ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ 2022 | మొత్తం ఖాళీలు 8,106
Bank Jobs Latest Jobs

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ 2022 | మొత్తం ఖాళీలు 8,106

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ 2022 వెలువడింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో గ్రూపు A స్థాయి స్కేలు I, II, III అధికారులను మరియు గ్రూపు B స్థాయి మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు నియామకానికి గాను ఐబిపిఎస్ అర్హులైన అబ్యర్దుల నుండి దరఖాస్తులు కోరుతుంది.

2022-23 ఏడాదికి సంబంధించి వెలువడిన ఈ నియామక ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకుల్లో దాదాపు 8,106 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న 5 గ్రామీణ బ్యాంకుల్లో 920 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అభ్యర్థులు దరఖాస్తు చేసే రీజనల్ ప్రాంతాలకు చెందిన వాడుక భాషకు సంబంధించి రాయడం, చదవడం, మాట్లాడం వచ్చి ఉండాలి. నియామక ప్రక్రియ రాతపరీక్ష ద్వారా జరుగుతుంది. ఈ నియామక ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ పొందగలరు.

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంట్ 2022

నోటిఫికేషన్ నెంబర్ CRP RRBs XI
పోస్టుల సంఖ్యా 8,106
నోటిఫికేషన్ తేదీ 07/06/2022
దరఖాస్తు తుది గడువు 27/07/202022
పరీక్షా ఫీజు 850/-

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ రిక్రూట్మెంటులో పాల్గునే బ్యాంకులు

భారత బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే ఆలోచనతో 1976 లో రీజినల్ రూరల్ బ్యాంకులు ఏర్పాటు చేసారు. గ్రామీణ ప్రజలను, వ్యవసాయదారులను బ్యాంకింగ్ రంగంలో మిళితం చేయడతో పాటుగా వారికి పొదుపు ఖాతాలు తెరవటం, వ్యవసాయ పెట్టుబడుల కోసం లోన్లు అందజేయటం వంటి అనేక సేవలు అందజేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రూరల్ బ్యాంకులను ఏర్పాటు చేసారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 రీజినల్ రూరల్ బ్యాంకులు సేవలు అందజేస్తున్నాయి. ఈ 45 రూరల్ బ్యాంకులు నాబార్డు సహాయంతో, ఐబిపిఎస్ నియామక పరీక్షల ద్వారా తమకు అవసరమయ్యే సిబ్బందిని నియమించుకుంటాయి. నేషనల్ బ్యాంకుల నియామక పరీక్షలతో పాటుగా, రూరల్ బ్యాంకులలో సిబ్బంది ఖాళీలను గుర్తించి యేటా ఐబిపిఎస్ రీజినల్ రురల్ బ్యాంక్స్ ఎగ్జామ్ పేరుతో నియామక పరీక్షా నిర్వహించి, గ్రామీణ బ్యాంకులకు అవసరమయ్యే స్పెషల్ ఆఫీసర్స్, ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్ ల నియామకాలు చేపడుతున్నారు.

రీజనల్ రూరల్ బ్యాంకు ప్రధాన కేంద్రం రాష్ట్రము తెలియాల్సిన భాషలు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ తెలంగాణ తెలుగు
ఆంధ్ర ప్రగతి గ్రామీణ్  బ్యాంకు కడప ఆంధ్రప్రదేశ్ తెలుగు
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గుంటూరు ఆంధ్రప్రదేశ్ తెలుగు
సప్తగిరి గ్రామీణ బ్యాంకు చిత్తూరు ఆంధ్రప్రదేశ్ తెలుగు
తెలంగాణ గ్రామీణ బ్యాంకు హైదరాబాద్ తెలంగాణ తెలుగు & ఉర్దూ
పోస్టుల వారీగా తెలుగు రాష్టాల్లో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం ఖాళీలు
ఆఫీసర్స్ స్కేల్ I 96 139 235
ఆఫీసర్స్ స్కేల్ II 98 20 118
ఆఫీసర్స్ స్కేల్ III 4 0 4
మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు 104 459 563
మొత్తం 302 పోస్టులు 618 పోస్టులు 920 పోస్టులు

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రిలిమ్స్ & మెయిన్స్ 2022 షెడ్యూల్

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ప్రిలిమ్స్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ 07 జూన్ 2022
దరఖాస్తు తుది గడువు 21 జూన్ 2022
కాల్ లెటర్ డౌన్‌లోడ్ ఆగష్టు 2022
ప్రిలిమినరీ పరీక్ష ఆగష్టు 2022
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 2022
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ మెయిన్స్ షెడ్యూల్
మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ సెప్టెంబర్ 2022
మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 2022
మెయిన్స్ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 2022
ప్రోవిషనల్ అల్లొట్మెంట్ జనవరి 2023

