బ్యాంకు ఆఫ్ బరోడా స్టూడెంట్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. బ్యాంకు ఆఫ్ బరోడా అతి తక్కువ వడ్డీ రేట్లతో కేజీ నుండి పీజీ వరకు అన్ని రకాల కోర్సులకు విద్యా రుణాలు అందిస్తుంది. 4 లక్షల లోపు రుణాలకు ఎటువంటి అదనపు రుసుములు లేకుండా, ఎటువంటి పూచీకత్తు లేకుండా విద్యా రుణాన్ని మంజూరు చేస్తుంది.
కోర్సు పూర్తియిన తర్వాత 6 నుండి 12 నెలల హాలిడే పిరియడ్ తో పాటుగా, రుణ విలువ ఆధారంగా 3 నుండి 15 ఏళ్ళ నిడివితో తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తుంది. బ్యాంకు ఆఫ్ బరోడా అందించే వివిధ విద్యా రుణాల గురించి ఇప్పుడు చూద్దాం.
1. బరోడా విద్య - ఎడ్యుకేషన్ లోన్ (Education from Nursery to XII)
నర్సరీ నుండి ఇంటర్మీడియట్ చదివే పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఈ పథకం ద్వారా రుణం మంజూరు చేస్తారు
Loan Amount | 5 వేల నుండి గరిష్టంగా 4 లక్షల వరకు |
Courses Covered | Nursery to XII |
Expenses Covered |
|
Interest Rate | BRLLR + SP + 2.85% (0.50% Concession for girl students) |
Processing Charges | No processing & documentation charges. |
Margin | No Margin. |
Security | No security required. |
Repayment | లోను మంజూరు చేసిన రోజు నుండి 12 నెలలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. |
2. బరోడా జ్ఞాన్ - ఎడ్యుకేషన్ లోన్ (Higher Study in India)
ఇండియాలో చదువుకునే ప్రతిభావంతులైన దేశీయ విద్యార్థులకు రుణం అందిస్తారు.
Loan Amount | Need based finance. 5 వేల కనీస మొత్తం నుండి గరిష్టంగా 80 లక్షల వరకు మంజూరు చేస్తారు. |
Courses Covered | UGC/ Govt. / AICTE/ AIBMS/ ICMR వంటి గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో యూజీ, పీజీ మరియు పీజీ డిప్లొమా కోర్సులు. అలానే ICWA, CA, CFA కోర్సులు. IIMs, IITs, IISc, XLRI. NIFT, NID నిర్వహించే కోర్సులు. అలానే Aeronautical, pilot training, shipping Nursing కోర్సులు. |
Expenses Covered |
|
Interest Rate | BRLLR + 2.00% (0.50% Concession for girl students) |
Processing Charges | No processing charges. |
Margin | 4 లక్షల లోపు రుణాలకు ఎటువంటి మార్జిన్ ఉండదు. 4 లక్షలు దాటినా రుణాలకు 5% మార్జిన్ ఉంటుంది. అంటే కోర్సు యొక్క 5% ఫీజు రుసుము విద్యార్థి సొంతంగా భరించాల్సి ఉంటుంది. |
Security | 4 లక్షల లోపు రుణాలకు విద్యార్థి ఉంటె సరిపోతుంది. 4 నుండి 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రుల హామీతో అందిస్తారు. 7.5 లక్షలకు మించే రుణాలకు స్పష్టమైన పూచీకత్తులు సమర్పించాలి. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 (7.5 లక్షల లోపు) నుండి 15 (7.5 లక్షలు దాటి) ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
3. బరోడా స్కాలర్ - ఎడ్యుకేషన్ లోన్ (for study abroad)
విదేశాలలో యూజీ మరియు పీజీ కోర్సులలో చేరే విద్యార్థులకు ఈ పథకం ద్వారా రుణం మంజూరు చేస్తారు.
