Advertisement
ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2023 : ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ఫార్మేట్
Bank Jobs Latest Jobs

ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2023 : ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ఫార్మేట్

ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2022 వెలువడింది. ప్రభుత్వరంగ బ్యాంకులలో మొత్తం 6.035 క్లరికల్ సిబ్బంది నియామకం కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 20 నుండి 28 ఏళ్ళ మధ్య వయసు ఉండే అభ్యర్థులు 21 జులై 2022 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2022 సంబంధించి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్య నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,035 క్లరికల్ కేడర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ యందు 209 పోస్టులు, తెలంగాణ యందు 99 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

నోటిఫికేషన్ నెంబర్ CRP CLERKS-IX
పోస్టుల సంఖ్యా 6032
నోటిఫికేషన్ తేదీ 01 July 2022
దరఖాస్తు తుది గడువు 21 July 2022
పరీక్ష ఫీజు 600/-

ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగ తీరు & జీతాలు

21 భారతీయ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ప్రతిభవంతులైన యువ గ్రాడ్యుయేట్లను జూనియర్ అసోసియేట్ లుగా నియమించేందుకు ఐబిపిఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్(సీఆర్పీ) క్లర్క్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఐబిపిఎస్ నియామక పరీక్ష ద్వారా క్లరికల్ కేడర్లో ఎంపికైన జూనియర్ అస్సోసియేట్లు, బ్యాంకు రోజువారీ విధులు సరిజేసే సింగిల్ విండో ఆపరేటర్స్ గా విధులు నిర్వహిస్తారు.

వీరు ప్రాథమిక స్థాయిలో ఖాతాదార్లకు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించడం, ధన లావాదేవీలలో సహాయం అందించడం, డీడీలు, చెక్ బుక్స్ జారీచేయటం అవసమయ్యే సమయాల్లో క్యాషీయర్స్ గా కూడా విధులు నిర్వహించవల్సి ఉంటుంది.

క్లరికల్ సిబ్బంది కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఎంపికైన మూడేళ్ల తర్వాత పనితీరు ఆధారంగా ప్రమోషన్ ప్రకియలో జూనియర్ అసోసియేట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.

ఐబిపిఎస్ జూనియర్ అసోసియేట్స్ కు ప్రారంభ జీతం యేటా రూ. 655/- ఇంక్రిమెంటుతో 11,765 /- రూపాయిలు అందిస్తారు. మెట్రో నగరాలలో సిబ్బంది ప్రారంభ వేతనం 25 వేల వరకు లభిస్తుంది. ప్రతి మూడేళ్లకు ఇంక్రిమెంట్ పెంపు ఉంటుంది. వీటితో పాటుగా సాధారణ అలోవెన్సులు ప్రొత్సాకాలు ఉండనే ఉంటాయి.

ఐబిపిఎస్ క్లర్క్ పోస్టులు భర్తీ చేసే ప్రభుత్వ బ్యాంకులు

అలాహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్
ఆంధ్రాబ్యాంక్ ఇండియన్ ఓవెర్సిస్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ బోరోడ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంజాబ్ & సింధ్ బ్యాంక్
కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంక్
కార్పోరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనిటీడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఐబీపీఎస్ క్లర్క్ 2022 షెడ్యూల్

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ 01 జులై 2022
దరఖాస్తు తుది గడువు 21 జులై 2022
కాల్ లెటర్ డౌన్‌లోడ్ ఆగష్టు 2022
ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2022
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్/అక్టోబర్ 2022
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ షెడ్యూల్
మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ అక్టోబర్ 2022
మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2022
మెయిన్స్ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 2022
ప్రోవిషనల్ అల్లొట్మెంట్ ఏప్రిల్ 2023

ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎలిజిబిలిటీ

  • విద్య అర్హుత: ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్ కు ధరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా దానికి సరితూగే డిగ్రీని పూర్తిచేసి ఉండాలి.
  • ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు
  • అదే విధంగా మాజీ సైనిక ఉద్యోగులు,  త్రివిధ దళాల్లో15 ఏళ్ళ లోపు సర్వీస్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • ఇంగ్లీష్ నైపుణ్యం: ధరఖాస్తు చేసే అభ్యర్థులు ఆంగ్ల బాషా పరిజ్ఞానం కలిగివుండాలి (ఇంగ్లీష్ రాయడం, చదవటం తెలిసి ఉండాలి)
  • వయోపరిమితి: ధరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఐబీపీఎస్ క్లర్క్ దరఖాస్తు ఫీజు

