కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు : ఫిబ్రవరి 2022
Current Affairs Bits 2022 Study Material

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాదానాలు : ఫిబ్రవరి 2022

కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2022 నెలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ వంటి అంశాలకు చెందిన సాధన ప్రశ్నలను ప్రయత్నించండి.పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారు, తాజా అంశాల యందు మీ సన్నద్ధతను పరీక్షించుకోండి.

1. హోండురాస్ తొలి మహిళా అధ్యక్షరాలుగా ఎన్నికైనది ఎవరు ?

  1. జియోమారా కాస్ట్రో
  2. జసిండా ఆర్డెర్న్
  3. డమిలోలా ఒడుఫువా
  4. కమలా హారిస్

2. యూఎస్ సుప్రీంకోర్టులో మొదటి నల్లజాతి మహిళ జడ్జిగా ప్రమాణస్వీకారం చేసింది ఎవరు ?

  1. జానీ షోర్స్
  2. ప్యాట్రిసియా ఎం. స్మిత్
  3. కేతంజీ బ్రౌన్ జాక్సన్‌
  4. జీన్ బ్రౌన్

3. భారతదేశపు యూపీఐ వ్యవస్థను అనుచరించిన మొదటి దేశం ఏది ?

  1. భూటాన్
  2. శ్రీలంక
  3. నేపాల్
  4. బాంగ్లాదేశ్

4. దేశంలో మొట్టమొదటి వాటర్ టాక్సీ సర్వీసును ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. కేరళ
  2. మహారాష్ట్ర
  3. గుజరాత్
  4. చెన్నై

5. "ఆపరేషన్ గంగా" అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. గంగ నది క్లీనింగ్
  2. ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్
  3. ఆఫ్గనిస్తాన్ నుండి భారత పౌరుల తరలింపు
  4. ఉక్రెయిన్ నుండి భారత పౌరుల తరలింపు

6. యూజీసీ నూతన ఛైర్మన్‌ ఎవరు ?

  1. శక్తికాంత దాస్
  2. దినేష్ కుమార్ ఖరా
  3. ప్రొ. డి.పి.సింగ్
  4. ఎం జగదీష్ కుమార్

7. క్వీన్ ఆఫ్ మెలోడీ అని క్రింది వారిలో ఎవరిని సంబోధిస్తారు ?

  1. ఎంఎస్ సుబ్బలక్ష్మి
  2. లతా మంగేష్కర్
  3. ఆశా భోంస్లే
  4. కేఎస్ చిత్ర

8. సీబీఎస్ఈ నూతన చైర్మన్‌ ఎవరు ?

  1. వినీత్ జోషి
  2. ఎస్ . కిషోర్
  3. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌
  4. దినేష్ ప్రసాద్ సక్లానీ

9. 'మిషన్ వాత్సల్య' క్రింది వాటిలో దేనికి చెందింది  ?

  1. అనాథ పిల్లల పునరావాసం
  2. వయోజనా విద్య కార్యక్రమం
  3. పేదలకు ఉచిత రేషన్
  4. బాలింతల పోషకాహార పథకం

10. "స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ" విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. గుజరాత్
  2. మహారాష్ట్ర
  3. ఢిల్లీ
  4. తెలంగాణ

11. "ఫియర్లెస్ గవర్నెన్స్" పుస్తక రచయత ఎవరు ?

  1. తమిళిసై సౌందరరాజన్
  2. కిరణ్ బేడీ
  3. నిర్మల సీతారామన్
  4. మమతా బెనర్జీ

12. డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ పొందిన ఇండియన్ డాక్యూమెంటరీ ?

  1. రైటింగ్ విత్ ఫైర్
  2. 3D స్టీరియో క్యాస్ట్
  3. మతితాలి కుస్తీ
  4. అన్‌రిజర్వ్‌డ్

13. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?

  1. రాజస్థాన్
  2. గుజరాత్
  3. మహారాష్ట్ర
  4. మధ్యప్రదేశ్

14. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా నూత సీఈఓ & ఎండీ ఎవరు ?

  1. పీయూష్ గోయల్
  2. అశ్వని లోహాని
  3. ఇల్కర్ ఐసీ
  4. ఎన్ చంద్రశేఖరన్

15. నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సీఈఓ ?