Loan Amount | Need based financ. లక్ష రూపాయల నుండి 80 లక్షల వరకు. ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ జాబితాలో ఉండే యూనివర్సిటీ విద్యార్థులకు గరిష్టంగా 80 లక్షల వరకు, ఆ జాబితాలో లేని యూనివర్సిటీ విద్యార్థులకు గరిష్టంగా 60 లక్షల వరకు విద్యా రుణం మంజూరు చేస్తారు. Premier Institutions List |
Courses Covered |
|
Expenses Covered |
|
Interest Rate | BRLLR + 2.10% (0.50% Concession for girl students) |
Processing Charges | రుణ మొత్తంలో 1% (గరిష్టంగా ₹ 10,000 / -). ఇది రిఫండబుల్. |
Margin | Up to RS.4.00 lakh: NIL & Above RS.4.00 lakh:10% |
Security | 4 లక్షల లోపు రుణాలకు విద్యార్థి హామీ ఉంటె సరిపోతుంది. 4 నుండి 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రుల హామీతో అందిస్తారు. 7.5 లక్షలకు మించే రుణాలకు స్పష్టమైన పూచీకత్తులు సమర్పించాలి |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 (7.5 లక్షల లోపు) నుండి 15 (7.5 లక్షలు దాటి) ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
4. ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ల విద్యార్థుల కోసం బరోడా ఎడ్యుకేషన్ లోన్
ఇండియన్ ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లలో (AA, A, B, Cకేటగిరి) చదివే విద్యార్థులకు ఈ లోను మంజూరు చేస్తారు.
Loan Amount | Need based finance. 4 లక్షల కనీస మొత్తం నుండి గరిష్టంగా 80 లక్షల వరకు మంజూరు చేస్తారు. Premier Institution list |
Courses Covered | పైన ఉన్న ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ల అందించే అన్ని రకాల కోర్సులకు |
Expenses Covered |
|
Interest Rate | BRLLR + 2.00% (0.50% Concession for girl students) |
Processing Charges | No processing charges. |
Margin | Nill |
Security | కేటగిరి AA ఇనిస్టిట్యూట్లలో చదివే విద్యార్థులు 40 లక్షల వరకు, కేటగిరి A ఇనిస్టిట్యూట్లలో చదివే విద్యార్థులు 20 లక్షల వరకు, కేటగిరి B & C ఇనిస్టిట్యూట్లలో చదివే విద్యార్థులు 7.5 లక్షల వరకు ఏవంటి పూచీకత్తులు సమర్పించాల్సినవాసం లేదు. అంతకు మించి తీసుకునే రుణాలకు పూర్తిస్థాయి హామీని అందించాల్సి ఉంటుంది. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 (7.5 లక్షల లోపు) నుండి 15 (7.5 లక్షలు దాటి) ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది. |
4. బరోడా స్కిల్ లోన్ స్కీమ్
This loan is given for students pursuing technical courses offered by training institutes, polytechnics etc.
Loan Amount | 5,000 /- నుండి గరిష్టంగా 1,50,000 /- వరకు అందిస్తారు. |
Courses Covered | ఐటీఐ, పాలిటెక్నిక్ మరియు ఇతర నైపుణ్య అభివృద్ధి కోర్సులు. |
Expenses Covered |
|
Interest Rate | BRLLR + 1.50% |
Processing Charges | NIL |
Margin | NIL |
Security | విద్యార్థి హామీ ఉంటె సరిపోతుంది. |
Repayment | రీపెమెంట్, కోర్సు పూర్తయినా 6 లేదా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ తీసుకున్న ఋణం ఆధారంగా మూడు నుండి ఏడేళ్ల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. |
బరోడా ఎడ్యుకేషన్ లోన్ కోసం జత చేయాల్సిన ధ్రువపత్రాలు
- చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
- మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
- ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
- చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్ ఫోటోలు.
- విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
- నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటివి జత చేయాలి.
- విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
బరోడా ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు ప్రక్రియ
బ్యాంకు ఆఫ్ బరోడా ప్రస్తుతం విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.
రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే స్టేట్ బ్యాంకు ఆఫ్ బరోడా బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బరోడా బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.