Advertisement
కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | రిపోర్టులు & ర్యాంకులు
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | రిపోర్టులు & ర్యాంకులు

కోవిడ్ 19 రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా అండమాన్ & నికోబార్ దీవులు

అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశంలో అధికారికంగా కోవిడ్ -19 నుండి విముక్తి పొందిన మొదటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. 31 మార్చి 2022 తరువాత ఈ ప్రాంతంలో ఎటువంటి కోవిడ్ కేసులు నమోదు కానట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈరెండేళ్లో మొత్తం 4,932 కోవిడ్ కేసులు నమోదు అవ్వగా అందులో 62 మరణాలు సంభవించినట్లు నివేదించింది.

అతిపెద్ద డిటిహెచ్ ప్లాట్‌ఫారమ్‌గా దూరదర్శన్ ఫ్రీడిష్

ప్రసార్ భారత్ యొక్క దూరదర్శన్ ఫ్రీడిష్ 43 మిలియన్ల గృహాలకు చేరువైన అతిపెద్ద డీటీహెచ్ ప్లాట్‌ఫారమ్‌గా అవతరించినట్లు భారత సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2017లో 22 మిలియన్ల వినియోగదారులు ఉండగా, ప్రస్తుతం 2022లో 43 మిలియన్లకు దాదాపు 100 శాతం వృద్ధిని సాధించినట్లు నివేదించింది.

ప్రసార భారతి యొక్క ఈ ఫ్రీ డిటిహెచ్ ఉపయోగించే వీక్షకులు ఎటువంటి నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లించనవసరం లేదు. డీడీ సెట్-టాప్ బాక్స్ కొనుగోలు సమయంలో  రెండు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. దూరదర్శన్ ఫ్రీడిష్ ప్రస్తుతం 91 దూరదర్శన్ ఛానెల్‌లు మరియు 76 ప్రైవేట్ టీవీ ఛానెల్‌లతో సహా మొత్తం 167 TV ఛానెల్‌లు మరియు 48 రేడియో ఛానెల్‌లను హోస్ట్ చేస్తుంది. ఈ సేవలు కేవలం మారుమూల గ్రామీణ మరియు గిరిజన గ్రామాల ప్రజల కోసం ప్రారంభించబడ్డాయి.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించే తోలి ఎన్‌జిఓగా సంకల్ప్‌తరు ఫౌండేషన్

పర్యావరణ పరిరక్షణ రంగంలో బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని ప్రారంభించిన మొదటి భారతీయ ఎన్‌జిఓగా సంకల్ప్‌తరు ఫౌండేషన్ అవతరించింది. దాతలు మరియు స్పాన్సర్‌ల నమ్మకాన్ని పెంపొందించడంలో భాగంగా దీని ఉపయోగించనుంది. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అనేది ఒకరకమైన రికార్డ్ కీపింగ్ టెక్నాలజీ. దీని ఉపయోగించడం ద్వారా సిస్టమ్‌ను హ్యాక్ చేయడం లేదా దానిలో నిల్వ చేసిన డేటాను ఫోర్జరీ చేయడం అసాధ్యం. తద్వారా ముఖ్యమైనసమాచారం సురక్షితంగా మరియు మార్పులేనిదిగా ఉంచబడుతుంది.

సంకల్ప్‌తరు ఫౌండేషన్ అనేది సామాజిక-పర్యావరణ ప్రభావాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేయబడింది. ఇది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలను ఏర్పాటుచేస్తుంది.  తద్వారా వాతావరణం నుండి కార్బన్‌ను తగ్గించడమే మా లక్ష్యంగా పనిచేస్తుంది.

నిరుద్యోగిత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ అగ్రస్థానం

దేశంలో అత్యల్ప నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్‌గఢ్ అగ్రస్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్ ఈ మార్చిలో ఆల్ టైమ్ కనిష్ట (0.6 శాతం) నిరుద్యోగిత రేటును నమోదు చేసింది. ఇదే సమయంలో దేశంలో నిరుద్యోగిత రేటు 7.6 శాతంగా నమోదు అయ్యింది.

ఈ జాబితా ప్రకారం దేశంలో హర్యానా అత్యధికంగా 26.7 శాతం, రాజస్థాన్ మరియు జమ్మూ కాశ్మీర్‌లు 25 శాతం మరియు జార్ఖండ్‌లో 14.5 శాతం చొప్పున అత్యధిక నిరుద్యోగిత రేటును కలిగివున్నాయి.

దేశంలోని కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా తన హోదాను తిరిగి పొందింది. గత రెండేళ్లుగా ఈ స్థానంలో పశ్చిమ బెంగాల్‌ ఉండగా, ప్రస్తుతం రెండవ స్థానానికి పరిమితమయ్యింది. కూరగాయల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ మధ్య వ్యత్యాసం దాదాపు 0.7 మిలియన్ టన్నులు ఉంది. మరోవైపు పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎప్పటిలానే అగ్రగామిగా కొనసాగుతోంది.

ప్రపంచ అత్యంత రద్దీ విమానాశ్రయంగా అట్లాంటా

ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ విమానాశ్రయం నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నివేదిక ప్రకారం టాప్ 10లో ఎనిమిది విమానాశ్రయాలు యునైటెడ్లో స్టేట్స్ యందు ఉన్నాయి. మిగతా రెండు చైనా నుండి చోటు సంపాదించుకున్నాయి.

'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్'గా ముంబై

యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) సహకారంతో అర్బర్ డే ఫౌండేషన్ ముంబైని 'ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2021'గా ప్రకటించింది. దీనితో హైదరాబాద్ తర్వాత ఈ టైటిల్‌ను దక్కించుకున్న రెండవ భారతీయ నగరంగా నిలిచింది. ట్రీ సిటీస్ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రాం యొక్క అధికారిక నివేదిక ప్రకారం ముంబై సుమారు నాలుగు లక్షల ఇరవైవేల మొక్కలు నటినట్లు వెల్లడించింది.

 

Post Comment