తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ | నవంబర్ 2022
Current Affairs Bits 2022 Telugu Gk

తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ | నవంబర్ 2022

తెలుగులో నవంబర్ నెలకు చెందిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను సాధన చేయండి. నవంబర్ నెలలో చోటు చేసుకున్న వివిధ వర్తమాన విషయాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను పొందండి. అలానే నవంబర్ 2022 నెలకు సంబంధించి 10 విభాగాల వారీగా తాజా కరెంటు అఫైర్స్ చదవండి. పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఇవి సహాయపడతాయి.

తెలుగు కరెంట్ అఫైర్స్ క్విజ్ | నవంబర్ 2022

1. మంగర్ ధామ్‌ స్మారక చిహ్నం ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. గుజరాత్
  2. పంజాబ్
  3. బీహార్
  4. రాజస్థాన్
సమాధానం
4. రాజస్థాన్ 

2. దోనీ పోలో విమానాశ్రయం ఇటీవలే ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ?

  1. జార్ఖండ్
  2. జమ్మూ & కాశ్మీర్
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. ఛత్తీసగఢ్
సమాధానం
3. అరుణాచల్ ప్రదేశ్ 

3. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు 2022 ఎక్కడ నిర్వహించారు ?

  1. బాంగ్లాదేశ్
  2. ఇండోనేషియా
  3. కంబోడియా
  4. ఖతార్
సమాధానం
3. కంబోడియా

4. COP 27 అంటే ఏంటి ?

  1. కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ - 27 దేశాలు
  2. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ - 27వ సెషన్
  3. కమర్షియల్ అవుట్‌పుట్ పాలసీ - 27 రూల్స్
  4. కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ - 27వ సెషన్
సమాధానం
2. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27వ సెషన్

5. COP 27 సమావేశాలకు ఏ దేశం ఆతిధ్యం ఇచ్చింది ?

  1. ఈజిప్టు
  2. కంబోడియా
  3. దక్షిణ ఆఫ్రికా
  4. ఇండియా
సమాధానం
1. ఈజిప్టు

6. వంగల ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?

  1. అస్సాం
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. మేఘాలయ
  4. మణిపూర్
సమాధానం
3. మేఘాలయ

7. జియో స్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్‌ ఏ నగరంలో జరిగింది ?

  1. బెంగుళూరు
  2. హైదరాబాద్
  3. పూణే
  4. చెన్నై
సమాధానం
2. హైదరాబాద్

8. భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబార్బిటల్ ఎవరు రూపొందించారు ?

  1. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
  2. ధృవ స్పేస్
  3. అగ్నికుల్ కాస్మోస్
  4. స్కైరూట్ ఏరోస్పేస్
సమాధానం
4. స్కైరూట్ ఏరోస్పేస్

9. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో జరిగింది ?

  1. వెస్ట్ బంగాల్
  2. తమిళనాడు
  3. గోవా
  4. మహారాష్ట్ర
సమాధానం
3. గోవా

10. కింది వాటిలో ఆగ్నేయాసియా దేశాల సమైఖ్యలో లేనిది ఏది ?

  1. కంబోడియా
  2. ఇండోనేషియా
  3. ఇండియా
  4. థాయిలాండ్
సమాధానం
3. ఇండియా

11. 17వ G20 సమావేశాలు ఏ నగరంలో నిర్వహించారు ?

  1. బాలి
  2. ఢాకా
  3. టోక్యో
  4. న్యూఢిల్లీ
సమాధానం
1. బాలి  

12. ప్రపంచ మొదటి "పారాస్ట్రోనాట్" ఎవరు ?

  1. ట్రిస్చా జోర్న్ (అమెరికా)
  2. జాన్ మెక్‌ఫాల్ (బ్రిటన్)
  3. దేవేంద్ర ఝఝరియా (ఇండియా)
  4. డేవ్ రాబర్ట్స్ (బ్రిటన్)
సమాధానం
2. జాన్ మెక్‌ఫాల్ (బ్రిటన్) 

13. కింది వారిలో స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు ఎవరు ?

  1. రమాబాయి రానడే
  2. రామ్ శరణ్ యోగి
  3. రోచింగా ప్రెస్బిటేరియన్
  4. శ్యామ్ శరణ్ నేగి
సమాధానం
4. శ్యామ్ శరణ్ నేగి

14. ప్రసార భారతి నూతన సీఈఓ ఎవరు ?

  1. రితురాజ్ అవస్థీ
  2. గౌరవ్ ద్వివేది
  3. సుభ్రకాంత్ పాండా
  4. సివి ఆనంద బోస్
సమాధానం
2. గౌరవ్ ద్వివేది

15. పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌ ఎవరు ?

