టాపర్ లెర్నింగ్ : ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ & డిజిటల్ టెలివిజన్
Online Education Useful websites

టాపర్ లెర్నింగ్ : ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ & డిజిటల్ టెలివిజన్

ఇండియన్ ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో టాపర్ లెర్నింగ్ ఒకానొక లీడింగ్ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫారమ్‌గా చెప్పొచ్చు. ఇది నెట్‌వర్క్ 18 మీడియా సంస్థ ద్వారా రూపొందించబడింది. ఇది ఇండియన్ పాఠశాల విద్యకు సంబంధించి కేజీ నుండి 10+2 వరకు పూర్తిస్థాయి సీబీఎస్‌ఈ మరియు ఐసీఎస్‌ఈ సిలబస్ ఆధారిత ఆన్‌లైన్ కంటెంట్ అందిస్తుంది.

Advertisement

ఈ వేదికలో 14 వేలకు పైగా వీడియో కంటెంట్ అందుబాటులో ఉంది. అలానే 1300+ సమాధానం చేసిన ప్రశ్నపత్రాలు, మూడు లక్షలకు పైగా సమాధానం చేసిన ప్రశ్నలు ఏ వేదికలో పొందుపర్చారు. టాపర్ లెర్నింగ్ డిజిటల్ కంటెంట్‌తో పాటుగా 24/7 అందుబాటులో ఉండేలా పూర్తిస్థాయి ఎడ్యుకేషనల్ డిజిటల్ టీవీ ఛానల్ ప్రవేశపెట్టింది.

ఈ ఛానల్ కేబుల్ మరియు అన్ని డీటీహెచ్ నెట్‌వర్క్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఛానల్ ద్వారా 24 గంటల నిడివితో పూర్తి అకాడమిక్ ప్రణాళికతో ఆన్‌లైన్ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందిస్తున్నారు. అందులో భాగంగా కాన్సెప్ట్ వీడియోలు, స్లైడ్‌షోలు, ఆడియో ప్రెజెంటేషన్‌లు, 2డీ / 3డీ యానిమేషన్‌లు మరియు నిజ జీవిత అనుభవాలకు దగ్గరగా పాఠ్యంశాలు రూపొందించి ప్రచారం చేస్తున్నారు.
topper learning
టాపర్ లెర్నింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ తో పాటుగా జేఈఈ మరియు నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అవసరమయ్యే కంటెంట్ అందిస్తుంది. ఎంతో పోటీ ఉండే ఈ ప్రవేశ పరీక్షలను ఇంటినుండే ప్రిపేర్ అయ్యేందుకు అవసమయ్యే అన్ని ఫీచర్లును వీరు అందిస్తున్నారు.

ఇందులో భాగంగా  వీడియో ట్యుటోరియల్స్, మాక్ టెస్టులు, లైవ్ సెషన్స్, అపరిమిత సపోర్టు తో పాటుగా బోర్డు ఎగ్జామ్ ప్రిపరేషన్ సపోర్టు మెటీరియల్, సమాధానం చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మరియు ఫేమస్ టిెక్ట్స్ బుక్స్ అందిస్తుంది. ఆన్‌లైన్ లెర్నింగ్ ఇష్టపడే వారికీ టాపర్ లెర్నింగ్ ఖచ్చితంగా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

Advertisement