Advertisement
జీవశాస్త్రం యొక్క శాఖలు – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాధానాలు
Study Material

జీవశాస్త్రం యొక్క శాఖలు – ప్రాక్టీస్ ప్రశ్నలు & సమాధానాలు

జీవుల గురించి అధ్యాయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అంటారు. బయాలజీ పదం ప్రాచీన గ్రీకు భాష నుండి తీసుకోబడింది. బయోస్ అనగా జీవం అని, లాగోస్ అనగా శాస్త్రం లేదా పరిశీలిన అని అర్ధం. బయాలజీ ఎన్నో శాఖల సమ్మేళనం. ఈ అంశానికి సంబంధించి నీట్ మరియు ఇతర నియామక పరీక్షల యందు ఇదివరకు వచ్చిన పాతప్రశ్నలు మాదిరి ప్రశ్నలను ప్రయత్నించండి.

1. కాన్సర్ కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?

  1. ఎంటమాలజీ
  2. ఆంకాలజీ
  3. హిస్టాలజీ
  4. న్యూరాలజీ
సమాధానం
2. ఆంకాలజీ

2. శిలింద్రాల కోసం చేసే అధ్యయనాన్ని ఏమంటారు ?

  1. కంకాలోజి
  2. లైకెనాలజీ
  3. మైకాలజీ
  4. పైకాలజీ
సమాధానం
3. మైకాలజీ

3. వైరాలజీ అనగా ?

  1. కండరాల కోసం అధ్యయనం
  2. క్షీరదాల కోసం అద్యయనం
  3. వైరసుల కోసం అద్యయనం
  4. నాడీవ్యవస్థ అధ్యయనం
సమాధానం
3. వైరసుల కోసం అద్యయనం

4. మంచినీటి జీవుల అధ్యయనాన్ని ఏమంటారు ?

  1. ఎండోక్రినాలజీ
  2. నిడాలాజీ
  3. లిమ్నాలాజీ
  4. ఆక్వాకల్చర్
సమాధానం
3. లిమ్నాలాజీ

5. ఈ క్రింది వాటిలో సరైన జతను ఎంపిక చేయండి ?

  1. హేమాటాలజీ - రక్తం కోసం అధ్యయనం
  2. కార్డియాలాజీ - కార్డేటా జీవుల అధ్యయనం
  3. ఆంత్రోపాలజీ - పక్షుల అధ్యయనం
  4. కాంకాలాజీ - ఎముకుల అధ్యయనం
సమాధానం
1. హేమాటాలజీ - రక్తం కోసం అధ్యయనం

6. బ్రయోఫైట్స్ స్టడీని ఏమంటారు ?

  1. లైకెనాలజీ
  2. మైకాలజీ
  3. బ్రయాలజీ
  4. టెరిడాలాజీ
సమాధానం
3. బ్రయాలజీ

7. పాములు, బల్లులు, తొండలు వంటి జీవుల అధ్యయనాన్ని ఏమంటారు ?

  1. జెరంటాలాజీ
  2. హెమటాలజీ
  3. హెర్పటాలాజీ
  4. ఫార్మాకాలజీ
సమాధానం
3. హెర్పటాలాజీ

8. క్రింది జాబితాలో ఉన్న వృక్షశాస్త్ర విభాగంను గుర్తించండి ?

  1. ఎపికల్చర్
  2. ఆక్వాకల్చర్
  3. హార్టీకల్చర్
  4. సేరికల్చర్
సమాధానం
3. హార్టీకల్చర్

9. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ?

  1. ఎంబ్రయోలజీ - జీవుల పిండాభివృధిని అధ్యయనం చేసే విభాగం
  2. హిస్టోలాజీ - కణజాలాల కోసం అధ్యయనం చేసే శాస్త్రం
  3. సైటాలజీ - శైవలాల కోసం అధ్యయనం చేసే శాస్త్రం
  4. పాలియోంటాలజీ - పురాతన శిలాజాల కోసం అధ్యయనం చేసే శాస్త్రం
సమాధానం
3. సైటాలజీ - శైవలాల కోసం అధ్యయనం చేసే శాస్త్రం

10. వ్యాధి/గాయం యొక్క కారణాలు & ప్రభావాలను అధ్యయనం చేసే శాస్త్రం ?

