కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్

దేశంలో మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ప్రారంభం

ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIES) యాజమాన్యంలోని దేవస్థాల్ అబ్జర్వేటరీ క్యాంపస్‌ భారతదేశపు మొట్టమొదటి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్,ను ఉత్తరాఖండ్‌లోని దేవస్తాల్ అనే కొండపై ప్రారంభించింది. ఆసియాలో అతిపెద్ద టెలిస్కోపుగా రూపొందించిన ఇది గ్రహశకలాలు, సూపర్నోవాలు, అంతరిక్ష శిధిలాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల పరిశోధనకు ఉపయోగపడనుంది.

Advertisement

చిలికాలో ప్రపంచ మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్

ఒడిశాలోని చిలికా సరస్సులో ప్రపంచంలోని మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ జనాభా గణన నిర్వహించారు. ఈ జనాభా లెక్కల ప్రకారం చిలికా సరస్సు పరిధిలో మొత్తం పిల్లి జాతుల సంఖ్య 176 ఉన్నట్లు చిలికా డెవలప్మెంట్ ఆథారిటీ అంచనా వేసింది. చిలికా సరస్సు, ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి మడుగులో ఒకటిగా ఉంది.

ఫిషింగ్ పిల్లి (ప్రియోనైలురుస్వివెర్రినస్) దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోని మధ్య తరహా అడవి పిల్లి. ఇది పశ్చిమ బెంగాల్‌లో మరియు సుందర్‌బన్స్  చిత్తడి నేలల్లో పెద్ద సంఖ్యలో కనిపిస్తుంది. ఇది బెంగాల్ జాతీయ జంతువుగా గౌరవించబడుతుంది.

తెలంగాణాలో దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ప్లాంట్ ఏర్పాటు

భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే తయారీ ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జ్యువెలర్ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

యునెస్కో బయోస్పియర్‌ జాబితాలో మంగోలియాన్ ఖువ్స్‌గుల్ సరస్సు

మంగోలియాలోని ఖువ్స్‌గుల్ సరస్సుకు యునెస్కో వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్‌ల జాబితాలో చోటు కల్పించారు. ఇటీవలే ప్యారిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ యొక్క 34వ సెషన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఖువ్స్‌గుల్ సరస్సు మంగోలియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఇది మంగోలియా యొక్క ఉత్తర సరిహద్దులో సైబీరియన్ టైగా యొక్క దక్షిణ అంచులో సముద్రం నుండి 1645 మీటర్ల ఎత్తులో ఉంది. 136 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ సరస్సు 2,760 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

ఇస్రో జీసాట్ 24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ నుండి కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT - 24 ను విజయవంతంగా ప్రయోగించింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) కోసం ఇస్రో నిర్మించిన ఈ GSAT-24, ఫ్రెంచ్ కంపెనీ  అరియన్‌స్పేస్ ద్వారా ప్రయోగించబడింది. 4180 కిలోల బరువున్న ఈ GSAT-24, దేశీయ డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను మరియు బ్యాండ్ కమ్యూనికేషన్ సేవలు మెరుగుపర్చేందుకు రూపొందించబడింది.

పునరుత్పాదక శక్తితో నడిచే ఇండియా మొదటి ఎయిర్‌పోర్టుగా ఢిల్లీ

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), పునరుత్పాదక శక్తితో నడిచే దేశంలోని మొదటి విమానాశ్రయంగా నిలిచింది. ఈ ఏడాది జూన్ 1 నుండి ఈ విమానాశ్ర విద్యుత్ అవసరాల కోసం పూర్తిగా పునరుత్పాదక హైడ్రో మరియు సోలార్ పవర్ ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదివరకు కొచ్చిన్ విమానాశ్రయం, 2015 లో సోలార్ విద్యుత్తును ఉపయోగించిన ప్రపంచ మొదటి విమానాశ్రయంగా నిలిచింది.

కరేబియన్ మాంగ్రోవ్ చిత్తడి నేలల్లో అతిపెద్ద బాక్టీరియం గుర్తింపు

కంటితో చూడగలిగే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాను కరేబియన్ మాంగ్రోవ్ చిత్తడి నేలల్లో కొనుగున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణ కరేబియన్ సముద్రంలో ఫ్రెంచ్ విదేశీ భూభాగమైన గ్వాడెలోప్‌లో కనుగొనబడింది. ఇవి గరిష్టంగా 2 సెం.మీ వరకు పెరుగుతున్నట్లు వెల్లడించారు. థియోమార్గరీటా మాగ్నిఫికా అనే బ్యాక్టీరియా సగటు బ్యాక్టీరియా కంటే 5000 రెట్లు పెద్దదిగా వృద్ధి చెందుతుంది.

Advertisement

Post Comment