Advertisement
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Telangana

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో 2023 విద్యా ఏడాదికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ పరీక్షను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ నిర్వహిస్తుంది.

ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 రెసిడెన్సియల్ సంక్షేమ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి ఏడాది ఎంపీసీ, బైపీసీ మరియు ఎంఈసీ (ఇంగ్లీష్ మీడియం) గ్రూపులలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరౌతున్న విద్యార్థులు 1 మార్చి 2023 నుండి 31 ఏప్రిల్ 2023 మధ్య ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

టీఎస్ రెసిడెన్సియల్ కాలేజీల ప్రత్యేకతలు

  • రెసిడెన్సియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు పూర్తిస్థాయి ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుంది.
  • ప్రవేశం పొందే విద్యార్థులకు కోర్సు పూర్తియ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.
  • విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం విద్యతో పాటుగా క్రీడలు, ఇతర నైపుణ్యాభివృది అంశాలలో భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే తర్పీదు అందిస్తారు.
  • ఈ సంస్థల్లో అడ్మిషన్ల కోసం ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహించి, అర్హుత పొందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
  • ఇంటర్ ఎడ్యుకేషన్ పూర్తి ఇంగ్లీష్ మీడియంలో అందిస్తారు.

టీఎస్ రెసిడెన్సియల్ కాలేజీలలో సీట్లు

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి.
  • ఇందులో అత్యధికంగా 20 కాలేజీలు బాలికల కోసం, 15 కాలేజీలు బాలురుల కోసం అందుబాటులో ఉన్నాయి.
  • ఈ మొత్తం 35 రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీల్లో, 33 కాలేజీలలో జిల్లాల పరిధిలో అడ్మిషన్లు కల్పిస్తుండగా, యాదాద్రి భువనిగిరిలోని సర్వేల్ మరియు వరంగల్ లోని హసన్‌పర్తి గురుకుల జూనియర్ కాలేజీల్లో రాష్ట్ర పరిధిలో అడ్మిషన్లు నిర్వహిస్తారు.
  • రాష్ట్రంలో ఉన్న ఈ 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో మొత్తం 2996 ఇంటర్ మొదటి ఏడాది సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఒక్కో కాలేజీలో 80 సీట్లకు (ఎంపీసీ : 40 సీట్లు, బైపీసీ : 40 సీట్లు) అడ్మిషన్లు కల్పిస్తారు.
  • యాదాద్రి భువనిగిరిలోని సర్వేల్ మరియు వరంగల్ లోని హసన్‌పర్తి గురుకుల జూనియర్ కాలేజీల్లో మాత్రం అదనపు సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఈ రెండు కాలేజీల్లో ఒక్కదానిలో ఎంపీసీ యందు 88 సీట్లు, బైపీసీ యందు 60 సీట్లు, ఎంఈసీ యందు 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఎంఈసీ గ్రూపు పై రెండు కాలేజీల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ అడ్మిషన్ విధానం

అడ్మిషన్లు ప్రవేశ పరీక్ష మరియు లోకల్ రిజర్వేషన్ల ఆధారంగా నిర్వహిస్తారు. ప్రవేశ పరిక్షలో అర్హుత పొందిన విద్యార్థులను 1:5 నిష్పత్తిలో కౌన్సిలింగుకు పిలుస్తారు. స్థానిక రిజర్వేషన్ నిభందనలు, స్పెషల్ కేటగిరి వంటి తదితర నిబంధనలకు లోబడి అడ్మిషన్ కల్పిస్తారు.

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థులు ప్రస్తుత ఏడాది పబ్లిక్ పరీక్షల్లో పది ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • జనరల్ విద్యార్డులు పదిలో కనీసం 6 జీపీఏ పాయింట్స్, మిగతా విద్యార్థులు కనీసం 5 జీపీఏ పాయింట్స్ తో ఉత్తీర్ణత పొందాలి.
  • దీనితో పాటుగా ఇంగ్లీష్ సబ్జెక్టు యందు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా  4 జీపీఏ పాయింట్స్ సాధించి ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష ఏభైవేలు (రూరల్), రెండు లక్షలు (అర్బన్) రూపాలకు మించకూడదు.
  • తెలుగు మరియు ఇంగ్లీష్  మీడియంలో పది చదువుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు.
  • విద్యార్థి వయస్సు 17 ఏళ్ళు మించకూడదు.
  • సీటు సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
  • మెజారిటీ సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయిస్తారు.

