ఇండియన్ రైల్వే మినిస్ట్రీ కార్యాలయాల్లో మరియు రైల్వే జోనల్ కార్యాలయాల్లో వెల్ఫేర్ ఇన్సపెక్టర్స్, చీఫ్ లా అసిస్టెంట్స్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, హెడ్ కూక్స్, సీనియర్ పబ్లిసిటీ ఇన్సపెక్టర్స్, పీజీటీ, టీజీటీ, పీటీఐ టీచర్స్, స్టెనోగ్రాఫర్స్, ట్రాన్సిలాటర్స్ అసిస్టెంట్ టీచర్స్ మరియు మ్యూజిక్ టీచర్లను నియమించేందుకు ఆర్‌ఆర్‌బి మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది.
ఇంటర్మీడియట్ నుండి పోస్టుగ్రాడ్యుయేషన్ స్థాయిలో విభిన్న కేటగిర్లలో భర్తీచేసే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ పరంగా, నియామక పరీక్షా పరంగా మరియు ఎంపిక పరంగా ఎటువంటి పోలిక ఉండదు. ఈ నియామక ప్రకటనకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ నుండి తుది నియామక ప్రక్రియ వరకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండితీరాల్సిందే.
నియామక బోర్డు | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
నియామక పరీక్షా | మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామ్ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్షా/స్కిల్ టెస్టులు |
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | ఇంటర్ నుండి పీజీ |
వయో పరిమితి | 18 - 35 ఏళ్ళ మధ్య |
సిలబస్ | క్లిక్ చేయండి |
ఎలిజిబిలిటీ
- జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
- వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 35 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
- విద్య అర్హుత : పోస్టుల వారీగా ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఫీజికల్ ప్రమాణాలు: ఆర్‌ఆర్‌బి రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు | |
---|---|
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 500/- |
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు | 250/- |
దరఖాస్తు విధానం
అర్హుత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా బోర్డు అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి.
పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
ఈ పరీక్షకు సంబంధించిన తేదీ, సమయం, పరీక్షా కేంద్రం మరియు ఇతర వివరాలను అర్హుత ఉన్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బి నేరుగా అందజేస్తుంది
జోన్స్ వారీగా ఆర్‌ఆర్‌బి సమాచారం | |
---|---|
Ahmedabad www.rrbahmedabad.gov.in Phone : 079-22940858 | Jammu Srinagar www.rrbjammu.nic.in Phone : 0191-2476757 |
Ajmer www.rrbajmer.gov.in Phone: 0145 – 2425230 | Kolkata www.rrbkolkata.gov.in Phone: 033 – 25430108 |
Allahabad www.rrbald.nic.in Phone : 0532-2224531 | Malda www.rrbmalda.gov.in Phone : 03512-264567 |
Bangalore www.rrbbnc.gov.in Phone: 080 – 23330378 | Mumbai www.rrbmumbai.gov.in Phone : 022-23090422 |
Bhopal www.rrbbpl.nic.in Phone : 0755-2746660 | Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in Phone : 0621-2213405 |
Bhubaneswar www.rrbbbs.gov.in Phone : 0674-2303015 | Patna www.rrbpatna.gov.in Phone: 0612-2677680 |
Bilaspur www.rrbbilaspur.gov.in Phone : 07752-247291 | Ranchi www.rrbranchi.gov.in Phone : 0651-2462429 |
Chandigarh www.rrbcdg.gov.in Phone: 0172 – 2730093 | Secunderabad www.rrbsecunderabad.nic.in Phone : 040-27821663 |
Chennai www.rrbchennai.gov.in Phone : 044-28275323 G | Siliguri www.rrbsiliguri.org Phone : 0353-2663840 |
orakhpur www.rrbgkp.gov.in Phone : 0551-2201209 | Guwahati www.rrbguwahati.gov.in Phone: 0361 – 2540815 |
Thiruvanthapuram www.rrbthiruvananthapuram.gov.in Phone : 0471-2323357 |
ఎగ్జామ్ నమూనా
మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల నియామక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన అభ్యర్థులకు పోస్టుల వారీగా వివిధ నైపుణ్య పరీక్షలు జరుపుతారు. ఇందులో అర్హుత పొందిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి విధుల్లోకి తీసుకుంటారు.
కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్
ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆన్‌లైన్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రోఫిసినల్ ఎబిలిటీ, జనరల్ అవెర్నెస్, జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించి 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా వ్యవధి 90 నిముషాలు ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 0.25 మార్కులు తొలగిస్తారు.
ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
ప్రోఫిసినల్ ఎబిలిటీ | 50 | 50 | 90 నిముషాలు |
జనరల్ అవెర్నెస్ | 15 | 15 | |
జనరల్ అర్థమెటిక్ & జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ | 15 | 15 | |
మ్యాథమెటిక్స్ | 10 | 10 | |
జనరల్ సైన్స్ | 10 | 10 |
సిలబస్
Mathematics: Number Systems, BODMAS, Decimals, Fractions, LCM and HCF, Ratio and Proportions, Percentage, Mensuration, Time and Work, Time and Distance, Simple and Compound Interest, Profit and Loss,Algebra, Geometry and Trigonometry, Elementary Statistics, Square Root, Age Calculations, Calendar & Clock, Pipes & Cistern.