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఎలిజిబిలిటీ

  • జాతీయత: అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • విద్య అర్హుత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. చివరి యేడాది గ్రాడ్యుయేషన్ చదువవుతున్న విద్యార్థులు కూడా అర్హులు.
  • ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు
  • ఇంగ్లీష్ధ నైపుణ్యం: రఖాస్తు చేసే అభ్యర్థులు స్థానిక బాషా పరిజ్ఞానం కలిగివుండాలి (రాయడం, చదవటం తెలిసి ఉండాలి)
  • వయోపరిమితి: ధరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 18 నుండి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది
  • ప్రయత్నాల సంఖ్యా: జనరల్ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే పీఓ పరీక్ష రాసేందుకు అర్హులు. ఓబీసీ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా ఏడు సార్లు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వికలాంగు అభ్యర్థులకు యెటువంటి హాజరు పరిమితి లేదు.
పోస్టు ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వయోపరిమితి
మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు గ్రాడ్యుయేషన్ + కంప్యూటర్ నాలెడ్జ్ + లోకల్ బాషా ప్రావీణ్యం 18 నుండి 28 ఏళ్ళు
ఆఫీసర్స్ స్కేల్ I గ్రాడ్యుయేషన్ + కంప్యూటర్ నాలెడ్జ్ + లోకల్ బాషా ప్రావీణ్యం 18 నుండి 30 ఏళ్ళు
ఆఫీసర్స్ స్కేల్ II గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల వృత్తి అనుభవం 21 నుండి 32 ఏళ్ళు
ఆఫీసర్స్ స్కేల్ III గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల వృత్తి అనుభవం 21 నుండి 40 ఏళ్ళు

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ దరఖాస్తు ఫీజు

కేటగిరి ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ)
1 ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ 175/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ )
2 జనరల్ మరియు ఓబీసీ 850/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ)

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ దరఖాస్తు విధానం

డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా ఐబీపీఎస్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోవాలి.

అభ్యర్థి పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే సర్టిఫికేట్లు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి.

దరఖాస్తులో వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొదుపర్చాక, అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తెలంగాణలో పరీక్ష కేంద్రాలు
ప్రిలిమినరీ పరీక్షా:  చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రిలిమినరీ పరీక్షా: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 
మెయిన్ పరీక్షా: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మెయిన్ పరీక్షా: హైదరాబాద్ 

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పరీక్ష విధానం

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ

ప్రిలిమినరీ పరీక్ష విధానం (ఆబ్జెక్టివ్ టెస్ట్)

మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 40 45 నిముషాలు
న్యూమరికాల్ ఎబిలిటీ 40 40

ఆఫీసర్ స్కేల్ I

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 40 45 నిముషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ

మెయిన్స్ పరీక్ష విధానం (ఆబ్జెక్టివ్ టెస్ట్)

మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 50 2 గంటలు
కంప్యూటర్ నాలెడ్జ్ 40 20
జనరల్ అవెర్నెస్ 40 40
ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ 40 40
న్యూమరికాల్ ఎబిలిటీ 40 50

ఆఫీసర్ స్కేల్ I

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 50 2 గంటలు
కంప్యూటర్ నాలెడ్జ్ 40 20
జనరల్ అవెర్నెస్ 40 40
హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ

 సింగల్ లెవెల్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టెస్ట్)

ఆఫీసర్ స్కేల్ II (స్పెషల్ కేడర్ ఆఫీసర్)

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 50 50 2.30 గంటలు
 ప్రొఫిషనల్ నాలెడ్జ్ & కంప్యూటర్ నాలెడ్జ్ 60 60
ఫైనాన్సియల్ అవెర్నెస్ 40 40
హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & డేటా ఇంటర్ప్రిటేషన్ 40 50

ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) & ఆఫీసర్ స్కేల్ III

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
రీజనింగ్ 40 50 2 గంటలు
కంప్యూటర్ నాలెడ్జ్ 40 20
ఫైనాన్సియల్ అవెర్నెస్ 40 40
హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & డేటా ఇంటర్ప్రిటేషన్ 40 50

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నియామక విధానం

ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నియామక ప్రక్రియ ప్రిలిమ్స్ పరీక్ష (ఫేజ్ 1) మరియు మెయిన్స్ (ఫేజ్ 2) పరీక్షలలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. స్థానిక గ్రామీణ బ్యాంకుల వారీగా ఉన్న ఖాళీలు ఆధారంగా మరియు ఆయా రిజర్వేషన్ల కోటాల వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అభ్యర్థులు స్థానిక భాష యందు పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలి.

Post Comment