కేటగిరి ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ)
1 ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ 100/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ )
2 జనరల్ మరియు ఓబీసీ 600/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ)

ఐబీపీఎస్ క్లర్క్ దరఖాస్తు ప్రక్రియ

ఐబిపిఎస్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హుత ఉన్న అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా ఐబీపీఎస్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పరీక్ష కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి.

అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

తెలుగు రాష్ట్రాలలో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ పరీక్ష కేంద్రాలు తెలంగాణ పరీక్ష కేంద్రాలు
ప్రిలిమినరీ పరీక్ష:  చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రిలిమినరీ పరీక్ష: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం 
మెయిన్ పరీక్ష: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మెయిన్ పరీక్ష: హైదరాబాద్ 

ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ నమూనా

ఐబిపిఎస్ క్లరికల్ నియామక పరీక్ష మూడు దశలలో నిర్వహించబడుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవ దశలో మెయిన్స్ ఎగ్జామినేషన్, మూడవ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిర్వహించబడుతుంది.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష విధానం

ప్రాథమిక స్థాయిలో అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఆన్లైన్ జరిగే ఈ ఆబ్జెక్ట్ టెస్టులో మూడు సెక్షన్లలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ మూడు సెక్షన్లలో జనరల్ ఇంగ్లీష్, న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్  కి సంబంధించి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో సెక్షన్ కు 20 నిముషాలు చెప్పున, ఒక గంట వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడతాయి.

అభ్యర్థులు మూడు సెక్షన్లలో కనీస అర్హుత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కేటగిరి వారీగా ఉన్న ఖాళీలకు సుమారుగా 20 రేట్లు మెరిట్ అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 (30 మార్కులు ) 20 నిముషాలు
2 న్యూమరికాల్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
3 రీజనింగ్ ఎబిలిటీ 35 (30 మార్కులు ) 20 నిముషాలు
4 మొత్తం 100 (100 మార్కులు ) 60 నిముషాలు

ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ సిలబస్

ఇంగ్లీష్ లాంగ్వేజ్

Reading Comprehension, Tenses Rules Cloze Test (Fill in the Blanks), Jumbled Paragraphs, Idioms and Phrases, Multiple Meaning, Error Spotting Correction, Paragraph Comprehension and Preposition Rules.

న్యూమరికాల్ ఎబిలిటీ

Logical Reasoning, Alphanumeric Series, Alphabetic Series and Ranking, Data Sufficiency Tests, Coded Inequalities, Direction Test, Seating Arrangements, Puzzles, Tabulation, Syllogism, Input/Output, Coding and Decoding, Blood Relations.

రీజనింగ్ ఎబిలిటీ

Profit, Loss and Discounts, Mixtures and Alligations, Simple and Compound Interest, Surds and Indices, Work and Time Equations, Time and Distance Equations, Mensuration: Cone, Sphere, Cylinder, Data Interpretation Ratio, Proportion and Percentage Number Systems Sequences and Series Permutation, Combination and Probability

ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష విధానం

ప్రిలిమ్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా పూర్తి ఆన్‌లైన్ లో పద్దతిలో నిర్వహించబడుతుంది.

ఐదు సెక్షన్లలో 200 మార్కులకు జరిగే ఈ పరీక్షను 2 గంటల 40 నిముషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతి సెక్షనుకు నిర్దిష్ట సమయం ఇవ్వబడవుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడుతుంది.

