టీఎస్ లాసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, ఎగ్జామ్ తేదీ
Admissions TS CETs

టీఎస్ లాసెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, ఎగ్జామ్ తేదీ

టీఎస్ లాసెట్ 2024 మరియు టీఎస్  పీజీఎల్‌సెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ లా కళాశాలలో యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించే ఈ పరీక్షను జూన్ 3వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీఎస్ లాసెట్ మరియు టీఎస్ పీజీఎల్‌సెట్ పరీక్షలను ఒకేసారి ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పరీక్షలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది.

Exam Name TS LAWCET,  TS PGLCET 2024
Exam Type Entrance
Exam For Admission for LLB, LL.M
Exam Date 03/06/2024
Exam Duration 90 minutes
Exam Level State Level (Telangana)

టీఎస్ లాసెట్ vs టీఎస్ పీజీఎల్‌సెట్

  • టీఎస్ లాసెట్ ద్వారా తెలంగాణాలో ఉన్న న్యాయవిద్య కాలేజీలలో ఎల్ఎల్‌బి మరియు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్‌బి కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు నిర్వహిస్తారు.
  • టీఎస్  పీజీఎల్‌సెట్ ద్వారా తెలంగాణాలో లా యూనివర్సిటీలు మరియు కళాశాలల యందు న్యాయ విద్యకు సంబంధించే పోస్టుగ్రాడ్యుయేట్(ఎల్ఎల్ఎం) కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.

పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్షలను 90 నిముషాలలో 120 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్ష అర్హుతలో బ్యాచిలర్ స్థాయిలో రెండేళ్ల మరియు ఐదేళ్ల ఎల్ఎల్‌బితో పాటు మాస్టర్ స్థాయిలో రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశం పొందొచ్చు.

కోర్సు వ్యవధి  కోర్సులు 
3 ఏళ్ళ లా గ్రాడ్యుయేషన్ కోర్సులు LL.B. & LL.B. (Honours)
5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ లా గ్రాడ్యుయేషన్ కోర్సులు B.A.LL.B. | B.Com., LL.B. | BB.A. LL.B. etc.
2 ఏళ్ళ లా పీజీ కోర్సులు LL.M. (2 Years P.G. Course)

టీఎస్ లాసెట్ & పీజీఎల్ సెట్ వివరాలు

టీఎస్ లాసెట్ & పీజీఎల్‌సెట్ 2024 షెడ్యూల్

టీఎస్ లాసెట్ దరఖాస్తు ప్రారంభం 01 మార్చి 2024
టీఎస్ లాసెట్ దరఖాస్తు గడువు 15 ఏప్రిల్ 2024
టీఎస్ లాసెట్ చేర్పులు మార్పులు 16 ఏప్రిల్ 2024
టీఎస్ లాసెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ మే 2024
టీఎస్ లాసెట్ ఎగ్జామ్ తేదీ 03 జూన్ 2024
టీఎస్ పీజీఎల్‌సెట్ ఎగ్జామ్ తేదీ 03 జూన్ 2024
టీఎస్ లాసెట్ ఫలితాలు జూన్  2024
టీఎస్ లాసెట్ కౌన్సిలింగ్ జులై 2024

టీఎస్ లాసెట్ & పీజీఎల్‌సెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • తెలంగాణ యూనివర్సిటీ నియమాలకు సంబంధించి లోకల్/నాన్ లోకల్ అంశాలను అంతృప్తి పరచాలి.
  • బ్యాచిలర్ లా కోర్సుల ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్ లేదా 10+2 పూర్తిచేసి ఉండాలి.
  • పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • ప్రవేశపరీక్ష రాసేందుకు యెటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు
వివిధ లా కోర్సుల్లో చేరేందుకు అర్హుతలు
కేటగిరి మూడేళ్ళ ఎల్ఎల్‌బి ఐదేళ్ల ఎల్ఎల్‌బి రెండేళ్ల ఎల్ఎల్ఎం
ఓసీ కేటగిరి 45 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణత  45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత  50 శాతం మార్కులతో LLB/BL ఉత్తీర్ణత
బీసీ కేటగిరి 45 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణత 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత 50 శాతం మార్కులతో LLB/BL ఉత్తీర్ణత
ఎస్సీ, ఎస్టీ 40 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణత 40 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం మార్కులతో LLB/BL ఉత్తీర్ణత