  1. అభిషేక్ సింగ్
  2. మాధబి పూరీ బుచ్
  3. పుష్ప్ కుమార్ జోషి
  4. అశ్విని వైష్ణవ్

16. కొత్తగా నియమితులైన ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ ఎవరు ?

  1. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
  2. లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి
  3. లెఫ్టినెంట్ జనరల్ జిఎవి రెడ్డి
  4. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్

17. ఇటీవలే ఇండియా నుండి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుపొందిన టన్నెల్ ఏది ?

  1. త్రివేండ్రం పోర్ట్ టన్నెల్
  2. పీర్ పంజాల్ రైల్వే టన్నెల్
  3. అటల్ టన్నెల్
  4. ఖాజిగుండ్ రోడ్ టన్నెల్

18. భారత నావికాదళపు మిలాన్ ఎక్సరసైజ్ 2022 ఏ నగరంలో నిర్వహించారు ?

  1. మహారాష్ట్ర
  2. చెన్నై
  3. విశాఖపట్నం
  4. కోల్‌కతా

19. 'జైల్ వాణి' ఎఫ్ఎం రేడియో ఛానెల్ ప్రారంభించిన సెంట్రల్ జైలు ఏది ?

  1. తీహార్ జైలు
  2. ఇండోర్ సెంట్రల్ జైలు
  3. నైని సెంట్రల్ జైలు
  4. రాజమండ్రి సెంట్రల్ జైలు

20. ఖిజాడియా పక్షుల అభయారణ్యం ఏ రాష్టంలో ఉంది ?

  1. మధ్యప్రదేశ్
  2. అస్సాం
  3. గుజరాత్
  4. రాజస్థాన్

21. బోల్ట్జ్‌మన్ మెడల్ పొందిన భారతీయ ప్రొఫెసర్ ఎవరు ?

  1. డాక్టర్ ఆర్. శివరామన్
  2. డాక్టర్ శ్యామ్ సుందర్ అగర్వాల్
  3. డా. దిలీప్ కుమార్ సస్మాల్
  4. ప్రొఫెసర్ దీపక్ ధర్‌

22. ఇటీవలే 'అస్సాం బైభవ్‌' అవార్డు అందుకున్న వ్యాపారవేత్త ఎవరు ?

  1. రతన్ టాటా
  2. అజీమ్ ప్రేమ్‌జీ
  3. సైరస్ పూనావల్ల
  4. నారాయణ మూర్తి

23. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ?

  1. ఫిబ్రవరి 02
  2. ఫిబ్రవరి 04
  3. ఫిబ్రవరి 06
  4. ఫిబ్రవరి 08

24. సెంట్రల్ ఎక్సైజ్ డే ?

  1. ఫిబ్రవరి 21
  2. ఫిబ్రవరి 22
  3. ఫిబ్రవరి 23
  4. ఫిబ్రవరి 24

25. ప్రపంచ ఎన్‌జిఓ దినోత్సవం ?

  1. ఫిబ్రవరి 25
  2. ఫిబ్రవరి 26
  3. ఫిబ్రవరి 27
  4. ఫిబ్రవరి 28

26. అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఎవరు ?

  1. పాకిస్తాన్
  2. ఆస్ట్రేలియా
  3. ఇండియా
  4. ఇంగ్లాండ్

27. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెను ఎవరు ?

  1. సకీబుల్ గని
  2. యశ్ ధుల్
  3. షేక్ రషీద్
  4. సర్ఫరాజ్

28. ఈఎస్‌పీఎన్‌ క్రిక్ఇన్ఫో కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ 2022 ?

  1. కేన్ విలియమ్సన్
  2. విరాట్ కోహ్లీ
  3. ఆరోన్ ఫించ్
  4. ఇయాన్ మోర్గాన్

29. 2023 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్‌కు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ?

  1. విశాఖపట్నం
  2. న్యూఢిల్లీ
  3. ముంబాయి
  4. అహ్మదాబాద్

30. EIU డెమోక్రసీ ఇండెక్స్ 2021లో భారత్ స్థానం ?

  1. 46 వ స్థానం
  2. 83 వ స్థానం
  3. 64 వ స్థానం
  4. 38 వ స్థానం

Post Comment