  1. సివి ఆనంద బోస్
  2. జగ్‌దీప్ ధన్‌ఖర్
  3. లా గణేశన్
  4. రమేష్ బైస్
సమాధానం
1. సివి ఆనంద బోస్

16. ఏఐసీటీఈ నూతన చైర్మన్‌ ఎవరు ?

  1. అనిల్ సహస్రబుధే
  2. నిధి చిబ్బర్
  3. ధీరేంద్ర పాల్ సింగ్
  4. టీజీ సీతారామ్
సమాధానం
4. టీజీ సీతారామ్

17. కింది వాటిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించని రూట్ ఏది ?

  1. మైసూరు - చెన్నై
  2. న్యూఢిల్లీ - వారణాసి
  3. ముంబై సెంట్రల్ - గాంధీనగర్
  4. న్యూఢిల్లీ - హైదరాబాద్
సమాధానం
4. న్యూఢిల్లీ - హైదరాబాద్

18. 70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఏ దేశంలో నిర్వహించారు ?

  1. ఆస్ట్రేలియా
  2. ఒమాన్
  3. రష్యా
  4. జపాన్
సమాధానం
4. జపాన్

19. యుధ్ అభ్యాస్ మిలిటరీ ఎక్సర్ సైజ్ యందు పాల్గునే దేశాలు ఏవి ?

  1. జపాన్ - అమెరికా
  2. రష్యా - చైనా
  3. ఇండియా - ఒమాన్
  4. ఇండియా - అమెరికా
సమాధానం
4. ఇండియా - అమెరికా

20. ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. కర్ణాటక
  2. తమిళనాడు
  3. ఒడిశా
  4. గుజరాత్
సమాధానం
3. ఒడిశా

21. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో భారత్ ర్యాంకు ?

  1. 8వ ర్యాంకు
  2. 10వ ర్యాంకు
  3. 20వ ర్యాంకు
  4. 117వ ర్యాంకు
సమాధానం
1. 8వ ర్యాంకు

22. తమిళనాడులో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌ ఏది ?

  1. ముదుమలై నేషనల్ పార్క్
  2. అరిట్టపట్టి & మీనాక్షిపురం
  3. కలకడ్ వన్యప్రాణుల అభయారణ్యం
  4. కరికిలి పక్షుల అభయారణ్యం
సమాధానం
2. అరిట్టపట్టి & మీనాక్షిపురం  

23. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 విజేత ?

  1. నిఖత్ జరీన్
  2. నీరజ్ చోప్రా
  3. సీమా పునియా
  4. శరత్ కమల్ ఆచంట
సమాధానం
4. శరత్ కమల్ ఆచంట

24. ద్రోణాచార్య అవార్డు కింది వారిలో ఎవరికి ఇవ్వబడుతుంది ?

  1. స్పోర్ట్ కోచ్‌లకు
  2. టెన్నిస్ క్రీడాకారులకు
  3. షూటింగ్ కోచ్‌లకు
  4. భారతీయ షూటర్లకు
సమాధానం
1. స్పోర్ట్ కోచ్‌లకు

25. సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2022 విజేత ?

  1. కొణిదల చిరంజీవి
  2. కార్లోస్ సౌరా
  3. అమితాబ్ బచ్చన్
  4. రజని కాంత్
సమాధానం
2. కార్లోస్ సౌరా

26. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌ కింది వాటిలో ఏ క్రీడకు చెందింది ?

  1. టేబుల్ టెన్నిస్
  2. క్రికెట్
  3. బోట్ రేసింగ్
  4. హాకీ
సమాధానం
4. హాకీ

27. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో లేని వారు ఎవరు ?

  1. చందర్‌పాల్ & ఖాదిర్
  2. అనిల్ కుంబ్లే & రాహుల్ ద్రవిడ్
  3. సచిన్ టెండూల్కర్ - ఏంఎస్ ధోని
  4. కపిల్ దేవ్ & సునీల్ గవాస్కర్
సమాధానం
3. సచిన్ టెండూల్కర్ - ఏంఎస్ ధోని

28. ఫిఫా ప్రపంచ కప్ 2022 కి ఆతిధ్యం ఇస్తున్న దేశం ఏది ?

  1. బ్రెజిల్
  2. ఖతార్
  3. ఇంగ్లాండ్
  4. పోర్చుగల్
సమాధానం
2. ఖతార్

29. భారత రాజ్యాంగ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు ?

  1. జనవరి 26
  2. ఆగష్టు 26
  3. అక్టోబర్ 26
  4. నవంబర్ 26
సమాధానం
4. నవంబర్ 26

30. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించే దినోత్సవం ?

  1. నేషనల్ స్టూడెంట్ డే
  2. నేషనల్ ఇంజనీరింగ్ డే
  3. నేషనల్ ఎడ్యుకేషన్ డే
  4. నేషనల్ సైన్స్ డే
సమాధానం
3. నేషనల్ ఎడ్యుకేషన్ డే

Post Comment