టీఎస్ లాసెట్ & పీజీఎల్‌సెట్ దరఖాస్తు ఫీజు

పరీక్ష పేపర్ రిజిస్ట్రేషన్ ఫీజు
టీఎస్ లాసెట్ 900/- (SC/ST 600/-)
టీఎస్ పీజీఎల్‌సెట్ 1100/- (SC/ST 900/-)
  • దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
  • దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

టీఎస్ లాసెట్ & పీజీఎల్‌సెట్ దరఖాస్తు

తెలంగాణ లా సెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. తెలంగాణ అధికారిక లా సెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అడిగిన వివరాలు పూరించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీరు ఇచ్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తు ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

టీఎస్ లాసెట్ & పీజీఎల్‌సెట్ ఎగ్జామ్ సెంటర్లు

హైదరాబాద్ పశ్చిమ
హైదరాబాద్ నార్త్
హైదరాబాద్ సెంట్రల్
హైదరాబాద్ సౌత్-ఈస్ట్
హైదరాబాద్ ఈస్ట్
కరీంనగర్
విజయవాడ
కర్నూలు
ఖమ్మం
కోడాడ్
నల్గొండ
మహాబుబ్‌నగర్
వరంగల్
నిజామాబాద్
తిరుపతి
విశాఖపట్నం,

టీఎస్ లాసెట్ 2024 ఎగ్జామ్ నమూనా

టీఎస్ లా సెట్ ప్రధానంగా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, కరెంటు అఫైర్స్ మరియు లా అధ్యయనానికి సంబంధించిన అంశంలో అభ్యర్థుల అవగాహనను అంచనా వేసేందుకు రూపొందించబడింది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.

90 నిముషాలలో మొత్తం 120 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. ఐదేళ్ల LLB కి సంబంధించిన ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్ తో, రెండేళ్ల LLB సంబంధించిన ప్రశ్నపత్రం బ్యాచిలర్ స్థాయిలో సిలబస్ లో యివ్వబడుతుంది.

ఎల్ఎల్‌బి ప్రశ్నపత్రం నమూనా
సెక్షన్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
సెక్షన్ A జనరల్ నాలెడ్జ్ 30 30
సెక్షన్ B మెంటల్ అబిలిటీ 30 30
సెక్షన్ C ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా 60 60

టీఎస్ పీజీఎల్‌సెట్ 2024 ఎగ్జామ్ నమూనా

ఎల్ఎల్ఎం కోర్సులకు సంబంధించి అన్ని కోర్సులకు ఒకే పీజీఎల్‌సెట్ నిర్వహించబడుతుంది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం రెండు పార్టులు ఉంటాయి. పార్ట్ A 40 ప్రశ్నలు ఉండగా, పార్ట్ B లో 80 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 90 నిముషాలలో  మొత్తం 120 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది.

టీఎస్ పీజీఎల్‌సెట్ ప్రశ్నపత్రం నమూనా
పార్ట్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ A Jurisprudence (20), Constitutional Law (20) 40 40
పార్ట్ B public International Law (16) Mercantile
Law (16), Labor Law (16), Crimes and Torts (16), and IPR & Other Laws (16)
80 80

టీఎస్ లాసెట్ & పీజీఎల్‌సెట్ సిలబస్

టీఎస్ లాసెట్ (3Y) సిలబస్ టీఎస్ లాసెట్ (5Y) సిలబస్ టీఎస్  పీజీఎల్‌సెట్ సిలబస్

Post Comment