Advertisement
సీమ్యాట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా
Admissions MBA Entrance Exams NTA Exams

సీమ్యాట్ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా

సీమ్యాట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. జాతీయ స్థాయిలో ఎంబీఏ అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహించే ఈ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 13 నుండి 06 మార్చి 2023 తేదీల మధ్య నిర్వహిస్తున్నారు. పరీక్ష తేదీని రాబోయో రోజులలో నిర్ణయించనున్నారు.

సీమ్యాట్ అనగా కామన్ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్ టెస్ట్ అని అర్ధం. సీమ్యాట్ పరీక్షను పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా ఒకే మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో 2019 నుండి భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

సీమ్యాట్ స్కోరు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసీటీఈ) అనుమతి పొందిన దాదాపు 1000 పైగా గొప్ప మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్లల్లో ప్రవేశాలు పొందేందుకు ఉపయోగ పడుతుంది.

సీమ్యాట్ 2023

Exam Name CMAT 2023
Exam Type Entrance Exam
Admission For Management Courses
Exam Date NA
Exam Duration 3 Hours
Exam Level National Level

సీమ్యాట్ సమాచారం

సీమ్యాట్ ఎలిజిబిలిటీ

  • దరఖాస్తుదారుడు భారత పౌరుడు అయి ఉండాలి
  • అడ్మిషన్ పొందే సమయానికి ఏదైనా ఒక కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  • CMAT రాసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు

సీమ్యాట్ 2023 ముఖ్యమైన తేదీలు

సీమ్యాట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 13 ఫిబ్రవరి 2023
సీమ్యాట్ రిజిస్ట్రేషన్ గడువు 06 మార్చి 2023
పరీక్ష కేంద్రం ఎంపిక NA
సీమ్యాట్ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ NA
సీమ్యాట్ పరీక్ష తేదీ NA
సీమ్యాట్ ఫలితాలు NA
సీమ్యాట్ కౌన్సిలింగ్ NA

సీమ్యాట్ దరఖాస్తు ఫీజు

సీమ్యాట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

జనరల్ పురుషులు 2000/- మహిళలు 1000/-
నాన్ క్రీమి లేయర్ (ఓబీసీ) పురుషులు 1000/- మహిళలు 1000/-
ఎస్సీ, ఎస్టీలు పురుషులు 1000/- మహిళలు 1000/-
ట్రాన్స్ జండర్లు 1000/-

సీమ్యాట్ 2023 రిజిస్ట్రేషన్

సీమ్యాట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. సీమ్యాట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రెండు దశలలో ఉంటుంది. మొదటి దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. రెండవ దశలో పరీక్షకు సంబంధించి వివరాలు, ఎంపికలు నమోదు చేయాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తులో సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

సీమ్యాట్ ఎగ్జామ్ సెంటర్లు

  • ఆంధ్రప్రదేశ్ : గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మరియు విశాఖపట్నం.
  • తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

సీమ్యాట్ 2023 ఎగ్జామ్ నమూనా

సీమ్యాట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (సీబీటి) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో మొత్తం ఐదు విభాగాల నుండి 20 చెప్పున 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు వేరువేరు సమాదానాలు ఉంటాయి.

వీటిలో నుండి ఒక సరైన సమాధానంను గుర్తించాలి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 ఋణాత్మక మార్కు ఇవ్వబడుతుంది. మొత్తం 400 మార్కులకు జరిగే ఈ ప్రవేశ పరీక్ష లో అభ్యర్థి సాధించిన స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

సిలబస్ ప్రశ్నల సంఖ్య మొత్తం మార్కులు
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ & డేటా ఇంటర్ప్రెటేషన్ 20 ప్రశ్నలు 100 మార్కులు
లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు 100 మార్కులు
లాంగ్వేజ్ కంప్రెహెన్షన్ 20 ప్రశ్నలు 100 మార్కులు
జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 100 మార్కులు
ఇన్నోవేషన్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ 20 ప్రశ్నలు 100 మార్కులు
మొత్తం 100 మొత్తం 400
ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి

సీమ్యాట్ అడ్మిషన్ ప్రక్రియ

సీమ్యాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేసి ఆల్ ఇండియా వారీగా ర్యాంకులు విడుదల చేస్తారు. అడ్మిషన్ సమయంలో కేటగిరి వారి రిజర్వేషన్ వాటా ప్రకారం సీట్లు భర్తీచేస్తారు. 15% ఆల్ ఇండియా కోటా కింద కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిసే కాలేజీల్లో సీట్ల శాతం కింది విదంగా ఉంటుంది.

  • ఎస్సీ లకు 15 శాతం సీట్లు
  • ఎస్టీ లకు 7.5 శాతం సీట్లు
  • ఓబీసీ లకు 27 శాతం సీట్లు
  • వికలాంగుల కోటాలో 5 శాతం సీట్లు

ఇతర డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు లలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) నియమాల అనుసారం కేటగిర్ల వారీగా, ఇనిస్టిట్యూట్ల వారీగా, ప్రాంతీయత ఆదరంగా సీట్లు భర్తీచేస్తారు.

Post Comment