S.NO సెక్షన్ / సబ్జెక్ట్ ప్రశ్నలు (మార్కులు) సమయం
1 జనరల్/ఫైనాన్సియల్ అవేర్నెస్ 50 (50 మార్కులు ) 35 నిముషాలు
2 జనరల్ ఇంగ్లీష్ 40 (40 మార్కులు ) 35 నిముషాలు
3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 (50 మార్కులు ) 45 నిముషాలు
4  రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 (60 మార్కులు ) 45 నిముషాలు
5 మొత్తం 190 (200 మార్కులు ) 2 గంటల 40 నిముషాలు

ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ సిలబస్

జనరల్/ఫైనాన్సియల్ అవేర్నెస్

Static GK – Static General Knowledge, Current Affairs Banking, Awareness India’s Financial and Banking System Budget and Monetary Plans of the Government Key National Institutions Basics of Banking.

జనరల్ ఇంగ్లీష్

Vocabulary, Tenses Rules, Grammar Idioms & Phrases Reading Comprehension

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

Ratio and Proportion, Time Speed and Distance, Work and Time Equations, Mixtures and Alligations Measures of Central Tendency and Basic Statistics( Mean, Average, Median and Variance etc.), Stocks Shares and Debentures, Percentages, Clock Ray Questions, Volume and Surface Area, Logarithms, Permutation and Combination, Partnerships Heights and Distances Probability, Simple and Compound Interest, Profit, Loss and Discounts Basic Algebra Basic Trigonometry Charts, Bars and Graphs Data Interpretation.

 రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్

Reasoning Ability, Analogy Assumptions and Statements, Syllogism, Coding and Decoding, Blood Relations, Sense of Direction and Distance, Alphanumeric Series, Non-Verbal Reasoning, Computer Aptitude, Basics of Hardware and Software, Operating Systems, Internet and associated topics Microsoft Office and other word processing software History of Computing Basic Computer Networking Basics of Databases Basics of Cyber Security Tools and Processes.

ఐబీపీఎస్ క్లర్క్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ

మెయిన్స్ నియామక పరీక్ష యొక్క కనీస అర్హుత మార్కులను ఆయా టెస్టుల యందు అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఐబిపిఎస్ నిర్ణహిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. 200 మార్కులకు జరిగిన మెయిన్స్ పరీక్ష మొత్తం స్కోరును వివిధ అంశాల ఆధారంగా 100 మార్కులకు నార్మలైజ్ చేస్తారు.

మెయిన్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులను కేటగిరి వారీగా అవరోహణ క్రమంలో అమర్చి. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను అనుచరించి ప్రొవిజనల్ లెటర్స్ జారీచేస్తారు. మెరిట్ జాబితాను ఐబిపిఎస్ లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంకులకు అందజేస్తారు. ఇంతటితో ఐబిపిఎస్ బాధ్యతముగుస్తుంది.

బ్యాంకులు ఐబిపిఎస్ మెరిట్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపి అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా ట్రయినింగ్ కోసం ఆహ్వానిస్తాయి. పది మార్కుల షీటుపై ఉన్న బాషాను ప్రామాణికంగా తీసుకుని, ఇంటర్వ్యూ సమయంలో లేదా తుది ఎంపిక ముందు అభ్యర్థులకు అధికారిక లేదా స్థానిక బాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు.

అధికారిక లేదా స్థానిక బాషా యందు ప్రావిణ్యం లేని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. ఓబీసీ కేటగిరిలో ఇంటర్వ్యూ కి అర్హుత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో నాన్ క్రిమీ లేయర్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఓబీసీ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. లేకుంటే సదురు అభ్యర్థిని జనరల్ కేటగిరిగా భావిస్తారు. ట్రయినింగ్ పిరియడ్ పూర్తియ్యాక అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జాయినింగ్ లేటర్ అందజేస్తారు.

ఐబీపీఎస్ క్లర్క్ క్వాలిఫై మార్కులు

ఐబిపిఎస్ క్లరికల్ మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు కనీస అర్హుత మార్కులు పొందాల్సి ఉంటుంది. ఐబిపిఎస్ క్లర్క్ కటాఫ్ మార్కులను రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీ పోస్టులు మరియు రిజర్వేషన్ కోటా ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

మాక్ టెస్ట్  ప్రశ్నలు -సందేహాలు  
ప్రిలిమినరీ పరీక్షా అవగాహన వీడియో  మెయిన్స్ పరీక్షా అవగాహన వీడియో 

Post Comment