Advertisement
ముఖ్యమైన రోజులు మరియు తేదీలు సెప్టెంబర్ 2023
Important Dates

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు సెప్టెంబర్ 2023

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు సెప్టెంబర్ 2023 కోసం చదవండి. సెప్టెంబరు నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

నేషనల్ న్యూట్రిషన్ వీక్ - సెప్టెంబర్ మొదటి వారం

జాతీయ పోషకాహార వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జరుపుకుంటారు. ఇది సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తారు. 2022 ఏడాదికి సంబంధించి ' సెలబ్రేట్ ఎ వరల్డ్ ఆఫ్ ఫ్లేవర్స్' అనే థీమ్ తో జరుపుకున్నారు. ఆహార రుచులను ఆస్వాదిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని దీని అర్ధం.

వరల్డ్ కోకోనట్ డే - సెప్టెంబర్ 02

ప్రతి సంవత్సరం, సెప్టెంబర్ 2 ను ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు. ఇండోనేషియాలోని జకార్తాలో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఆసియా మరియు పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ (APCC) చొరవతో 2009 లో దీనిని ప్రారంభించారు. ఇండోనేషియా ప్రపంచంలోనే అగ్రగామి కొబ్బరి ఉత్పత్తిదారుగా ఉంది. దీని తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా ఉంది.

స్కైస్క్రాపర్ డే - సెప్టెంబర్ 03

సెప్టెంబర్ 3 ని ఏటా నేషనల్ స్కైస్క్రాపర్ డేగా జరుపుకుంటారు. ఆకాశహర్మ్యాల పితామహుడుగా పిలవబడే అమెరికన్ ఆర్కిటెక్ట్ లూయిస్ హెచ్. సుల్లివన్ పుట్టిన రోజు జ్ఞాపకార్థం ఈ వేడుకలను జరుపుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణ రికార్డు దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లోని 828-మీటర్ల (2,717 అడుగులు) బుర్జ్ ఖలీఫా పేరిట ఉంది.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఛారిటీ - సెప్టెంబర్ 05

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఛారిటీ అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం. దీనిని 2012లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. 1997లో ఇదే రోజున మరణించిన మదర్ థెరిసా జ్ఞాపకార్థం ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈరోజున ప్రజలు, స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వివిధ దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొని అవసరమైన వారికి సహాయం అందిస్తారు.

అల్బేనియన్-ఇండియన్ కాథలిక్ సన్యాసిని అయినా మదర్ థెరిసా, 1950లో మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించింది. కలకత్తాలోని ఒక రోమన్ క్యాథలిక్ బాలికల పాఠశాలలో తన అధ్యాపక పదవిని విడిచిపెట్టి, ఆ నగరంలోని మురికివాడలలోని అనాథలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఈమె చేసిన సేవలకు గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ 1979లో నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది.

ఉపాధ్యాయ దినోత్సవం - సెప్టెంబర్ 05

భారతదేశ రెండవ రాష్ట్రపతి మరియు మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. ఇకపోతే అనేక దేశాలు అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దీనిని యునెస్కో 1994లో  ప్రారంభించింది.

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం - సెప్టెంబర్ 08

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న జరుపుకునే అంతర్జాతీయ వేడుక. దీనిని 1967లో  యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రారంభించింది. ఈ వేడుకను విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు, అక్షరాస్యత వలన మానవవులకు కలిగే ప్రయోజనాల కోసం అవగాహనా కల్పిస్తారు.

ప్రపంచ ఫిజికల్ థెరపీ దినోత్సవం - సెప్టెంబర్ 08

ప్రపంచ ఫిజికల్ థెరపీ డే ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 న జరుపుకుంటారు. ఫిజికల్ థెరపిస్ట్‌ల కీలక పాత్ర గురించి అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిని మొదటిసారి 1996 సెప్టెంబర్ 8న జరుపుకున్నారు.

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం - సెప్టెంబర్ 10

వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే (WSPD)ను ఏటా సెప్టెంబర్ 10న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 2003 నుండి ఏటా జరుపుకుంటారు. ఆత్మహత్యలను నివారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ పెయిన్ ((IASP) దీనిని నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయ సహకారాలు అందిస్తుంది.

ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం - సెప్టెంబర్ 2వ శనివారం

ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ శనివారం జరుపుకుంటారు. ప్రథమ చికిత్స అనేది గాయపడిన వ్యక్తికి వెంటనే అందించబడే అత్యవసర చికిత్స. ప్రథమ చికిత్సపై ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ సొసైటీస్ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంది.

జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం - సెప్టెంబర్ 11

భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించబడింది. భారతదేశం అంతటా అరణ్యాలు, అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన అనేక మంది కార్యకర్తలకు నివాళులర్పించేందుకు ఈ రోజును జరుపుకుంటారు. సెప్టెంబర్ 11, 1730న జరిగిన విషాదకరమైన ఖేజర్లీ ఊచకోత జ్ణాపకార్థం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు.

హిందీ దివస్ - సెప్టెంబర్ 14

భారత రాజ్యాంగంలో స్థానిక భాషలకు అధికారిక హోదా కల్పించిన 14 సెప్టెంబరు1949 తేదీ జ్ఞాపకార్థం హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత రాజ్యాంగంలో 22 భాషలకు రాజ్యాంగ హోదా కల్పించబడింది.

భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు : 1) అస్సామీ, (2) బెంగాలీ, (3) గుజరాతీ, (4) హిందీ, (5) కన్నడ, (6) కాశ్మీరీ, (7) కొంకణి, (8) మలయాళం, (9) మణిపురి, (10) మరాఠీ, ( 11) నేపాలీ, (12) ఒరియా, (13) పంజాబీ, (14) సంస్కృతం, (15) సింధీ, (16) తమిళం, (17) తెలుగు, (18) ఉర్దూ (19) బోడో, (20) సంతాలి, (21) ) మైథిలి మరియు (22) డోగ్రీ.

ఇంజనీర్స్ డే - సెప్టెంబర్ 15

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న, శ్రీలంక మరియు టాంజానియాతో పాటు భారతదేశం జాతీయ ఇంజనీర్ దినోత్సవాన్ని జరుపుకుంటుంటుంది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారు.

ఇంజనీర్స్ డే అనేక దేశాలలో వివిధ తేదీలలో జరుపుకుంటారు. 25 నవంబర్ 2019న, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్స్ చేసిన ప్రతిపాదన ఆధారంగా, యునెస్కో మార్చి 4ని 'సుస్థిర అభివృద్ధి కోసం యూనిస్కో వరల్డ్ ఇంజనీరింగ్ డే'గా ప్రకటించింది.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం - సెప్టెంబర్ 15

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 న జరుపుకుంటారు. ప్రజాస్వామ్య సూత్రాలను ప్రోత్సహించడం మరియు సమర్థించలనే ఉద్దేశ్యంతో దీనిని జరుపుకుంటారు. దీనిని ఐక్యరాజ్యసమితి 8 నవంబర్ 2007న ఏకాభిప్రాయంతో ఆమోదించింది.

ప్రపంచ ఓజోన్ దినోత్సవం - సెప్టెంబర్ 16

ఓజోన్ పొర క్షీణత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, సంరక్షించడానికి, సాధ్యమైన పరిష్కారాలను కనుగొనడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1987లో ఓజోన్ పొరను క్షీణింపజేసే పదార్థాలపై ప్రపంచ దేశాలు మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకం చేసిన తేదీ జ్ఞాపకార్థం డిసెంబర్ 19, 2000న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే - సెప్టెంబర్ 17

ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే, ఏటా సెప్టెంబరు 17న నిర్వహించబడుతుంది. రోగుల భద్రత గురించి ప్రపంచవ్యాప్త అవగాహనను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 లో 72వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సందర్భంగా ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డేని స్థాపించింది.

ప్రపంచ వెదురు దినోత్సవం - సెప్టెంబర్ 18

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18 న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటారు. అత్యంత ఉపయోగకరమైన ఈ మొక్క పరిరక్షణ మరియు వెదురు పరిశ్రమపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అంతర్జాతీయ శాంతి దినోత్సవం - సెప్టెంబర్ 21

అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని అధికారికంగా వరల్డ్ పీస్ డే అని కూడా పిలుస్తారు. దీనిని ఏటా సెప్టెంబర్ 21న నిర్వహిస్తారు. దీనిని ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ తీర్మానం ద్వారా 1981లో ప్రారంభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో దీని నిర్వహిస్తుంది. ఈరోజున అంతర్జాతీయంగా అహింస మరియు కాల్పుల విరమణ అమలు చేయబడుతుంది.

