Advertisement
తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి పథకం : విదేశీ విద్యకు స్కాలర్షిప్
Scholarships

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి పథకం : విదేశీ విద్యకు స్కాలర్షిప్

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ కులాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యకోసం 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ పథకంను మూడు పేర్లతో అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరుతొ, బీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పేరుతొ, మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పేరుతొ అందిస్తుంది.

  1. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు)

  2. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి (బీసీ విద్యార్థులకు)

  3. చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి (మైనారిటీ విద్యార్థులకు)

స్కాలర్షిప్ పేరు తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి
స్కాలర్షిప్ టైప్ విదేశీ విద్యకు ఆర్థిక సాయం
ఎవరికి అందిస్తారు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ మరియు బాహ్మణ విద్యార్థులు
స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ కుటుంబ ఆదాయం 6 లక్షలలోపు

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి సహాయాన్ని రెండు విడుతలలో అందజేస్తారు. మొదటి విడుత విద్యార్థి విదేశంలో ల్యాండ్ అవ్వగానే జమచేస్తారు. మొదటి సెమిస్టరు పూర్తియ్యాక రెండవ విడుత సహాయాన్ని అందిస్తారు. అదే విధంగా ఈ పథకం ద్వారా విద్యార్థికి ఏదైనా జాతీయ బ్యాంకు నుండి 10 లక్షల వరకు విద్యార్థి లోను తీసుకునే అవకాశం కల్పిస్తారు.

5 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉండే విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. విదేశాల్లో ఉన్నత విద్య చేయాలనే నిరుపేద విద్యార్థుల కలను ఈ పథకం నిజం చేయనుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూ జిలాండ్, జపాన్, ఫ్రాన్స్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలలో మానేజ్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.

ఈ పథకం కింద దరఖాస్తు చేసే అభ్యర్థులు చెల్లిబాటు అయ్యే పాసుపోర్టు, వీసా కలిగి ఉండాలి. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే యూనివర్సిటీ ప్రవేశ పరీక్షా లేదా టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జిమాట్ వంటి ప్రవేశ పరీక్షలలో అర్హుత సాధించి ఉండాలి. విదేశీ విద్య సాయం విద్యార్థి జాయిన్ అయ్యే యూనివర్సిటీ, దేశం మరియు కోర్సుపైన ఆధారపడి ఉంటుంది.

ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మూడు పేర్లతో అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్య నిధి పేరిట అందిస్తుండగా,  మైనారిటీల కోసం ముఖ్యమంత్రి విదేశీ స్కాలర్‌షిప్ పథకం కింద అమలు చేస్తున్నారు. బీసీ విద్యార్డులకు ఇదే పథకాన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి ఓవర్సీస్ విద్యా నిధి పేరిట అందజేస్తున్నారు. పేర్లు ఎన్ని ఉన్న ఈ పథకం వెనక ఉండే ఉద్దేశ్యం ఒకటే.

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి ఎలిజిబిలిటీ

  • 5 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణ కులాలకు చెందిన విద్యార్థులు అర్హులు
  • విద్యార్థి 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • విద్యార్థి చెల్లిబాటు అయ్యే పాసుపోర్టు, వీసా కలిగి ఉండాలి.
  • విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ కలిగి ఉండాలి.
  • టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జీమ్యాట్ వంటి ప్రవేశ పరీక్షలలో అర్హుత సాధించి ఉండాలి.

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తు విధానం

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి కోసం తెలంగాణ ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏటా 1000 మంది నిరుపేద విద్యార్థులను విదేశీ విద్యకోసం ఇతర దేశాలకు పంపించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. అర్హుత ఉండే అభ్యర్థులు ప్రభుత్వ ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హుత పరీక్షా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తారు. సరిఫికేట్ వెరిఫికేషన్'కు అభ్యర్థులు ఈ క్రింది వాటితో హాజరవ్వాల్సి ఉంటుంది.

విద్యార్థుల ఎంపికను రాష్ట్ర స్థాయి పరిశీలన కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో ఎస్.సి.డి.డి చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సాంకేతిక విద్యకు చెందిన కన్వీనర్ మరియు కమిషనర్, టిఎస్‌సిహెచ్‌ఇ, వైస్‌చాన్సలర్, జెఎన్‌టియు- హైదరాబాద్ సభ్యులుగా ఉంటారు.

తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధికి అవసరమయ్యే సర్టిఫికెట్లు

టెన్త్ సర్టిఫికెట్ / మీసేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేటెడ్ పాసుపోర్టు
తెల్ల రేషన్ కార్డు / మీసేవ ఆదాయ ధ్రువపత్రం  జిఆర్ఇ/జిమాట్ పాస్ కార్డు
క్యాస్ట్ సర్టిఫికెట్ టోఫెల్/ ఐఇఎల్టిఎస్ స్కోర్ కార్డు
పాస్ సర్టిఫికెట్ / ఫ్రొవిజనల్ మార్క్ షీట్ స్టడీ వీసా
ఐ-20 డాక్యుమెంట్ విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్

Post Comment