  1. పాథాలజీ
  2. మమ్మాలజీ
  3. ఫీజియోలాజీ
  4. ఫార్మాకాలజీ
సమాధానం
1. పాథాలజీ

11. జీవుల పరిమాణం, ఆకారం & నిర్మాణం కోసం స్టడీ చేసే శాస్త్రం ?

  1. మార్ఫాలజీ
  2. బయోటెక్నాలజీ
  3. హిస్టాలజీ
  4. గైనకాలజీ
సమాధానం
1. మార్ఫాలజీ

12. జీవుల వంశపారంపర్యత కోసం అధ్యయనం చేయాలంటే ?

  1. జెనెటిక్స్ చదవాలి
  2. ఫోరెన్సిక్ సైన్స్ చదవాలి
  3. ఎంబ్రియాలజీ చదవాలి
  4. జీవపరిణామ సిద్ధాంతాన్ని చదవాలి
సమాధానం
1. జెనెటిక్స్ చదవాలి

13. జెనెటిక్ క్లోనింగ్ క్రింది వాటిలో దేనికి సంబంధించిన అంశం ?

  1. జెనెటిక్స్
  2. న్యూరాలజీ
  3. బయోటెక్నాలజీ
  4. మైక్రోబయాలజీ
సమాధానం
3. బయోటెక్నాలజీ

14. వివిధ కీటకాల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?

  1. మైక్రోబయాలజీ
  2. ఇథాలజీ
  3. ఏంటమాలజీ
  4. బయోటెక్నాలజీ
సమాధానం
3. ఏంటమాలజీ

15. ఎఫెక్టివ్ న్యూట్రిషన్ అనేది క్రింది వాటిలో దేనికి మంచి ఉదాహరణ ?

  1. యుథెనిక్స్
  2. యుజెనిక్స్
  3. యూఫెనిక్స్
  4. ఏవి కావు
సమాధానం
1. యుథెనిక్స్

16. ఆరోగ్యమైన సంతానం కోసం స్పెర్మ్ బ్యాంక్‌లను స్థాపించడం దేనికి ఉదాహరణ ?

  1. యుథెనిక్స్
  2. యుజెనిక్స్
  3. యూఫెనిక్స్
  4. బయోటెక్నాలజీ
సమాధానం
2. యుజెనిక్స్

17. సమస్యాత్మక జన్యు స్థితిని మెరుగుపర్చే చికిత్స విధానాలను ఏమంటారు ?

  1. యుథెనిక్స్
  2. యుజెనిక్స్
  3. యూఫెనిక్స్
  4. జెనెటిక్ ఇంజనీరింగ్
సమాధానం
3. యూఫెనిక్స్

18. హైడ్రోపోనిక్స్ సంబంధించి సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి ?

  1. హైడ్రోపోనిక్స్ అనేది ఒక రకమైన హార్టికల్చర్
  2. హైడ్రోపోనిక్స్ అనేది ఒక రకమైన హైడ్రోకల్చర్
  3. హైడ్రోపోనిక్స్ అనేది మట్టి లేకుండా మొక్కలను పెంచే పద్ధతి
  4. పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని

19. క్రిందివాటిలో ఆస్మాసిస్ సంబంధించి సరైన ఉదాహరణ ఏది ?

  1. మూత్రపిండాల డయాలసిస్
  2. ఉప్పగా ఉండే ఆహారం తీసుకున్న తర్వాత దాహం దాహం వేయడం
  3. చేపలు చర్మం మరియు మొప్పల ద్వారా నీటిని పీల్చుకోవటం
  4. పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని

20. పారాసిటాలజీ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. పారాసిటమాల్ తయారీ కోసం బోధించే శాస్త్రం
  2. పరాగ రేణువుల కోసం అధ్యయనం చేసే శాస్త్రం
  3. పరాన్నజీవుల అధ్యయన విభాగం
  4. ప్రోటోజోవా జీవుల అధ్యయనం
సమాధానం
3. పరాన్నజీవుల అధ్యయన విభాగం

21. జీవుల శిలాజల నమూనాలను రికార్డు చేసే శాస్త్రవేత్తను ఏమంటారు ?

