భర్తీ చేసే పోస్టులు | రెవెన్యూ శాఖలో జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ |
ఖాళీలు | 670 పోస్టులు |
విద్య అర్హుత | గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 30 డిసెంబర్ 2021 |
దరఖాస్తు ముగింపు తేదీ | 19 జనవరి 2022 |
రెవెన్యూ శాఖలో 670 జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 29 డిసెంబర్ 2021 న నియామక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏపీపీఎస్‌సీ వెబ్సైటు ద్వారా విడుదల చేసింది. డిగ్రీ అర్హుతతో భర్తీచేసే ఈ పోస్టులకు 30 డిసెంబర్ 2021 నుండి 19 జనవరి 2022 లోపు దరఖాస్తు చేసుకొవాలి.
జిల్లాల వారీగా ఖాళీల సంఖ్యా
శ్రీకాకుళం ( 38 ) | ప్రకాశం ( 56 ) |
విజయనగరం ( 34 ) | శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు ( 46 ) |
విశాఖపట్నం ( 43 ) | చిత్తూరు ( 66 ) |
తూర్పు గోదావరి ( 64 ) | అనంతపురము ( 63 ) |
పశ్చమ గోదావరి ( 48 ) | కర్నూలు ( 54 ) |
కృష్ణ ( 50 ) | వైఎస్సార్ కడప ( 51 ) |
గుంటూరు ( 57 ) | మొత్తం ఖాళీలు : 670 పోస్టులు |
ఎవరు అర్హులు
- అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
- ఉద్యోగానికి తగ్గట్టు అభ్యర్థి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాంగా ఉండాలి.
- అభ్యర్థి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- షార్ట్ లిస్టు చేయబడ్డ అభ్యర్థులు కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ అర్హుత పొందాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 18 ఏళ్ళు, గరిష్టంగా 42 ఏళ్ళు మించకూడదు.
వయోపరిమితి సడలింపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 5 ఏళ్ళ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అలానే శారీరక వికలాంగులకు 10 ఏళ్ళ వయోపరిమితి సడలింపు అవకాశం ఉంది. Ex- సర్వీస్ మెన్, NCC అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళు వయోపరిమితి వర్తిస్తుంది. రెగ్యూలర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 ఏళ్ళు వయోపరిమితి సడలింపు వర్తింపజేస్తారు. |
దరఖాస్తు రుసుము
దరఖాస్తు ఫీజు | Rs 250/- |
అప్లికేషన్ ప్రోసెసింగ్ ఫీజు | Rs 80/- |
గమనిక : అప్లికేషన్ ప్రోసెసింగ్ ఫీజు (Rs 80/-) నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, శారీరక వికలాంగులు, Ex- సర్వీస్ మెన్, తెల్ల కార్డు కలిగి ఉన్నవారు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ఫీజు ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు ప్రక్రియ 30 డిసెంబర్ 2019 న ప్రారంభమౌతుంది. అర్హులైన అభ్యర్థులు 19 జనవరి 2022 లోపు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సంబంధిత విద్య, వ్యక్తిగత వివరాలు పూరించి దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు ఏపీపీఎస్‌సీ యొక్క OTPR ఐడీని కలిగివుండాలి. అది లేకున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి తద్వారా దరఖాస్తు పూర్తిచేయండి.
నియామక ప్రక్రియ
నియామక ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో స్క్రీనింగ్/ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ మెయిన్ పరీక్షా నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు చివరి దశలో కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ మూడింటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను వివిధ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. స్క్రీనింగ్ మరియు మెయిన్స్ పరీక్షలు రెండు కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడతాయి.
స్క్రీనింగ్ టెస్ట్
మొదటి దశలో జరిగే స్క్రీనింగ్ టెస్ట్ 2 గంటల 30 నిముషాల నిడివితో 150 మార్కులకు నిర్వహించబడుతుంది. పరీక్షా పూర్తి ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్'తో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు, టెన్త్ స్థాయి సిలబస్'తో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగుకు చెందిన ప్రశ్నలు ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడింది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/3 మార్కులు తొలగించబడతాయి. పరీక్షా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో నిర్వహిస్తారు.
సిలబస్ | సమయం | ప్రశ్నలు | మార్కులు | |
సెక్షన్ - A | జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ | 120 నిముషాలు | 100 ప్రశ్నలు | 100 మార్కులు |
సెక్షన్ - B | జనరల్ ఇంగ్లీష్ & జనరల్ తెలుగు | 30 నిముషాలు | 50 ప్రశ్నలు | 50 మార్కులు |
మొత్తం మార్కులు | 150 మార్కులు |
మెయిన్స్ టెస్ట్
రెండవ దశలో జరిగే మెయిన్ టెస్ట్ 2 గంటల 30 నిముషాల నిడివితో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. పేపర్ జనరల్ ఎబిలిటీ మరియు జనరల్ స్టడీస్ సంబంధిత అంశాలతో 150 మార్కులకు నిర్వహించబడుతుంది. పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ & జనరల్ తెలుగు అంశాలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. రెండు పేపర్లు పూర్తి ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు) విధానంలో ఉంటాయి. పేపర్ 1 ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్'తో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలకు సంబంధించి, పేపర్ 2 టెన్త్ స్థాయి సిలబస్'తో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగుకు చెందిన అంశాలకు సంబంధించి ఇవ్వబడతయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడింది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/3 మార్కులు తొలగించబడతాయి. పరీక్షా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో నిర్వహిస్తారు.
సిలబస్ | సమయం | ప్రశ్నలు | మార్కులు | |
పేపర్ I | జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ | 150 నిముషాలు | 150 ప్రశ్నలు | 150 మార్కులు |
పేపర్ - II | జనరల్ ఇంగ్లీష్ & జనరల్ తెలుగు | 150 నిముషాలు | 150 ప్రశ్నలు | 150 మార్కులు |
మొత్తం మార్కులు | 300 మార్కులు |
కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ (స్కిల్ టెస్ట్)
కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ (స్కిల్ టెస్ట్) పరీక్షా కోసం మెయిన్స్ పరీక్షలో అర్హుత పొందిన వారి నుండి పోస్టుల సంఖ్యా ఆధారంగా1:2 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టే చేయబడిన వారికీ 30 నిముషాల నిడివితో కంప్యూటర్ అంశాలకు సంబంధించి 50 మార్కులకు క్వాలిఫై (కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ వివిధ రిజర్వేషన్ల వారీగా తుది నియామకం చేపడతారు.
కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ (స్కిల్ టెస్ట్) | సమయం | మార్కులు |
Proficiency in Office Automation with usage of Computers and Associated Software |
30 నిముషాలు | 50 మార్కులు |
కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ (స్కిల్ టెస్ట్) లో క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ మరియు శారీరక వికలాంగులు కనీసం 15 మార్కులు, బీసీ అభ్యర్థులు 17.5 మార్కులు ఇతర అభ్యర్థులకు 20 మార్కులు తప్పనిసరి సాధించాలి.