ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవల్దార్ నోటిఫికేషన్ 2023
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవల్దార్ నోటిఫికేషన్ 2023

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవల్దార్ నోటిఫికేషన్ 2023 విడుదల అయ్యింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), మరియు హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్)  విభాగంలో 11,409 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 17 ఫిబ్రవరి 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.

ఎంటిఎస్ పరిధిలో ఎంపికైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారీ ఆఫీస్ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. హవల్దార్ పోస్టులకు ఎంపికైనవారు కేంద్ర పరిశోధన సంస్థల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. టెన్త్ పాస్ అయ్యి 18 నుండి 27 మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహణ ద్వారా జరుగుతుంది.

  • ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఖాళీలు - 10.880 పోస్టులు
  • ఎస్‌ఎస్‌సీ హవల్దార్ ఖాళీలు - 529 పోస్టులు

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ 2023 షెడ్యూల్

పోస్టుల సంఖ్యా 11,409 పోస్టులు
దరఖాస్తు ప్రారంభం 18 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 17 ఫిబ్రవరి 20232
పరీక్ష ఫీజు 100/-
ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఎగ్జామ్ తేదీ ఏప్రిల్ 2023

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
  • వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 27 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ రిజిస్ట్రేషన్

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి.

పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

తెలుగు రాష్ట్రాలలో ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఎగ్జామ్ సెంటర్లు
ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
చిరాలా, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం,
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ ఎగ్జామ్ నమూనా

మల్టీ టాస్కింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. వీటిలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపి విధుల్లోకి తీసుకుంటారు. హవల్దార్ పోస్టులకు అధనంగా ఫీజికల్ ఏపీసెన్సీ టెస్ట్ మరియు ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది.

సెషన్ I ఆబ్జెక్టివ్ టెస్ట్

సెషన్ I ఆబ్జెక్టివ్ టెస్ట్ కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు సెక్షన్లుగా మొత్తం 40 ప్రశ్నలతో ఇవ్వబడుతుంది.  సెక్షన్ I లో న్యూమరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ సంబంధించి 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ II లో రీజనింగ్ ఎబిలిటీ మరియు ప్రాబ్లం సాల్వింగ్ సంబంధించి మరో 20 ప్రశ్నలు ఇవ్వబడతయి.

సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు. ఎగ్జామ్ మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిడివి 45 నిముషాలు ఉంటుంది.

సిలబస్ ప్రశ్నలు /మార్కులు సమయం
సెక్షన్ I న్యూమరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ 20/60 45 నిముషాలు
సెక్షన్ II రీజనింగ్ ఎబిలిటీ మరియు ప్రాబ్లం సాల్వింగ్ 20/60

సెషన్ II ఆబ్జెక్టివ్ టెస్ట్

సెషన్ II ఆబ్జెక్టివ్ టెస్ట్ కూడా కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు సెక్షన్లుగా మొత్తం 40 ప్రశ్నలతో ఇవ్వబడుతుంది.  సెక్షన్ I లో జనరల్ అవెర్నెస్ సంబంధించి 25 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ II లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంఫ్రహెన్షన్ సంబంధించి మరో 25 ప్రశ్నలు ఇవ్వబడతయి.

సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు. ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిడివి 45 నిముషాలు ఉంటుంది. ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీష్ భాషలో పాటుగా తెలుగు వంటి మరో 10 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు.

సిలబస్ ప్రశ్నలు /మార్కులు సమయం
సెక్షన్ I జనరల్ అవెర్నెస్ 25/75 45 నిముషాలు
సెక్షన్ II ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కంఫ్రహెన్షన్ 25/75

ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ (PET) & ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు మూడవ దశలో ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ (PET) & ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులకు వాకింగ్, సైక్లింగ్ టాస్కులు నిర్వహిస్తారు. అలానే అభ్యర్థి శారీరక ప్రమాణాల అర్హుతకు సంబంధించి ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఫీజికల్ ఎఫిసెన్సీ టెస్ట్ (PET)
టెస్ట్ /టాస్క్ పురుషులు మహిళలు 
వాకింగ్ 1,600 మీటర్లు (15 నిముషాలు) 1,000 మీటర్లు (20 నిముషాలు)
సైక్లింగ్ 30 నిముషాల్లో 8 కిలోమీటర్లు 25 నిముషాల్లో 3 కిలోమీటర్లు
ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
టెస్ట్/టాస్క్ పురుషులు మహిళలు 
ఎత్తు (Height ) 157.5 cms 152 cms
ఛాతి (Chest) / బరువు (weight) జనరల్ 76 cms, గాలి పిల్చాక కనీసం 81 Cms 48 కేజీలు

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & తుది ఎంపిక

రెండు సెషన్ల రాతపరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపికను మార్చుకునేందుకు చివరిసారి అవకాశం కల్పిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు. రెండు సెషన్లకు విడివిగా అర్హుత మార్కులు ప్రకటిస్తారు. కేటగిరి వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. సెషన్ II అందరూ అభ్యర్థులు తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.

మార్కులు సమమయ్యేటప్పుడు సెషన్ II  మెరిట్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు అభ్యర్థులకు ప్రాధన్యత ఇస్తారు. ఇంకా సమస్య పరిస్కారం కాకుంటే అభ్యర్థుల పేర్లలో ఆల్ఫాబెట్ అక్షరాలను ఆధారంగా చేసుకుని చోటు కల్పిస్తారు.

కేటగిరి క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%

Post Comment