General Intelligence and Reasoning: Analogies, Alphabetical and Number Series, Coding and Decoding, Mathematical Operations, Relationships, Syllogism, Jumbling, Venn Diagram, Data Interpretation and Sufficiency, Conclusions and Decision Making, Similarities and Differences, Analytical Reasoning, Classification, Directions, Statement- Arguments and Assumptions etc.
General Awareness: Knowledge of Current Affairs, Indian Geography, Culture and History of India including freedom movement, Indian Polity and Constitution, Indian Economy, Environmental issues concerning India and the World, Sports, General scientific and technological developments etc.
General Science: Physics, Chemistry and Life Sciences (up to 10th standard CBSE syllabus).
జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) & జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీషు)
జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) & జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీషు) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు వేరుగా సీబీటీ నిర్వహిస్తారు. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షలో జనరల్ అవెర్నెస్ పాటుగా ఎంచుకున్న భాషకు సంబంధించిన అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.
జనరల్ అవెర్నెస్ సెక్షన్ లో గణితం, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్,జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్ ప్రశ్నలు ఇవ్వబడతయి. లాంగ్వేజ్ టెస్ట్ బాష నైపుణ్యాన్ని పరీక్షించే విదంగా. జనరల్ అవెర్నెస్ మరియు లాంగ్వేజ్ సెక్షన్లలో రెండింటా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) & జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీషు) సీబీటీ పరీక్షా విధానం | |||
---|---|---|---|
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
జనరల్ అవెర్నెస్ | 100 | 100 | 90 నిముషాలు |
హిందీ / ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 100 | 100 |
స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ : జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ) & జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీషు) సీబీటీ టెస్టులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఖాళీ ఉన్నా పోస్టుల సంఖ్యకు పది రేట్లు మంది అభ్యర్థులను దీని కోసం ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్ట్ ఎటువంటి ఎడిటింగ్ మరియు స్పెల్ చెక్ సాఫ్ట్‌వేర్ లేని పర్సనల్ కంప్యూటర్ ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ టెస్టులో భాగంగా నిముషానికి 80 పదాలు టైపు చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ షీట్ల మూల్యాంకనానికి సంబంధించి, ప్రతి పూర్తి లేదా పెద్ద తప్పులకు ఒక మార్కు కోల్పోతారు. చిన్న తప్పిదాలకు అర మార్కు తొలగిస్తారు. టెస్టు మొత్తంలో 10% తప్పిదాలు దాటితే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ | |||
---|---|---|---|
టైప్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ | వేగం | కాలవ్యవధి | ట్రాన్స్క్రిప్షన్ సమయం |
ఇంగ్లీష్ | 80 wpm | 10 నిముషాలు | 50 నిముషాలు |
హిందీ | 80 wpm | 10 నిముషాలు | 65 నిముషాలు |
జూనియర్ ట్రాన్సిలేటర్ హిందీ
జూనియర్ ట్రాన్సిలేటర్ హిందీ అభ్యర్థులకు కూడా విడిగా పరీక్షా ఉంటుంది. సాధరణ కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటుగా తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సిన ట్రాన్సిలేషన్ టెస్ట్ నిర్వహిస్తారు. సీబీటీ ప్రశ్న పత్రంలో 50% ప్రశ్నలు లాంగ్వేజ్ ఎఫిసెన్సీకి సంబంధించి ఉంటాయి. ఇందులో 20% ప్రశ్నలు ఇంగ్లీష్ నుండి మిగతా 30% హిందీ లాంగ్వేజ్ సంబంధించి వస్తాయి. మిగతా 50% ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటిలిజెన్స్ మరియు ప్రాథమిక అర్థమెటిక్ అంశాల నుండి ఇవ్వబడతాయి.
ట్రాన్సలేషన్ టెస్ట్ : సీబీటీ లో మెరిట్ సాధించిన వారికీ ట్రాన్సలేషన్ నిర్వహిస్తారు. ఖాళీ ఉండే పోస్టుల సంఖ్యకు 10 రేట్లు మంది అభ్యర్థులను ట్రాన్సలేషన్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ట్రాన్సలేషన్ టెస్ట్ 60% స్కోరుతో తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
పెర్ఫార్మన్స్ టెస్ట్ / టీచింగ్ స్కిల్ టెస్ట్
జనరల్ కంప్యూటర్ ఆబ్జెక్టివ్ టెస్టులో మెరిట్ సాధించిన టీచింగ్ పోస్టుల దరఖాస్తు దారులకు ఈ పెర్ఫార్మన్స్ టెస్ట్ మరియు టీచింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పిజిటి), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టిజిటి), ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పిటిఐ) & అసిస్టెంట్ మిస్ట్రెస్ / జూనియర్ స్కూల్ (పిఆర్టిలు) లకు టీచింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సిబీటి మరియు టీచింగ్ స్కిల్ టెస్టుల్లో చూపిన ప్రతిభా ఆధారంగా వీరి నియామకం జరుగుతుంది. సీబీటీలో సాధించిన మార్కులకు 85% వెయిటేజీ మరియు పెరఫార్మన్స్ టెస్ట్ మార్కులకు 15% వెయిటేజీ కేటాయిస్తారు.
