కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్తమ వెబ్‌సైట్‌లు
Career Guidance Useful websites

కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్తమ వెబ్‌సైట్‌లు

జ్ఞానాన్ని పొందడానికి మరియు మెరుగుపరచడానికి కొన్ని ఉపయోగకరమైన వెబ్‌సైట్‌ల జాబితాను మీకు అందిస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రపంచ జ్ఞానం అవసరం. క్రొత్తదాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడే ఉత్తమ వెబ్‌సైట్‌ల జాబితాను తెలుసుకోండి.

3జీ, 4జీ తరానికి చెందిన ఈ కాలం విద్యార్థులకు కొత్తగా డిజిటల్ టూల్స్ కోసం పరిచయం అక్కర్లేదు. ఇంటర్నెట్, నేడు వారి జీవితంలో ఒకభాగం. కోవిడ్ పుణ్యమాని మొన్నటి వరకు పిల్లలకు ఇంటర్నెట్ వద్దన్నా పెద్దలు కూడా, నేడు ఇంటర్నెట్ చదువులకు మించిన ప్రత్యామ్యాయం లేదంటున్నారు.

ఆన్‌లైన్ విద్యపై విద్యార్థులలో రోజురోజుకూ పెరుగుతున్న మక్కువ గ్రహించి, ఆన్‌లైన్ విద్యలో భాగంగా వారికీ ఉపయోగపడే ఉత్తమ నాలెడ్జ్ సంబంధిత వెబ్‌సైట్‌లను ఈ పోస్టు ద్వారా అందిస్తున్నాం. ఈ వెబ్‌సైట్‌లు అందరి విద్యార్థుల మొబైల్ లేదా పర్సనల్ కంప్యూటర్ల యందు తప్పక ఉండితీరాలి.

1. క్వోరా (QUORA) : ప్రపంచ పరిజ్ఞానాన్ని పెంచుకోండి

quoraప్రశ్న అడగడం తెలిసిన వారికి కోరా అపరిమితమైన విజ్ఞాన్ని అందిస్తుంది. ప్రశ్న అడగడం తెలియని వారికీ, ప్రశ్నను ఎలా సంధించాలో నేర్పిస్తుంది. Who, What, Why, When, Where, How ఇలా ఏవిధమైన ప్రశ్నలు మీ మదిలో ఉన్న, దానికి సంబంధించిన జవాబులను మీకు కోరా అందిస్తుంది. కోరాలో పలానా ప్రశ్న అడగకూడదు అనే నిబంధన లేదు.

ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రశ్నలు అడగడానికి, ఉపయోగకరమైన సమాధానాలను పొందడానికి, మీకు తెలిసిన విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి కోరా ఒక ఉత్తమ డిజిటల్ వేదిక. కోరా సెర్చ్ బాక్సులో మీరు ఒక ప్రశ్నను సంధించగానే, దానికి సరిపడే వివిధ వ్యక్తుల అభిప్రాయాలూ, ఆలోచనలు, దృక్పధాలు మరియు వివరణలను మీ ముందు ఉంచుతుంది.

అలానే ఈ వేదిక ద్వారా ఇతరులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు మీరు సమాధానం చెయ్యొచ్చు. ఈ సేవలను మీ వ్యక్తిగత ఇమెయిల్ అడ్రెస్సుతో లాగిన్ అవ్వడం ద్వారా యాక్సిస్ చేయొచ్చు. సేవలు పూర్తి ఉచితం. వెబ్‌సైట్‌: www.quora.com

2. వికీహౌ (WIKI HOW) : నైపుణ్యాలను మెరుగుపరచుకోనే కథనాలు

వికీహౌ వెబ్‌సైట్‌, వికిపీడియాకు ప్రత్యామ్నాయం. ఇది ఎందరో నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు పెంచిపోషించిన వేదిక. వికీహౌ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి వంటి హౌ టూ గైడెన్స్ అందిస్తుంది.

వివిధ అంశాలకు సంబంధించి ఈ వేదికపై సుమారు 2.5 లక్షల ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితమైన హౌ టూ గైడెన్స్ పొందాలనుకునే వారికీ వికీహౌ ఉత్తమ వేదిక. వికీపీడియాల కాకుండా ఒక ప్రశ్నకు యెంత సమాచారం అవసరమో అంతే సమాచారం ఈ వేదిక ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది.

wikihowఈ వేదిక ద్వారా మీరు విదేశీ భాషలు నేర్చుకోవచ్చు, ఫోటోగ్రఫీ నేర్చుకోవచ్చు, పబ్లిక్ స్పీకింగ్, కెరీర్ కౌన్సిలింగ్ వంటి ఎన్నో అంశాలు వికీహౌ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. వికీహౌ ప్రపంచ వ్యాప్తంగా 16 భాషల్లో అందుబాటులో ఉంది.

