సెంట్రల్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్
Scholarships

సెంట్రల్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్

స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్ పథకం ద్వారా ఇంటర్మీడియటులో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది, యూజీ మరియు పీజీ చదివే నిరుపేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఏటా 10 వేల నుండి 20 వేల వరకు స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ స్కీమ్ కింద జనరల్ డిగ్రీ, పీజీ కోర్సులతో పాటుగా ప్రొఫిషినల్ మరియు ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ వంటి కోర్సులకు స్కాలర్షిప్ అందిస్తుంది.

Advertisement
స్కాలర్షిప్ పేరు స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ & యూనివర్సిటీ స్టూడెంట్స్
ఎవరు అర్హులు 80 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
దరఖాస్తు ముగింపు తేదీ 15-04-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 22-04-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 22-04-2022

కాలేజ్ & యూనివర్సిటీ విద్యార్థులకు అందించే ఈ స్కాలర్షిప్, భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ & ఉన్నత విద్యా శాఖ ద్వారా ఇవ్వబడుతుంది. దీని పరిధిలో ఏడాదికి గరిష్టంగా 82,000 మంది ప్రతిభావంతులకు ఫైనాన్సియల్ అసిస్టెన్స్ అందిస్తుంది. ఇందులో 50:50 లెక్కన 41000 స్కాలర్షిప్స్ పురుషులకు, 41,000 స్కాలర్షిప్స్ మహిళలకు అందిస్తుంది.

ఈ స్కాలర్షిప్'ను రాష్ట్రాల వారి కేటాయించిన కోటా ఆధారంగా అందిస్తారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ నుండి 3527 మందికి, తెలంగాణ నుండి 2570 మంది విద్యార్థుల వరకు దీన్ని అందిస్తారు. దీనికి అదనంగా జాతీయ స్థాయిలో అందించే CBSE (5413), ICSE (571) కోటా ద్వారా మరికొంత మందికి అందిస్తారు. ఈ పరిమిత కోటా కేటాయింపు రాష్ట్ర జనాభాలో 18 నుండి 25 ఏళ్ళ మధ్య ఉండే యువత సంఖ్యా ఆధారంగా కేటాయిస్తారు.

Courses Rate Of Scholarship
Graduation level 10,000/-
PostGraduation level 20,000/-
B.Tech., B.Engg 20,000/-

ఎలిజిబిలిటీ

విద్యార్థులు 10+2 (ఇంటర్) ఫార్మాటులో 80 శాతం మార్కులతో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసి ఉండాలి. విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదు. విద్యార్థి 75 % అకాడమిక్ హాజరు నమోదు చేయాలి. పై అర్హుతలు ఉండే విద్యార్థులు దరఖాస్తు చేసే ముందు బ్యాంకు అకౌంట్, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువపత్రం, అకాడమిక్ సర్టిఫికెట్లు, ఫోటో, ఆధార్ కార్డు వంటివి అందుబాటులో ఉంచుకోండి.

 ఎలా దరఖాస్తు చేయాలి

అర్హుత ఉండే విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుండి ఆన్‌లైన్ పద్దతిలో అవసరమయ్యే అన్ని ధ్రువపత్రాలు అందిస్తూ ఓపెన్ దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా తేలినవారిని, రాష్ట్రాల వారీగా, సామజిక రిజర్వేషన్ల ఆధారంగా మరియు విద్యార్థి అకాడమిక్ మెరిట్ ఆధారంగా విభజించి, తుది అర్హుల జాబితాకు స్కాలర్షిప్ అందిస్తారు. ఈ స్కాలర్షిప్ గరిష్టంగా ఐదేళ్లు (3+2) వరకు మాత్రమే అమలుచేసారు. విద్యార్థి ఏటా దీన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు రెన్యువల్ అవ్వాలంటే కనీసం 70 శాతం మార్కులతో మునపటి వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత పొంది, కనీసం 75 శాతం హాజరు నమోదుచేయాలి.

సామజిక కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ 27 %
షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ ) 15%
షెడ్యూల్డ్ ట్రైబల్ (ఎస్టీ) 7.5%
డిజాబిలిటీ 5%
ఉమెన్ కోటా 50% (మొత్తం స్కాలర్షిప్ లలో)

Advertisement

One Comment

Post Comment