గ్రూపు I నోటిఫికేషన్
గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ కేటగిర్ల వారీగా 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియ రెండు దశల రాతపరీక్ష ద్వారా జరగనుంది. గతంలో గ్రూప్ I పోస్టుల తుది ఎంపికలో ఇంటర్వ్యూ నిర్వహించే వారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేసారు. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ 02 మే 2022 నుండి కానుంది. అర్హులైన అభ్యర్థులు 31 మే 2022 లోపు అధికారిక టీఎస్పీఎస్సీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల వారీగా ఖాళీలు
పోస్టు పేరు | ఖాళీలు | పే స్కేల్ |
డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ప్యూటీ సూపరింటెండెంట్ జైళ్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మున్సిపల్ కమిషనర్- గ్రేడ్ II అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మండల్ పరిషిత్ డెవలప్మెంట్ ఆఫీసర్ |
42 పోస్టులు 91 పోస్టులు 48 పోస్టులు 04 పోస్టులు 05 పోస్టులు 05 పోస్టులు 02 పోస్టులు 08 పోస్టులు 26 పోస్టులు 41 పోస్టులు 03 పోస్టులు 05 పోస్టులు 02 పోస్టులు 02 పోస్టులు 20 పోస్టులు 38 పోస్టులు 40 పోస్టులు 121 పోస్టులు |
58,850 - 1,37,050/- 58,850 - 1,37,050/- 58,850 - 1,37,050/- 54,220 – 1,33,630/- 54,220 – 1,33,630/- 54,220 – 1,33,630/- 54,220 – 1,33,630/- 54,220 – 1,33,630/- 51,320 – 1,27,310/- 51,320 – 1,27,310/- 54,220 – 1,33,630/- 54,220 – 1,33,630/- 54,220 – 1,33,630/- 51,320 -1,27,310/- 51,320 -1,27,310/- 51,320 -1,27,310/- 51,320 -1,27,310/- 51,320 -1,27,310/- |
గ్రూప్ I షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభం | 02 మే 2022 |
దరఖాస్తు తుది గడువు | 31 మే 2022 |
అడ్మిట్ కార్డు | జులై / ఆగష్టు 2022 |
ప్రిలిమినరీ పరీక్ష | జులై / ఆగష్టు 2022 |
మెయిన్స్ పరీక్ష | నవంబర్ / డిసెంబర్ 2022 |
ఫలితాలు | జనవరి 2023 |
దరఖాస్తు రుసుము
దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.
పోస్టు పేరు | జనరల్ అభ్యర్థులు | ఎస్సీ & ఎస్టీ, బీసీ , పీహెచ్, EWS |
అప్లికేషన్ ఫీజు | 200/- | 200/- |
ఎగ్జామినేషన్ ఫీజు | 120 /- | 0 /- (ఫీజు లేదు) |
పరీక్ష కేంద్రాలు ప్రిలిమినరీ & మెయిన్స్ ఎగ్జామ్
ఆసిఫాబాద్-కొమరంభీం, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, నల్గొండ, ములుగు, భోంగీర్-యాదాద్రి, ఆదిలాబాద్, జనగాం, ఆదిలాబాద్, జనగాం, నిర్మల్, మేడ్చల్-మల్కాజిగిరి. | సిరిసిల్ల-రాజన్న, వికారాబాద్, సిద్దిపేట, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, కామారెడ్డి, జోగులాంబ-గద్వాల్, భద్రాద్రి-కొత్తగూడెం, వనపర్తి, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, రంగా-రెడ్డి, కరీంనగర్, సంగారెడ్డి |
పరీక్ష విధానం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూపు I పోస్టుల నియామక ప్రక్రియ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వడపోత ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. ప్రిమినరీ పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులకు రెండవ దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు దశలలో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా మరియు వివిధ రిజర్వేషన్ల వారీగా తుది నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అభ్యర్థలకు ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులలో అర్హుత పొందాల్సి ఉంటుంది.
గ్రూపు I ప్రిలిమినరీ పరీక్ష విధానం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూపు I నియామక ప్రక్రియలో భాగంగా మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష 2.30 గంటల నిడివితో 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పద్దతితో ఏర్పాటు చేస్తారు. ప్రశ్నపత్రం జనరల్ స్టడీస్ మరియుమెంటల్ ఎబిలిటీ అంశాలతో కూడిన 150 ప్రశ్నలను కలిగిఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ ఇవ్వబడతయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు లభిస్తుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 ప్రశ్నలు | 150 మార్కులు | 2.30 గంటలు |
గ్రూపు I మెయిన్ పరీక్ష విధానం
ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులకు రెండవ దశలో 900 మార్కులకు 7 పేపర్లుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు జరుగుతుంది. వీటికి అదనంగా 150 మార్కులకు క్వాలిఫైయింగ్ పద్దతితో జనరల్ ఇంగ్లీష్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హుత పరీక్షగా మాత్రమే పరిగణిస్తారు. దీనిలో సాధించిన మార్కులు, ప్రధాన మార్కులకు జతచేయబడవు. ప్రతి పేపర్ 150 ప్రశ్నలతో, 3 గంటల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఒక్కో పేపర్ కోసం వివరంగా తెలుసుకుందాం.
