నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) బోర్డును జాతీయ అవసరాల దృష్ట్యా 1990 లో భారత మానవ వనురుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సీబీఎస్ఈ ఉమ్మడిగా స్థాపించాయి. అందరికి స్వచ్చంద విద్యను అందించడంతో పాటుగా దేశంలో నిరక్షరాస్యత తగ్గించేందుకు జాతీయ దృక్పధంతో ఒక పైలెట్ ప్రాజెక్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ బోర్డును ఏర్పాటు చేసారు.
ఎన్ఐఓఎస్, సీబీఎస్ఈ మరియు సిఐఎస్‌సిఈ మాదిరిగా జాతీయ స్థాయిలో ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు డిస్టెన్స్ స్కూల్ ఎడ్యుకేషన్‌ను అందిస్తుంది. నిరక్ష్యరాసులకు, చదువుకు దూరమైన నిరుపేద విద్యార్థులకు, గృహాణిలు మరియు పాఠశాల విద్యకు నోచుకోని గ్రామీణులకు ప్రాథమిక విద్యను అందించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుంది.
14 ఏళ్ళు నిండిన వారు ఎవరైనా ఎన్ఐఓఎస్ అధికారిక పోర్టల్ ద్వారా సెకండరీ ఎడ్యుకేషన్ లేదా సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఐఓఎస్ ఏటా రెండు విడతల్లో అడ్మిషన్ నిర్వహిస్తుంది. మొదటి విడత ప్రవేశ ప్రకటన ఏప్రిల్ లేదా మే నెలలలో, రెండవ విడుత ప్రకటన అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో విడుదల చేస్తారు.
ఎన్ఐఓఎస్ సర్టిఫికెట్లను కేంద్ర, రాష్ట్రాల అన్ని ప్రభుత్వాలు, యూనివర్శిటీలు ఆమోదిస్తాయి. ఎన్ఐఓఎస్ ద్వారా ప్రైమరీ, సెకండరీ, ఇంటర్ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు, సంబంధిత అర్హుతతో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలానే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ నియామక పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్ఐఓఎస్, ఓపెన్ స్కూల్ మరియు డిస్టెన్స్ స్కూల్ విధానంలో ప్రైమరీ, సెకండరీ, ఇంటర్ మరియు డిప్లొమా మరియు ఒకేషనల్ విద్యను ఆఫర్ చేస్తుంది. ఏటా దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎన్ఐఓఎస్ ద్వారా సెకండరీ ఎడ్యుకేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్ఐఓఎస్ అందిస్తున్న కోర్సులు లేదా ప్రోగ్రామ్స్..
- ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ (OBE)
- సెకండరీ ఎడ్యుకేషన్ కోర్సు (టెన్త్ క్లాస్)
- సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ కోర్సు (ఇంటర్మీడియట్)
- ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సు/ప్రోగ్రామ్స్
- డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
ఎన్ఐఓఎస్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్రెడిట్ (TOC)
ఎన్ఐఓఎస్ ద్వారా ఓపెన్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు క్రెడిట్ బదిలీ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదివరకు దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన సెకండరీ లేదా సీనియర్ సెకండరీ బోర్డు ద్వారా కనీసం ఒక సబ్జెక్టు యందు ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు ఈ క్రెడిట్ బదిలీ స్కీమ్ వర్తిస్తుంది.
ఈ సౌలభ్యం ద్వారా గతంలో ఉత్తీర్ణత పొందిన సబ్జెక్టుల మార్కులను నేరుగా ఎన్ఐఓఎస్ కోర్సులోకి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సదురు సబ్జెక్టు యందు మళ్ళీ ఉత్తీర్ణత పొందల్సిన అవసరం ఉండదు. అయితే గతంలో తీసుకున్న కోర్సు, ఇప్పుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు/ కోర్సు ఒక్కటయ్యి ఉండాలి. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్రెడిట్ సౌలభ్యంను పొందాలనుకునే వారు, దరఖాస్తు సమయంలోనే ఈ విషయాన్ని దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఎన్ఐఓఎస్ సెకండరీ & సీనియర్ ఎడ్యుకేషన్ రిజిస్ట్రేషన్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా సెకండరీ లేదా సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలనుకునే వారు ఎన్ఐఓఎస్ అధికారిక వెబ్సైటు (www.sdmis.nios.ac.in) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్ఐఓఎస్ ఎలిజిబిలిటీ
ఎన్ఐఓఎస్ సెకండరీ ఎడ్యుకేషన్ కోసం దరఖాస్తు చేసేవారికి 14 ఏళ్ళు నిండి ఉండాలి. అలానే ఎన్ఐఓఎస్ ద్వారా ఇష్టపూర్వకంగా సెకండరీ ఎడ్యుకేషన్ పొందుతున్నట్లు సెల్ఫ్ సర్టిఫికెట్ అందించాలి. అలానే ఎన్ఐఓఎస్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ళు నిండి ఉండాలి. అలానే ఏదైనా ఒక బోర్డు నుండి సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసి ఉండాలి.
ఎన్ఐఓఎస్ అడ్మిషన్ షెడ్యూల్ 2023
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్ నిర్వహిస్తుంది. అవి ఏప్రిల్/మే లేదా అక్టోబర్/నవంబర్ లో అడ్మిషన్ ప్రక్రియ చేపడతారు.
అడ్మిషన్ బ్లాక్ | అడ్మిషన్ తేదీలు | అడ్మిషన్ ఫీజు | ఎగ్జామ్ తేదీలు |
---|---|---|---|
బ్లాక్ I : ఏప్రిల్/మే 2022 | 16th March - 31 July 1 Aug - 15th Aug 16th Aug to 31st Aug 1st Sept to 15th Sept |
Normal Fee Late fee 200/- Late fee 400/- Late fee 700/- |
April/May, 2023 |
బ్లాక్ II : అక్టోబర్/నవంబర్ 2022 | 16th Sept. to 31st Jan 1st Febr to 15th Feb 16th Feb to 28th Feb 1st Mar to 15th Mar |
Normal Fee Late fee 200/- Late fee 400/- Late fee 700/- |
October/November, 202 |
ఎన్ఐఓఎస్ ట్యూషన్ ఫీజులు
సెకండరీ ఎడ్యుకేషన్ (క్లాస్ 10) | |||
---|---|---|---|
కోర్సు / సబ్జెక్టులు | పురుషులు | మహిళలు | ఎస్సీ, ఎస్టీ PWD |
5 సబ్జెక్టులకు | 1800/- | 1450/- | 1200/- |
ప్రతి అదనపు సబ్జెక్టుకు | 720/- | 720/- | 720/- |
సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ (క్లాస్ 12) | |||
5 సబ్జెక్టులకు | 2000/- | 1650/- | 1300/- |
ప్రతి అదనపు సబ్జెక్టుకు | 720/- | 720/- | 720/- |
వీటితో పాటుగా సెకండరీ ఎడ్యుకేషన్ కోర్సు మెటీరియల్ కోసం 360/- మరియు సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ కోర్సు మెటీరియల్ కోసం 400/- రూపాలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
కావాల్సిన డాక్యూమెంట్స్
- ఇటీవలే తీసుకున్న కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- సంతకం బ్లాక్ ఇంక్ తో
- ఆధార్ కార్డు
- డేట్ ఆఫ్ బర్త్ & రెసిడెన్సీ సర్టిఫికెట్
- 8th క్లాస్ మార్కుల షీట్ (సెకండరీ ఎడ్యుకేషన్), 10th క్లాస్ మార్కుల షీట్ ( సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్)
- కుల ధ్రువీకరణ పత్రం