దాదాపు 42 దేశాలలో వికీహౌ ఇంటర్నెట్ లేకుండా ఉపయోగించే సదుపాయం ఉంది. ఎన్నో గొప్పగొప్ప అవార్డులు సొంతం చేసుకున్న ఈ సంస్థలో ఐక్యరాజ్యసమితి, అమెజాన్, శామ్‌సంగ్, టీచ్ ఫర్ ఇండియా వంటి అత్యున్నత ఆర్గనైజషన్స్ భాగస్వామ్యంగా ఉన్నాయి. వెబ్‌సైట్‌ : www.wikihow.com

3. క్విజ్‌లెట్ (QUIZLET) : ఉత్తమ అకాడమిక్ అభ్యసన వెబ్‌సైట్‌

అమెరికా టాప్ 50 వెబ్‌సైట్లలో ఒకటిగా ఉన్న క్విజ్‌లెట్, స్కూల్ పిల్లల నుండి ఉన్నత విద్య చదివే విద్యార్థుల వరకు అందరికి ఉపయోగపడే ఉత్తమ ఎడ్యుకేషన్ అప్లికేషనుగా చెప్పొచ్చు.

క్విజ్‌లెట్ విద్యార్థుల అకాడమిక్ అభ్యసనకు ఉత్తమ వేదిక. క్లాసురూములో విద్యార్థి గ్రహించిన జ్ఞానాన్ని పరీక్షించేందుకు క్విజ్‌లెట్ ఉత్తమ డిజిటల్ టూల్స్ అందుబాటులో ఉంచింది. ఫ్లాష్ కార్డులు, గ్రావిటీ, స్పెల్లర్, మ్యాచ్, రైట్, లైవ్ వంటి ఎంపికల ద్వారా విద్యార్థి తన సబ్జెక్టు జ్ఞానాన్ని ఆడుతూ పడుతూ పునఃసమీక్షించుకోవచ్చు.

quizlet క్విజ్‌లెట్ ప్రధాన సబ్జెక్టులైన మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్ & హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, లాంగ్వజులతో పాటుగా హాబీస్, స్పోర్ట్స్, కంప్యూటర్ స్కిల్ అంశాలను వారి వెబ్సైటు యందు రిజిస్టర్డ్ అయిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందిస్తుంది. క్విజ్‌లెట్ ప్రపంచ వ్యాప్తంగా 300 మిల్లియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా అందులో 50 మిల్లియన్లకు పైగా క్రీయాశీల వినియోగదారులు ఉండటం గమనార్హం. వెబ్‌సైట్‌ : www.quizlet.com

4. గూగుల్ స్కాలర్ (Google Scholar) : అతిపెద్ద అకాడమిక్ సెర్చ్ ఇంజిన్

ప్రపంచ అతిపెద్ద అకాడమిక్ సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఉందంటే అది గూగుల్ స్కాలర్ అని చెప్పొచ్చు. ఈ వేదిక దాదాపు 200 మిలియన్ల అకాడమిక్ ఆర్టికల్స్'కు నెలవు. దానికి మించి సుమారు 500 మిలియన్ల అకాడమిక్ డాకుమెంట్స్ ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాదిరిగా మీరు సెర్చ్ చేసే అకాడమిక్ టాపిక్ సంబంధించి కొన్ని లక్షల పేజీల డాటాను మీ ముందు ఉంచుతుంది. ఉన్నత విద్య చదివే గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ మరియు పీహెచ్డీ వంటి పరిశోధన విద్యార్థులకు గూగుల్ స్కాలర్ కల్పవృక్షం లాంటిది.google scholarదీనితో పాటుగా గూగుల్  విద్యార్థుల

కోసం, ఉద్యోగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన గూగుల్ ఎడ్యుకేషన్, గూగుల్ క్లాస్ రూమ్, గూగుల్ వర్క్ స్పేస్  డాక్యూమెంట్స్ మరియు గూగుల్ ఆర్ట్ & కల్చర్ వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌లు మీ పనులను సులభతరం చేయడంతో పాటుగా మీకు విజ్ఞాన్ని, నైపుణ్యాన్ని అందజేస్తాయి. వెబ్‌సైట్‌: www.scholar.google.com

డిజిటల్ టూల్ / వెబ్‌సైట్ ఉపయోగం
www.canva.com బెస్ట్ గ్రాఫిక్ డిజైన్ ప్లాటుఫామ్. ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, డాక్యూమెంట్స్ రూపొందించేందుకు ఉత్తమమైన వేదిక
www.pixlr.com మరో ఉత్తమ గ్రాఫిక్ డిజైన్ ప్లాటుఫామ్. ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, డాక్యూమెంట్స్ రూపొందించేందుకు ఉత్తమమైన వేదిక. ఇది చిన్నపాటి ఆన్‌లైన్ ఫోటోషాప్ మాదిరి పనిచేస్తుంది.
www.pixabay.com ఉచిత ఫోటో సెర్చ్ ఇంజిన్
www.docs.google.com డాక్యుమెంట్ ఎడిటింగ్ & ప్రెసెంటేషన్ డిజైనింగ్
www.w3schools.com కోడ్ లెర్నింగ్
www.calculator.net ఉచిత ఆన్‌లైన్ కాలిక్యులేటర్లు
www.freegurukul.org ఉచిత తెలుగు బుక్స్
www.vocabulary.com ఆల్ ఇన్ వన్ డిక్షనరీ
www.thesciencedictionary.com సైన్స్ డిక్షనరీ
www.webbook.nist.gov కెమిస్ట్రీ డిక్షనరీ / కెమిస్ట్రీ ఫార్ములాస్
www.matematica.pt మ్యాథమెటిక్ డిక్షనరీ / ఫార్ములాస్

One Comment

  1. Ahaa, its good conversation on the topic of this post
    at this place at this weblog, I have read all that, so at this time
    me also commenting here.

    Reply

Post Comment