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ పరీక్ష షెడ్యూల్

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ దరఖాస్తు ప్రారంభం 02 మార్చి 2023
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ దరఖాస్తు గడువు 31 మార్చి 2023
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ హాల్ టికెట్ ఏప్రిల్ 2023
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ పరీక్ష తేదీ 06 మే 2023 (ఉ 10 నుండి 12.30)

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ దరఖాస్తు విధానం

దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. అర్హుత కలిగిన విద్యార్థులు www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాలి. రెండవ దశలో పరీక్షకు సంబంధించి ఎంపికలను నమోదు చేసుకోవాలి. చివరిగా పరీక్ష రుసుము చెల్లించడం దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.

మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు. ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-100 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి. అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.

పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి. నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

దరఖాస్తు రుసుము : 200/- (దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.)

పరీక్ష కేంద్రాలు : పరీక్ష కేంద్రాలు 10 పాత జిల్లా కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉంటాయి. 1) ఆదిలాబాద్, 2) వరంగల్, 3) కరీంనగర్, 4) ఖమ్మం, 5) నిజామాబాద్, 6) నల్గొండ, 7) మహబూబ్ నగర్, 8) హైదరాబాద్,9) సంగారెడ్డి 10) సిద్దిపేట, 11) మెదక్

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ఎగ్జామ్ నమూనా

టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఆఫ్‌లైన్ యందు నిర్వహిస్తుంది. పరీక్ష రెండు గంటల నిడివితో 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 2.30 గంటల నిడివితో ఉంటుంది.

ప్రశ్నలు పదివ తరగతి స్థాయిలో గణితం, సోషల్, బయోలాజికల్ సైన్స్, ఫీజికల్ సైన్స్, ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రవేశాలు అర్హుత పరీక్షలో పొందిన మెరిట్ మరియు వివిధ కుల, లోకల్ రిజర్వేషన్ సమీకరణాల ఆధారంగా నిర్వహిస్తారు.

ఇంటర్ గ్రూపు & పేపర్ సబ్జెక్టు / సిలబస్ మార్కులు
ఎంపీసీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + మ్యాథ్స్ + ఫీజికల్ సైన్స్ 150 మార్కులు
బైపీసీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + బయోలాజికల్ సైన్స్ + ఫీజికల్ సైన్స్ 150 మార్కులు
ఎంఈసీ గ్రూపు కోసం  ఇంగ్లీష్ + మ్యాథ్స్ + సోషల్ స్టడీస్ 150 మార్కులు

తెలంగాణలో 35 రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీల లిస్ట్

రెసిడెన్సియల్ కాలేజీ ప్రాంత్రం & జిల్లా సీట్లు
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) సర్వైల్ (యాదాద్రి భువనగిరి) 178 సీట్లు (ఎంపీసీ, బైపీసీ & ఎంఈసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) హసన్‌పర్తి (హనుమకొండ) 178 సీట్లు (ఎంపీసీ, బైపీసీ & ఎంఈసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) బీచుపల్లి (గద్వాల్ జోగులాంబ) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) బాలానగర్ (మహబూబ్ నగర్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) బోరబండ (హైదరాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) బోరబండ (హైదరాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) కీసరగుట్ట (మేడ్చల్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) వికారాబాద్ (వికారాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) తండూరు (వికారాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) లింగంపల్లి (సంగారెడ్డి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) దిగ్వాల్ (సంగారెడ్డి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) మెదక్ (మెదక్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) తూప్రాన్ (మెదక్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) సిద్దిపేట (సిద్దిపేట) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) పోచంపాడ్ (నిజామాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) పోచంపాడ్ (నిజామాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) బోధన్  (నిజామాబాద్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) మద్నూర్ (కామారెడ్డి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) బెల్లంపల్లి (మంచిర్యాల) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) నిర్మల్ (నిర్మల్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్ పెద్దాపూర్‌క్యాంపు (జగిత్యాల) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) తాటిపల్లి (జగిత్యాల) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) మేడారం (పెద్దపల్లి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) నేరెళ్ల (రాజన్న సిరిసిల్ల) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) బండారుపల్లి (జయశంకర్ భూపాలపల్లి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) వెలైర్ (వరంగల్ అర్బన్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) కొడకండ్ల (జనగాం) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) వంగర (హన్మకొండ) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) నెక్కొండ (వరంగల్ రూరల్) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) ఏన్కూరు (ఖమ్మం) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) వైరా (ఖమ్మం) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) బూర్గంపహాడ్ (భద్రాద్రి కొత్తగూడెం) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) చౌటుప్పల్ (యాదాద్రి భువనగిరి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాలికలు) రామన్నపేట (యాదాద్రి భువనగిరి) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)
టీఎస్‌ఆర్‌జేసీ (బాయ్స్) తుంగతుర్తి (సూర్యాపేట) 80 సీట్లు (ఎంపీసీ & బైపీసీ)

Post Comment