ప్రపంచ అల్జీమర్స్ డే - సెప్టెంబర్ 21

ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. ఈరోజున అల్జీమర్స్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అల్జీమర్స్ వ్యాధి అనేది మెదడుకు సంబందించిన రుగ్మత, ఇది నెమ్మదిగా జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా నైపుణ్యాలను నాశనం చేస్తుంది.

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం: సెప్టెంబర్ 22

ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 న జరుపుకుంటారు. అంతరించిపోతున్న ఈ జాతి గురించి అవగహన కల్పించేందుకు మరియు సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

వరల్డ్ మారిటైమ్ డే - చివరి గురువారం

ప్రపంచ సముద్ర దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి గురువారం నాడు జరుపుకుంటారు. ఇండియాలో ఏప్రిల్ 5 న నేషనల్ మెరిటైమ్ డే (NMD)గా జరుపుకుంటారు. మారిటైమ్ డేస్ అనేది సముద్ర రంగంలో సాధించిన విజయాలను గుర్తించడానికి జరుపుకుంటారు.

ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవం - సెప్టెంబర్ 25

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించే ఫార్మసిస్ట్‌లను సత్కరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2009లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ (FIP) కౌన్సిల్ ద్వారా వరల్డ్ ఫార్మసిస్ట్ డేని రూపొందించారు

అంత్యోదయ దివాస్ - సెప్టెంబర్ 25

అంత్యోదయ దివస్ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25 న జరుపుకుంటారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహిస్తారు.

ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం - సెప్టెంబర్ 26

ప్రపంచ గర్భనిరోధక దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26 న జరుపుకుంటారు. 2007లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ద్వారా గర్భనిరోధకం గురించి అవగాహనను మెరుగుపరచడంతో పాటుగా యువతలో వారి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం - సెప్టెంబర్ 26

పర్యావరణ ఆరోగ్య కార్యకర్తలు చేసే కీలకమైన పని గురించి అవగాహన పెంచడానికి మరియు మన పర్యావరణ పరిరక్షణకు సహకరించేలా ప్రజలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26 న ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యావరణ ఆరోగ్యం అనేది వ్యక్తులు మరియు వారి పర్యావరణం మధ్య సంబంధాలపై దృష్టి సారిస్తుంది. ఇకపోతే జూన్ 5 ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు.

ప్రపంచ నదుల దినోత్సవం - 4వ ఆదివారం

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నాల్గవ ఆదివారం నాడు ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటాయి. నదుల ప్రాముఖ్యత మరియు వాతావరణ మార్పుల వల్ల నదులకు పెరుగుతున్న ముప్పు గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం - సెప్టెంబర్ 27

ప్రపంచ పర్యాటక దినోత్సవం 1980 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న నిర్వహించబడుతోంది. దీనిని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రారంభించింది. అధికారికంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 27న ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించబడుతాయి. ప్రపంచ పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తారు.

వరల్డ్ రేబీస్ డే - సెప్టెంబర్ 28

ప్రపంచ రాబిస్ డే (WRD) ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 న జరుపుకుంటారు. ఈరోజున గ్లోబల్ అలయన్స్ ఫర్ రేబీస్ కంట్రోల్ ద్వారా దాని పర్యవసానాల గురించి అవగాహన పెంచడానికి ప్రచారం చేయబడింది. దీనిని 2007 లో ప్రారంభించారు. లూయిస్ పాశ్చర్ మరణించిన వార్షికోత్సవ జ్ఞాపకార్థంగా దీనిని జరుపుకుంటారు.

రాబిస్ ఒక ప్రాణాంతకమైన, నివారించగల వైరల్ వ్యాధి. ఇది వైరస్ సోకిన జంతువుల లాలాజలం నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, అధిక లాలాజలం, కండరాల నొప్పులు, పక్షవాతం మరియు మానసిక గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయి.

ప్రపంచ హృదయ దినోత్సవం - సెప్టెంబర్ 29

ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 న జరుపుకుంటారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ద్వారా రూపొందించబడిన వరల్డ్ హార్ట్ డే ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గుండె జబ్బులపై అవగహన కల్పిస్తారు. గుండె జబ్బుల కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 18.6 మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు.

ఇంటర్నేషనల్ ట్రాన్సలేషన్ డే - సెప్టెంబర్ 30

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30 ని అంతర్జాతీయ అనువాద దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని 24 మే 2017న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ రోజున అనువాద నిపుణులను గుర్తించి సత్కరిస్తారు.

Post Comment