ప్రైమరీ టీచర్ (సంగీతం), ప్రైమరీ టీచర్ (నృత్యం) మరియు ఆర్ట్ మాస్టర్ (PGT / TGT) పోస్టులకు టీచింగ్ స్కిల్ టెస్టుతో పాటుగా పెర్ఫార్మన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. సీబీటీలో సాధించిన మార్కులకు 60% వెయిటేజీ, పెరఫార్మన్స్ టెస్టుకు25% వెయిటేజీ మరియు టీచింగ్ స్కిల్ టెస్టుకు 15% వెయిటేజీ కేటాయిస్తారు.
టీచింగ్ స్కిల్ టెస్ట్ : అభ్యర్థుల యొక్క టీచింగ్ ఎబిలిటీని పరీక్షించేందుకు టీచింగ్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థుల టీచింగ్ ఎబిలిటీ, టీచింగ్ మెథడాలజీ, సబ్జెక్టు నైపుణ్యం, క్రమశిక్షణ అభివృద్ధి అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెసెంటేషన్ స్కిల్స్, క్లాసురూమ్ మానేజ్మెంట్, సబ్జెక్టు అవగాహన, ప్రాబ్లెమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, క్రియేటివిటీ, లీడర్షిప్ మరియు మోటివేషన్ క్వాలిటీ వంటి వివిధ అంశాలను పరీక్షిస్తారు.
ఇందుభాగంగా ఏర్పాటు చేసిన కమిటీ ముందు 15 నిముషాల నుండి 30 నిముషాల నిడివితో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పాల్సిన టాపిక్కును కమిటీ ముందుగానే అభ్యర్డులకు అందించి సాధన చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
టీచింగ్ స్కిల్ టెస్ట్ 150 మార్కులకు జరుగుతుంది. దీనికి ఎటువంటి అర్హుత మార్కులు ఉండవు కాకుంటే నియామక సమయంలో TST మార్కులకు 15% వెయిటేజీ కల్పిస్తారు.
పెర్ఫార్మన్స్ టెస్ట్ : ప్రైమరీ టీచర్ (సంగీతం), ప్రైమరీ టీచర్ (నృత్యం) మరియు ఆర్ట్ మాస్టర్ (PGT / TGT) పోస్టులకు పెర్ఫార్మన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. సంగీతం మరియు నృత్య టీచర్లకు సంబంధించి అభ్యర్థుల యొక్క గాన, నృత్య మరియు సంగీత నైపుణ్యాలను పరీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. నిర్దేశించిన కమిటీ ముందు గణ, నృత్య, సంగీత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో అభ్యర్థులలో ఉండే ప్రదర్శన నైపుణ్యం, లయ, శృతి సంబంధిత అంశాలయందు ఉన్నా పట్టు, హావభావాల ప్రదర్శన, కళారూపాల్లో సృజనాత్మకత, ఊహాశక్తి మరియు కళాత్మక స్వభాన్ని పరీక్షిస్తారు.
ఆర్ట్ మాస్టర్ (PGT / TGT) పోస్టులకు సంబంధించి అభ్యర్థుల యొక్క ఆర్ట్ ఫామ్స్ / పెయింటింగ్ / స్కెచ్చింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తారు.ఆయా అంశాల యందు అభ్యర్డుల సృజనాత్మకత, పరిశీలన, సున్నితత్వం, ఇంటర్ప్రిటేషన్ మరియు ఒరిజినాలిటీ, సహజత్వం, విభిన్న కళ రీతులు మరియు మాధ్యమాలు ప్రదర్శన, పరిమాణం, క్లారిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ కలర్ మరియు సంతులనం నైపుణ్యాలను లెక్కిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఎంపిక విధానం
వివిధ పోస్టులకు సంబంధించి అన్ని టెస్టులు అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యకు 50% అదనపు అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది.
వివిధ దశల్లో సీబీటీకి హాజరైన అభ్యర్థుల మార్కులను నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. దీనికి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్/ట్రాన్సలేషన్ టెస్ట్/పెర్ఫార్మన్స్ టెస్ట్/టీచింగ్ స్కిల్ టెస్ట్ లలో సాధించిన మార్కుల వెయిటేజీ కలిపి చివరి షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం అర్హుత పొందిన అభ్యర్థులకు పోస్టులు కేటాయిస్తారు.