దక్షిణ అమెరికా దాదాపు 17,840,000 చదరపు కిలోమీటర్లు (6,890,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంతో ప్రపంచ ఖండాలలో నాల్గవ అతిపెద్దది. దక్షిణ అమెరికా పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం మరియు ఉత్తరం మరియు తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం సరిహద్దులుగా ఉంది. దక్షిణ అమెరికాలో మొత్తం 13 సౌర్వభౌమ దేశాలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో వైశాల్యం మరియు జనాభా ప్రకారం అతిపెద్ద దేశంగా బ్రెజిల్, అతి చిన్న దేశంగా సురినామ్ ఉన్నాయి.
వెనిజులాలో ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజెల్ ఫాల్స్ ఈ ఖండంలోనే ఉంది. దక్షిణ అమెరికా నిలయం ; గయానాలోని ఎత్తైన సింగిల్ డ్రాప్ కైటెర్ జలపాతం, నీటి పరిమాణంలో అతిపెద్ద నది అయినా అమెజాన్, పొడవైన పర్వత శ్రేణి అండీస్, భూమిపై అత్యంత పొడిగా ఉండే అటకామా ఎడారి, భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం అయినా కొలంబియాలోని లోపెజ్ డి మికే, అతిపెద్ద అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్, ప్రపంచంలో ఎత్తైన రాజధాని నగరం లా పాజ్ (బొలీవియా) ఏ ఖండంలోనే ఉన్నాయి.
దక్షిణ అమెరికా దేశాలు & రాజధానులు
నెం | దేశం | రాజధాని | కరెన్సీ | అధికారిక భాష |
---|---|---|---|---|
1 | బ్రెజిల్ | బ్రసిలియా | రియల్ (BRL) | పోర్చుగీస్ |
2 | అర్జెంటీనా | బ్యూనస్ ఎయిర్స్ | అర్జెంటీనా పెసో (ARS) | స్పానిష్ |
3 | పెరూ | లిమా | సోల్ (PEN) | స్పానిష్ |
4 | కొలంబియా | బొగోటా | పెసో (COP) | స్పానిష్ |
5 | బొలీవియా | సుక్రే శాంటా | బొలీవియన్ (BOB) | స్పానిష్ & క్రజ్ |
6 | వెనిజులా | కారకాస్ | బొలివర్ (VES) | స్పానిష్ |
7 | చిలీ | శాంటియాగో | చిలీ పెసో (CLP) | స్పానిష్ |
8 | పరాగ్వే | అసున్సియోన్ | గ్వారానీ (PYG) | స్పానిష్ & గ్వారానీ |
9 | ఈక్వెడార్ | క్విటో | యూఎస్ డాలర్ (USD) | కిచ్వా & స్పానిష్ |
10 | గయానా | జార్జ్‌టౌన్ | గయానీస్ డాలర్ (GYD) | ఇంగ్లీష్ |
11 | ఉరుగ్వే | మాంటెవీడియో | ఉరుగ్వే పెసో (UYU) | స్పానిష్ |
12 | సురినామ్ | పారామారిబో | డాలర్ (SRD) | డచ్ |
13 | ఫాక్లాండ్ ఐలాండ్స్ | స్టాన్లీ | ఫాక్లాండ్ పౌండ్ (FKP) | ఇంగ్లీష్ |