ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంక్ పథకం : ఉచిత అకాడమిక్ బుక్స్
Scholarships

ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంక్ పథకం : ఉచిత అకాడమిక్ బుక్స్

ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంకు స్కీమ్ కింద ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, లా సంబంధించి  పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే ఎస్సీ విద్యార్థులకు అకాడమిక్ పుస్తకాలను ఉచితంగా అందిస్తారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం పథకం పరిధిలో ప్రొఫిషినల్ పీజీ కోర్సులను కూడా చేర్చారు.

ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంకు పథకానికి ఎంపికైన ఇంజనీరింగ్, మెడిసిన్ డిగ్రీలు చదివే విద్యార్థులకు 7,500 /- రూపాయలు అందిస్తున్నారు. వెటర్నరీ కోర్సులు చదివే విద్యార్థులకు 4,500/-, అగ్రికల్చర్ మరియు ఇతర ప్రొఫిషినల్ పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు 5,000/- రూపాయలు అందిస్తున్నారు.

స్కాలర్షిప్ ఏపీ బుక్ బ్యాంకు పథకం
స్కాలర్షిప్ టైప్ ఉచిత అకాడమిక్ బుక్స్
ఎవరికి అందిస్తారు ఎస్సీ విద్యార్థులకు
అర్హుత రెండు లక్షలలోపు కుటుంబ ఆదాయం

బుక్ బ్యాంకు స్కీమ్ ఎలిజిబిలిటీ

ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అర్హుత సాధించిన విద్యార్థులు అందరు ఈ పథకం పథకం పరిధిలో అర్హులుగా గుర్తింపు పడతారు

బుక్ బ్యాంకు స్కీమ్ దరఖాస్తు

ఆంధ్రప్రదేశ్ బుక్ బ్యాంకు పథకానికి ఎటువంటి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కాలేజీ అడ్మిషన్, విద్యార్థి ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారులు కాలేజీలు అందించిన డేటా ఆధారంగా పథకాన్ని అమలు చేస్తారు.

బుక్స్ తీసుకుని మూడేళ్లు పూర్తియినాక, వీటిని తిరిగి అందించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ జన్మభూమి పోర్టల్'లో లేదా మీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని సంప్రదించండి.

Post Comment