ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్ కోసం ఇలా దరఖాస్తు చేయండి
ఏపీపీఎస్సీ తాజా ఉద్యోగ భర్తీ పరీక్షల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు, ఇదివరకు నమోదు చేసుకున్న వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ వివరాలతో APPSC పోర్టల్ యందు లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అవ్వగానే ఇదివరకు మీరు పొందుపర్చిన వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు మీ ముందు దర్శనమిస్తాయి. అందులో మార్పు చేయాల్సిన వివరాలు ఏమైనా ఉంటె మార్పు చేసి, మీరు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నారో, దానికి సంబంధించిన ఎంపికలు, వివరాలను పొందుపర్చి, దరఖాస్తు రుసుము చెల్లించి APPSC కి దరఖాస్తు సమర్పించండి.
OTPR యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ వివరాలు మర్చిపోయిన అభ్యర్థులు గాబరా పడాల్సిన అవసరం లేదు. మీరు ఇదివరకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ మరియు డేట్ ఆఫ్ బర్త్'డే లేదా ఇదివరకు దరఖాస్తు చెసుకున్న ఉద్యోగ ప్రకటన వివరాలు ఆధారంగా ఆ వివరాలను తిరిగి పొందొచ్చు. వీటికి సంబందించిన లింక్ వివరాలు మీకు APPSC లాగిన్ పేజీ దిగువున అందుబాటులో ఉంటాయి. సరైన వివరాలు పొందుపర్చి మీ OTPR సమాచారం పొందండి. వాటిని పొందాక, మరోసారి ఈ పరిస్థితి తెలెత్తకుండా భద్రపర్చుకోండి.
వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్
ఇదివరకు Appsc పోర్టల్ యందు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నమోదు చేయని అభ్యర్థులు, కొత్తగా సంబంధిత వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలతో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ మొబైల్ మరియు మెయిల్ ఐడీకి OTPR సంబంధించి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు అందుతాయి. అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం ఈ వివరాలను భద్రపర్చుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ వివరాలను ఉపయోగించి, Appsc నుండి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.