నిముషాల సమయం కేటాయిస్తారు. సెక్షన్ I లో ఒక్కో మాడ్యూల్ యందు 30 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ II మాడ్యూల్ I యందు 45 ప్రశ్నలు, మాడ్యూల్ II యందు 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

అలానే సెక్షన్ III మాడ్యూల్ I యందు 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ III మాడ్యూల్ II యందు 15 నిముషాల నిడివితో ఒక డేటా ఎంట్రీ టాస్క్ ఇవ్వబడుతుంది. సెక్షన్ I, సెక్షన్ II, సెక్షన్ II లలో సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన మార్కులకు 1 మార్కు తొలగిస్తారు.

సెషన్ & సెక్షన్ మాడ్యూల్ & ప్రశ్నలు మార్కులు సమయం
సెషన్ I - సెక్షన్ I మాడ్యూల్ I - మ్యాథమెటికల్ ఎలిబిలిటీస్ (30) 90 మార్కులు 60 నిముషాలు
మాడ్యూల్ II - రీజనింగ్ & జనరల్ ఇంటిలిజెన్సు (30) 90 మార్కులు
సెషన్ I - సెక్షన్ II మాడ్యూల్ I - ఇంగ్లీష్ & లాంగ్వేజ్ కంప్రెహెన్షన్ (45) 135 మార్కులు 60 నిముషాలు
మాడ్యూల్ II - జనరల్ అవెర్నెస్ (25) 75 మార్కులు
సెషన్ I - సెక్షన్ III మాడ్యూల్ I - కంప్యూటర్ నాలేడ్జ్ (20) 60 మార్కులు 15 నిముషాలు
సెషన్ II - సెక్షన్ III మాడ్యూల్ II - డేటా ఎంట్రీ టాస్క్ - 15 నిముషాలు

సీజీఎల్ టైర్ II - పేపర్ II

పేపర్ II పరీక్షను కేవలం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష రెండు గంటల నిడివితో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ పేపర్లో మొత్తం 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 0.50 మార్కులు తొలగిస్తారు. ప్రశ్నలు స్టాటిస్టిక్ సబ్జెక్టు సంబంధించి ఇవ్వబడతాయి.

సబ్జెక్టు & పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
 పేపర్ II - స్టాటిస్టిక్స్ 100 200 2 గంటలు

సీజీఎల్ టైర్ II - పేపర్ III

పేపర్ III పరీక్షను టైర్ I లో పేపర్ III కి అర్హుత పొందిన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష రెండు గంటల నిడివితో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ పేపర్లో మొత్తం 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 0.50 మార్కులు తొలగిస్తారు. ప్రశ్నలు జనరల్ స్టడీస్ (ఫైనాన్స్ & ఎకనామిక్స్) సంబంధించి ఇవ్వబడతాయి.

సబ్జెక్టు & పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
పేపర్ III - జనరల్ స్టడీస్ (ఫైనాన్స్ & ఎకనామిక్స్) 100 200 2 గంటలు

 కంప్యూటర్ ప్రాఫిషియెన్సీ టెస్ట్ & డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్

పేపర్ I, సెక్షన్ III, మాడ్యూల్ II యందు యందు నిర్వహించే కంప్యూటర్ ప్రాఫిషియెన్సీ టాస్క్ లేదా డేటా ఎంట్రీ టాస్క్  అభ్యర్థికి అందుబాటులో ఉండే కమిషన్ రీజనల్ లేదా సబ్ రీజనల్ కేంద్రాలలో నిర్వహిస్తారు.

డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్(DEST): టాక్స్ అసిస్టెంట్ (సెంట్రల్ ఎక్సైజ్ & ఆదాయపు పన్ను) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థుల డేటా ఎంట్రీ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో భాగంగా గంట సమయంలో 8000 కీ ఇంప్రెషన్స్ చేయాల్సి ఉంటుంది. ప్రతి 15 నిముషాల్లో 2000 పదాలు కలిగిన పాసేజ్'ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సిన పరీక్షా. దీనికి ఎటువంటి మార్కులు కేటాయించారు.

కంప్యూటర్ ప్రాఫిషియెన్సీ టెస్ట్ (CPT) : CPT పరీక్షా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (CSS, MEA & AFHQ),  అసిస్టెంట్ ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టుగేషన్ ఆఫీసర్ (SFIO), అసిస్టెంట్ ఇన్ మినిస్ట్రీ అఫ్ మైన్స్ (జిఎస్ఐ), ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్), ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) & ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్ మరియు స్లైడ్‌ జెనరేట్ అంశాలకు సంబధించి జ్ఞానాన్ని పరీక్షిస్తారు.

సీజీఎల్ టైర్ I సిలబస్ సీజీఎల్ టైర్ II సిలబస్

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & తుది నియామక ప్రక్రియ

రెండు టైర్స్ లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపికను మార్చుకునేందుకు చివరిసారి అవకాశం కల్పిస్తారు.

ఇన్స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్) -సిబిఐసి, ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్) -సిబిఐసి, ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) -సిబిఐసి, ఇన్స్పెక్టర్-సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్-సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్-సిబిఐ, సబ్-ఇన్స్పెక్టర్- NIA, అప్పర్ డివిజనల్ క్లర్క్- BRO సంబంధించిన అభ్యర్థులకు ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫీజికల్ మరియు మెడికల్ ప్రమాణాలను సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు. టైర్ I, టైర్ II విడివిగా అర్హుత మార్కులు ప్రకటిస్తారు. కేటగిరి వారీగా ప్రతి టైర్ యందు మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. టైర్ II లో పేపర్ I పరీక్షను అందరు అభ్యర్థులు తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.

సమానమైన మార్కులు వచ్చిన అభ్యర్థులకు టైర్ II పేపర్ల మెరిట్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు అభ్యర్థులకు ప్రాధన్యత ఇస్తారు. ఇంకా సమస్య పరిస్కారం కాకుంటే అభ్యర్థుల పేర్లలో ఆల్ఫాబెట్ అక్షరాలను ఆధారంగా చేసుకుని చోటు కల్పిస్తారు.

కేటగిరి క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%

Post Comment