1. సింధు నది ప్రవహించే ఏకైక భారతీయ రాష్ట్రం ఏది ?
- జమ్మూ &కాశ్మీర్
- ఉత్తరాఖండ్
- పంజాబ్
- గుజరాత్
సమాధానం
1. జమ్మూ & కాశ్మీర్
2. సింధు నది ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది ?
- జీలం
- చీనాబ్
- రావి
- బియాస్
సమాధానం
2. చీనాబ్
3. పంచనదుల భూమి అని ఏ రాష్టాన్ని అంటారు ?
- గుజరాత్
- రాజస్థాన్
- ఉత్తరప్రదేశ్
- పంజాబ్
సమాధానం
4. పంజాబ్
4. టిబెటన్ పీఠభూమిలోని మానసరోవర్ సరస్సు వద్ద ఉద్భవించే నది ?
- సింధు నది
- బ్రహ్మపుత్ర నది
- గంగా నది
- యమున నది
సమాధానం
1. సింధు నది
5. కింది వానిలో గంగా నది ప్రవహించని రాష్ట్రం ఏది ?
- ఉత్తరాఖండ్
- ఉత్తరప్రదేశ్
- బీహార్
- పశ్చిమ బెంగాల్
సమాధానం
1. ఉత్తరాఖండ్
6. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది ?
- మంజీరా
- ప్రాణహిత
- సబర్మతి
- ఇంద్రావతి
సమాధానం
3. సబర్మతి
7. థార్ ఎడారి గుండా వెళ్లి రాన్ ఆఫ్ కచ్‌లో ముగిచే నది ఏది ?
- తాపి నది
- సరస్పతి నది
- సబర్మతి నది
- లూని నది
సమాధానం
4. లూని నది
8. రాజస్థాన్ ఎడారిలో అంతర్వాహినిగా ప్రవహించే నది ?
- తాపి నది
- సరస్పతి నది
- సబర్మతి నది
- లూని నది
సమాధానం
2. సరస్పతి నది
9. గంగా నది అత్యధిక దూరం ప్రవహించే రాష్ట్రం ఏది ?
- బీహార్
- ఉత్తరప్రదేశ్
- పశ్చిమ బెంగాల్
- అస్సాం
సమాధానం
2. ఉత్తర ప్రదేశ్
10. కింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది ?
- తుంగభద్ర నది
- మూసీ నది
- దూద్ గంగా నది
- ఇంద్రావతి నది
సమాధానం
4. ఇంద్రావతి నది
11. కింది వాటిలో పశ్చిమంగా ప్రవహించని నది ఏది ?
- నర్మదా నది
- శరావతి నది
- సబర్మతి నది
- ఇంద్రావతి నది
సమాధానం
4. ఇంద్రావతి నది
12. బైతరణి నది ప్రవహించే రాష్ట్రం ఏది ?
- గుజరాత్
- మధ్యప్రదేశ్
- ఒడిశా
- బీహార్
సమాధానం
3. ఒడిశా
13. వింధ్య, సాత్పురా పర్వత లోయల మధ్య ప్రవహించే నది ఏది ?
- నర్మదా నది
- తపతి నది
- గోదావరి నది
- చంబల్ నది
సమాధానం
1. నర్మదా నది
14. దీపకల్ప నదుల్లో పొడవైన నది ఏది ?
- నర్మద నది
- కృష్ణా నది
- గోదావరి నది
- తపతి నది
సమాధానం
3. గోదావరి నది
15. యమునా నది, గంగా నది కలిసే ప్రదేశం ఏది ?
- గంగోత్రి
- హరిద్వార్
- అలహాబాద్
- వారణాసి
సమాధానం
3. అలహాబాద్
16. ప్రపంచంలో అతిపెద్ద నది పరీవాహిక డెల్టా ఏది ?
- మిస్సిస్సిప్పి డెల్టా
- నైలు డెల్టా
- సుందర్‌బన్ డెల్టా
- గోదావరి డెల్టా
సమాధానం
3. సుందర్‌బన్ డెల్టా
17. కింది వాటిలో భూపరివేష్టిత నది ఏది ?
- తాపి నది
- సరస్పతి నది
- సబర్మతి నది
- లూని నది
సమాధానం
4. లూని నది
18. కింది వాటిలో సిక్కింలో ప్రవహించే నది ఏది ?
- తీస్తా నది
- రంగీత్ నది
- మానస్ నది
- 1 మరియు 2
సమాధానం
4. 1 మరియు 2
19. కపిల్ ధార జలపాతం ఏ నదిపై ఉంది ?
- గోదావరి నది
- కృష్ణా నది
- నర్మదా నది
- గంగా నది
సమాధానం
3. నర్మదా నది
20. దిహాంగ్ పేరుతొ పిలవబడే నది ఏది ?
- తుంగభద్ర నది
- సింధు నది
- కావేరి నది
- బ్రహ్మపుత్ర
సమాధానం
4. బ్రహ్మపుత్ర
21. దామోదర్ నది ప్రవహించే రాష్ట్రం ఏది ?
- జార్ఖండ్
- మధ్యప్రదేశ్
- బీహార్
- ఛత్తీస్‌గఢ్
సమాధానం
1. జార్ఖండ్
22. కింది వాటిలో సువర్ణరేఖ నదిపై కనిపించే జలపాతం ఏది ?
- కపిల్ దార్ జలపాతం
- దూద్ సాగర్ జలపాతం
- జోగ్ జలపాతం
- హుండ్రు జలపాతం
సమాధానం
4. హుండ్రు జలపాతం
23. బారీ దొబ్ మైదానం ఏ రెండు నదుల మధ్య ఏర్పడింది ?
- నర్మదా & తపతి
- రావి & బియాస్
- బియాస్ & సట్లెజ్
- చీనాబ్ & బియాస్
సమాధానం
2. రావి & బియాస్
24. చైనా, నేపాల్, ఇండియా దేశాలలో ప్రవహించే నది ఏది ?
- బ్రహ్మపుత్ర
- సింధు నది
- గంగా నది
- కోసి నది
సమాధానం
4. కోసి నది
25. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నది ఏది ?
- దామోదర నది
- లూని నది
- ఉమ్‌గోట్ నది
- చంబల్ నది
సమాధానం
3. ఉమ్‌గోట్ నది
26. అమర్‌కంటక్ వద్ద ఉద్బవించే నది ఏది ?
- నర్మదా నది
- గోదావరి నది
- కావేరి నది
- మహానది
సమాధానం
1. నర్మదా నది
27. బంగ్లాదేశ్ యందు పద్మ పేరుతొ ప్రవహించే నది ఏది ?
- గంగా నది
- బ్రహ్మపుత్ర
- సింధు నది
- హుగ్లీ నది
సమాధానం
1. గంగా నది
28. బంగ్లాదేశ్ యందు జమున పేరుతొ ప్రవహించే నది ఏది ?
- గంగా నది
- బ్రహ్మపుత్ర
- సింధు నది
- పద్మ నది
సమాధానం
2. బ్రహ్మపుత్ర
29. దేవ ప్రయాగలో సంగమించే రెండు నదులు ఏవి ?
- అలకనంద & భాగీరథి
- అలకనంద & గంగా
- భాగీరథి & గంగా
- గంగా & యమునా
సమాధానం
1. అలకనంద & భాగీరథి
30. మాండవి, జువారి, రాచోల్ నదులు కనిపించే రాష్ట్రం ఏది ?
- కర్ణాటక
- గోవా
- తమిళనాడు
- కేరళ
సమాధానం
2. గోవా