ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ నోటిఫికేషన్ 2022 | దరఖాస్తు ప్రక్రియ, షెడ్యూల్ వివరాలు
Defence Jobs Latest Jobs

ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ నోటిఫికేషన్ 2022 | దరఖాస్తు ప్రక్రియ, షెడ్యూల్ వివరాలు

భారతీయ సైన్యంలో స్వల్పకాలిక ప్రాతిపాదికన ఆర్మీ అగ్నివీరుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. ఇది కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం పరిధిలో వెలువడిన మొదటి నియామక ప్రకటన. ఒక వైపు ఈ పథకం అమలుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని అమలుచేసే ప్రక్రియలో భాగంగా మొదటి రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

తాజా నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ జులైలో ప్రారంభం కానుంది. ఈ నియామక ప్రకటన ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్, అగ్నివీర్ టెక్నికల్ ఎగ్జామినర్ మరియు అగ్నివీర్ స్టోర్ కీపర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం జులై 2022
దరఖాస్తు తుది గడువు ఆగష్టు 2022
అడ్మిట్ కార్డు  -
రాతపరీక్ష  -
ఫలితాలు -

ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ఎలిజిబిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
  • అభ్యర్థులు అవివాహితులై ఉండాలి
  • అభ్యర్థులు పోస్టు వారీగా 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
  • అభ్యర్థుల వయసు 17.5 ఏళ్ళ నుండి గరిష్టంగా 23 ఏళ్ళ మధ్య ఉండాలి.
  • అభ్యర్థులు బౌతికంగా & మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
పోస్టు పేరు విద్య అర్హుత  వయోపరిమితి
అగ్నివీర్ జనరల్ డ్యూటీ 40 శాతం మార్కులతో పది ఉత్తీర్ణత 17 ½ - 23 ఏళ్ళు
అగ్నివీర్ టెక్నికల్ ఎగ్జామినర్ 40 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత 17 ½ - 23 ఏళ్ళు
అగ్నివీర్ టెక్నికల్  40 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత 17 ½ - 23 ఏళ్ళు
అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (10th) 40 శాతం మార్కులతో పది ఉత్తీర్ణత 17 ½ - 23 ఏళ్ళు
అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8th) 8వ తరగతి ఉత్తీర్ణత 17 ½ - 23 ఏళ్ళు
అగ్నివీర్ స్టోర్ కీపర్/క్లర్క్ 40 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత 17 ½ - 23 ఏళ్ళు

ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ నియామక తీరు

  • ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ కింద శిక్షణతో కలుపుకుని గరిష్టంగా 4 ఏళ్లలో కాలపరిమితితో నియామకాలు చేపట్టనున్నారు.
  • నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సైనికులలో కేవ‌లం 25 శాతం మంది సైనికుల్ని మాత్ర‌మే రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వీళ్ళు 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా సైనికులు వాలెంటరీ రిటైర్మెంట్ పద్దతితో ఇంటికి పంపబడతారు.
  • నాలుగేళ్ళ తర్వాత విరమించబడ్డ సైనికులకు, విరమణ సమయంలో సేవనిధి పేరిట 12 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు.
  • ఈ పథకం పరిధిలో ఎంపికైన వారికీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటివి లభించవు.
  • విరమణ పొందిన సైనికులకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ అందజేస్తారు.
  • అలానే ఉద్యోగంలో ఉన్నంతవరకు 48 లక్షల నాన్‌ కాంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్సు కల్పిస్తారు.
  • రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
  • అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఆర్మీ అగ్నివీర్ నియామక విధానం

ఆర్మీ అగ్నివీర్ నియామక ప్రక్రియ ఫీజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEC) ద్వారా ఎంపిక చేస్తారు. మెడికల్ టెస్ట్ మరియు రాతపరీక్ష సంబంధిత వివరాలు ర్యాలీ నియామక ర్యాలీ పూర్తి అయ్యాక తెలియజేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు తమకు ఆసక్తి ఉన్న రెజిమెంట్లు/యూనిట్ల యందు పనిచేసే అవకాశం కల్పిస్తారు. అలానే అవసరమైన సమయంలో ఏ రెజిమెంట్లు/యూనిట్ యందయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులకు 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది. ఈ శిక్షణ సమయం కూడా నాలుగేళ్ళ కాంట్రాక్టు పీరియడ్ యందు లెక్కించబడుతుంది. అలానే ఏడాది గరిష్టంగా ఏడాదికి 30 రోజుల సాధారణ సెలవలు కల్పిస్తారు. అలానే మెడికల్ సెలవలు కూడా అవసరం మేరకు పొందే అవకాశం ఉంది

ఆర్మీ అగ్నివీర్  ఫీజికల్ టెస్ట్

Agniveer Physical test

ఆర్మీ అగ్నివీర్ వేతనాలు

అగ్నిప‌థ్ స్కీమ్‌ ద్వారా ఎంపికైన అగ్నివీరులకు మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల వేతనం అందజేస్తారు. ఇందులో 9 వేల రూపాయలు కార్పస్ నిధికి జోడిస్తారు. మిగిలిన 21 వేలు అందజేస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తంలో  9 వేలు కార్పస్ నిధికి  జోడిస్తుంది. రెండవ ఏడాది నుండి ఏటా 10 శాతం చెప్పున వేతనాన్ని పెంచి చెల్లిస్తారు. అంటే రెండవ ఏడాది 33 వేలు, మూడవ ఏడాది 36 వేల ఐదువందలు, అలానే చివరి ఏడాది 40 వేలు వేతనాన్ని అందజేస్తారు.

నెలవారీ జీతం చేతికి ఇచ్చే జీతం కార్పస్ ఫండ్ (అభ్యర్థి + ప్రభుత్వం)
మొదటి ఏడాది 30,000/- 21,000/- 18,000 /-
రెండవ ఏడాది 33,000/- 23,100/- 19,800/-
మూడవ ఏడాది 36,500/- 25,580/- 21,900/-
నాలుగో ఏడాది 40,000/- 28,000/- 24,000/-

Advertisement

Post Comment