ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వత శిఖరాలు మరియు వాటి పేర్లు
Study Material

ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వత శిఖరాలు మరియు వాటి పేర్లు

ఇంటర్నేషనల్ మౌంటెనీరింగ్ అండ్ క్లైంబింగ్ ఫెడరేషన్ ప్రకారం 8వేల మీటర్ల పైన ఎత్తుతో ప్రపంచ వ్యాప్తంగా 14 పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ 14 శిఖరాలూ ప్రపంచ ఎత్తయిన టాప్ 2 పర్వత శ్రేణులైన  హిమాలయాలు మరియు కారకోరం శ్రేణులలోనే ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కేవలం 39 మంది పర్వత అధిరోహకులు మాత్రమే చేరుకున్నారు.

అలానే 7,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న అన్ని పర్వతాలు కూడా ఈ రెండు శ్రేణులోనే కనిపిస్తాయి. ఆసియా వెలుపల అర్జెంటీనా ఆండీస్‌లోని అకాన్‌కాగువా (6,962 మీ) పర్వతం మాత్రమే మొదటి ఎత్తైన శిఖరం.

8000 మీటర్ల పైన ఉన్న ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వత శిఖరాలు

పర్వతం ఎత్తు (మీటర్లలలో) దేశం/ప్రాంతం
ఎవరెస్ట్ 8,849 మీటర్లు నేపాల్ & చైనా
K2 పర్వతం 8,611 మీటర్లు పాకిస్తాన్ & చైనా
కాంచన్‌జంగా 8,586 మీటర్లు నేపాల్ & ఇండియా
లోట్సే శిఖరం 8,516 మీటర్లు నేపాల్ & చైనా
మకాలు శిఖరం 8,481 మీటర్లు నేపాల్ & చైనా
చో ఓయు శిఖరం 8,188 మీటర్లు నేపాల్ & చైనా
ధౌలగిరి I శిఖరం 8,167 మీటర్లు నేపాల్
మనస్లు శిఖరం 8,163 మీటర్లు నేపాల్
నంగా పర్బత్ 8,125 మీటర్లు పాకిస్తాన్
అన్నపూర్ణ I 8,091 మీటర్లు నేపాల్
గషెర్‌బ్రమ్ I (K5 / హిడెన్ పీక్) 8,080 మీటర్లు పాకిస్తాన్ & చైనా
బ్రాడ్ పీక్ 8,034 మీటర్లు పాకిస్తాన్ & చైనా
గాషెర్‌బ్రమ్ II (K4) 8,034 మీటర్లు పాకిస్తాన్ & చైనా
శిషాపంగ్మా (గోసైంతన్) 8,027 మీటర్లు చైనా

Post Comment