Advertisement
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు 2022-2023 | అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు 2022-2023 | అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రవేశాలు

2022-2023

2022 -23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రెటరీ శేషగిరి బాబు విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌, రెసిడెన్సీ, బీసీ, ఎస్సీ & ఎస్టీ వెల్ఫేర్ కాలేజీలు మరియు ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 20 జూన్ 2022 నుండి 20 జులై 2022 వరకు మొదటి విడుత అడ్మిషన్ ప్రక్రియ నిర్వహించబోతున్నాట్లు వెల్లడించారు.

జనరల్ ఇంటర్ గ్రూపులకు ఒక్కో సెక్షన్ యందు గరిష్టంగా 80 సీట్లు, ఒకేషనల్ గ్రూపు యందు సెక్షనుకు గరిష్టంగా 30 సీట్లు, నాన్ పారామెడికల్ కోర్సుల యందు గరిష్టంగా 40 సెట్లకి మించి భర్తీ చేయకూడదని ఆదేశాలు జారీచేశారు. అన్ని రకాల కాలేజీల్లో టెన్త్ క్లాస్ యందు విద్యార్థి సాధించి గ్రేడ్ పాయింట్స్ (GP) ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని ఆర్డర్స్ జారీ చేశారు. ప్రతి సెక్షన్ యందు 33 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తూ, మిగతా సీట్లు మిగతా కేటగిరి వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని కోరారు. విద్యార్థులు తమ ఒరిజినల్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మరియు ట్రాన్సఫర్ సర్టిఫికెట్ (TC) సమర్పించి తమకు అందుబాటులో ఉండే జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. అలానే ఇంటర్ మొదటి ఏడాది తరగతులు జులై 1వ తేది నుండి ప్రారంభం కానున్నట్లు తెలియజేసారు.

అడ్మిషన్స్ ప్రారంభం 20 జూన్ 2022
అడ్మిషన్ తుది గడువు 20 జులై 2022
క్లాసులు ప్రారంభం 01 జులై 2022

Post Comment