జనరల్ ఇంగ్లీష్ ( క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ )
మొదటగా 150 మార్కులకు క్వాలిఫైయింగ్ పద్దతిలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష నిడివి 3 గంటలు ఉంటుంది. ప్రశ్నలు కాంప్రెహెన్సివ్ పసాగె, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జంబుల్డ్ సెంటన్స్, కరెక్ట్ ద సెంటన్స్ వంటి జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ అంశాల నుండి ఇవ్వబడతాయి. మొత్తం వివిధ కేటగిరిల వారీగా 13 నుండి 15 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ పరీక్షలో తప్పనిసరి అర్హుత పొందాల్సి ఉంటుంది. ఇందులో అర్హుత సాధించిన అభ్యర్థుల మెయిన్ పేపర్లు మాత్రమే మూల్యాంకణం చేయబడతయి.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ | 13-15 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
జనరల్ ఎస్సయ్ ( పేపర్ పేపర్ I )
పేపర్ I లో భాగంగా 150 మార్కులకు మూడు సాధారణ వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం మూడు సెక్షన్లుగా, ఒక్కో సెక్షన్ యందు 3 ప్రశ్నలు చెప్పున మొత్తం 9 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ యందు ఉన్న మూడు ప్రశ్నలలో ఒకదానికి వ్యాసరూప సమాధానం రాయాల్సి ఉంటుంది. సమాధానం చేసిన ప్రశ్నకు గరిష్టంగా 50 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 3 గంటలు ఉంటుంది. వ్యాసాలు ఇంగ్లీష్ లేదా తెలుగు బాష యందు రాయొచ్చు.
వ్యాసరూప ప్రశ్నలు సమకాలీన సామాజిక అంశాలు మరియు సామాజిక సమస్యలు. ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారతదేశ చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వం, సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి మరియు విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతాయి.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
జనరల్ ఎస్సయ్ | 3 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
హిస్టరీ, కల్చర్ & జాగ్రఫీ ( పేపర్ II )
గ్రూపు I మెయిన్ పరీక్షలో పేపర్ II హిస్టరీ, కల్చర్ మరియు జాగ్రఫీ అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 5 ప్రశ్నలు చెప్పున మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు ఛాయిస్ ప్రశ్న ఉంటుంది. సమాధనం చేసిన ప్రశ్నకు గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 3 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్ మరియు ఇండియన్ జాగ్రఫీ అంశాల నుండి ఇవ్వబడతయి.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
హిస్టరీ, కల్చర్ & జాగ్రఫీ | 15 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
భారతీయ సమాజం, రాజ్యాంగం మరియు పాలన ( పేపర్ III )
గ్రూపు I మెయిన్ పరీక్షలో పేపర్ III భారతీయ సమాజం, రాజ్యాంగం మరియు పాలన అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 5 ప్రశ్నలు చెప్పున మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు ఛాయిస్ ప్రశ్న ఉంటుంది. సమాధనం చేసిన ప్రశ్నకు గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 3 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో ఇండియన్ సొసైటీ, స్వాతంత్ర ఉద్యమం, ఇండియన్ పొలిటీ & గోవెర్నెన్స్ అంశాల నుండి ఇవ్వబడతయి.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
భారతీయ సమాజం, రాజ్యాంగం మరియు పాలన | 15 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
ఇండియన్ ఎకానమీ & డెవలప్మెంట్ ( పేపర్ IV )
గ్రూపు I మెయిన్ పరీక్షలో పేపర్ IV భారతీయ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి సంబంధిత అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 5 ప్రశ్నలు చెప్పున మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు ఛాయిస్ ప్రశ్న ఉంటుంది. సమాధనం చేసిన ప్రశ్నకు గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 3 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మరియు వాటి అభివృద్ధి సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతయి.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
భారతీయ ఆర్థిక వ్యవస్థ, దాని అభివృద్ధి | 15 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
సైన్స్ - టెక్నాలజీ & డేటా ఇంటర్‌ప్రెటేషన్ ( పేపర్ V )
పేపర్ V సైన్స్ మరియు టెక్నాలజీ అంశాలతో పాటుగా డేటా ఇంటర్‌ప్రెటేషన్ సంబంధిత అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 5 ప్రశ్నలు చెప్పున మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు ఛాయిస్ ప్రశ్న ఉంటుంది. సమాధనం చేసిన ప్రశ్నకు గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 3 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయి సిలబస్ తో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర మరియు ప్రభావం, ఆధునిక సైన్స్ అప్లికేషన్స్ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్ అంశాల నుండి ఇవ్వబడతయి.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
సైన్స్ మరియు టెక్నాలజీ & డేటా ఇంటర్‌ప్రెటేషన్ | 15 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ( పేపర్ VI )
పేపర్ VI తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంబంధిత అంశంలో కూడిన రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుండి 5 ప్రశ్నలు చెప్పున మొత్తం 15 ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు ఛాయిస్ ప్రశ్న ఉంటుంది. సమాధనం చేసిన ప్రశ్నకు గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష నిడివి 3 గంటల నిడివితో ఉంటుంది.
సబ్జెక్టు/సిలబస్ | ప్రశ్నల సంఖ్యా | మార్కులు | సమయం |
తెలంగాణ ఉద్యమం & తెలంగాణ రాష్ట్రం | 15 ప్రశ్నలు | 150 మార్కులు | 3 గంటలు |
తుది ఎంపిక
తుది ఎంపిక ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల్లో కనబర్చిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. వివిధ రిజర్వేషన్ కోటా పరిధిలో మెరిట్ లిస్ట్ రూపొందించి, పోస్టుల ఖాళీలను అనుచరించి తుది షార్ట్ లిష్డ్ట్ రూపొందిస్తారు.
కేటగిరి & రిజర్వేషన్ | కేటగిరి & రిజర్వేషన్ |
బీసీ - 29% ఎస్సీ - 15% ఎస్టీ - 7% |
EWS - 10% Sports - 2% PH - 4%. |
క్వాలిఫైయింగ్ మార్కులు
- జనరల్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, మాజీ సైనికులు - 40% మార్కులు తప్పనిసరి.
- బీసీ అభ్యర్థులు లకు 35 శాతం మార్కులు తప్పనిసరి.
- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు అవసరం