  1. ఫోరెన్సిక్ శాస్త్రవేత్త
  2. ఫార్మకాలజిస్ట్
  3. మైక్రోబయాలజిస్ట్
  4. పాలియోంటాలజిస్ట్
సమాధానం
4. పాలియోంటాలజిస్ట్

22. క్రైమ్ జరిగే ప్రదేశంలో కనిపించే శాస్త్రవేత్త ఎవరు ?

  1. ఫోరెన్సిక్ శాస్త్రవేత్త
  2. డిటెక్టీవ్ ఏజెంట్
  3. పాలియోంటాలజిస్ట్
  4. పై ఎవరు కాదు
సమాధానం
1. ఫోరెన్సిక్ శాస్త్రవేత్త

23. జంతువులకు వైద్యం అందించే శాస్త్ర విభాగం ఏది ?

  1. యానిమల్ హస్బెండరీ
  2. జూవాలాజీ
  3. పారామెడికల్ విభాగం
  4. వెటర్నరీ సైన్స్
సమాధానం
4. వెటర్నరీ సైన్స్

24. క్రిందివాటిలో బయాలజీ విభాగం కానిది ఏది ?

  1. బయోకెమిస్ట్రీ
  2. జియోఇన్ఫర్మేటిక్స్
  3. జెనెటిక్ టెక్నాలజీ
  4. మాలిక్యూలర్ బయాలజీ
సమాధానం
2. జియోఇన్ఫర్మేటిక్స్

25. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి ?

  1. ఎవల్యూషన్ - జీవుల పరిమాణం కోసం బోధిస్తుంది
  2. ఎకాలజీ - జీవుల పర్యావరణం కోసం బోధిస్తుంది
  3. ఇమ్యునాలజీ - జీవుల రోగనిరోధికత కోసం బోధిస్తుంది
  4. అనాటమీ - శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేసే శాస్త్రం
సమాధానం
1. ఎవల్యూషన్ - జీవుల పరిమాణం కోసం బోధిస్తుంది

26. పిల్లలకు వైద్యం చేసే మెడికల్ స్పెసిలిస్టును ఏమంటారు ?

  1. గైనకాలజిస్ట్
  2. వెటర్నరీ డాక్టర్
  3. ఆర్థోపెడిక్
  4. పీడియాట్రిక్
సమాధానం
4. పీడియాట్రిక్

27. జూఫైటాలజీకి సరైన నిర్వచనం ?

  1. జంతు ప్రదర్శనశాల యందు మొక్కల అద్యయనం
  2. నీటిలో తేలియాడే మొక్కల అద్యయనం
  3. మొక్కలను పోలివుండే జంతువుల అద్యయనం
  4. జంతు లక్షణాలు కలిగిన శైవలాల అద్యయనం
సమాధానం
3. మొక్కలను పోలివుండే జంతువుల అద్యయనం

28. నార్కోటిక్ విభాగంతో దగ్గర బందుత్వం ఉండే సైన్స్ విభాగం ?

  1. ఫోరెన్సిక్ సైన్స్
  2. టాక్సికాలజీ
  3. జెనెటిక్ సైన్స్
  4. ఫార్మాకోథెరపీటిక్స్
సమాధానం
2. టాక్సికాలజీ

29. మానసిక రోగులకు చికిత్స అందించే డాక్టర్లను ఏమంటారు ?

  1. ఫార్మకాలజిస్ట్
  2. సైకియాట్రిస్ట్
  3. పీడియాట్రిక్
  4. పైవి అన్ని
సమాధానం
2. సైకియాట్రిస్ట్

30. క్రింది వాటిలో మెరైన్ బయాలజీ సంబంధించి సరైన నిర్వచనం ?

  1. నదీముఖ ప్రాంతాల జీవుల అద్యయనం
  2. ఉప్పునీటి జీవుల అద్యయనం
  3. సముద్ర జీవుల అద్యయనం
  4. సముద్ర జీవుల మైగ్రేషన్ పై అద్యయనం
సమాధానం
3. సముద్ర జీవుల అద్యయనం

One Comment

Post Comment