భారతదేశంలో రాజకీయ పార్టీలు | జనరల్ నాలెడ్జ్
Study Material

భారతదేశంలో రాజకీయ పార్టీలు | జనరల్ నాలెడ్జ్

భారతదేశంలో బహుళ-పార్టీ వ్యవస్థ ఉంది. భారత ఎన్నికల సంఘం జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా గుర్తింపునిస్తుంది. భారత ఎన్నికల సంఘం 2021 నాటి నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 8 జాతీయ పార్టీలు, 54 రాష్ట్ర పార్టీలు మరియు 2796 గుర్తింపు లేని పార్టీలతో కలిపి మొత్తం 2858 పార్టీలు నమోదై ఉన్నాయి.

Advertisement

ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీగా మారాలంటే కనీసం మూడు వేర్వేరు రాష్ట్రాల నుండి 2% లోక్‌సభ సీట్లు సాధించి ఉండాలి. అలానే లోక్‌సభ లేదా శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికలలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లను పొంది ఉండాలి. అదే సమయంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు కలిగి ఉండాలి.

ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర పార్టీగా మారాలంటే, రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను సాధించాలి మరియు ఆ రాష్ట్ర అసెంబ్లీలో కనీసం 2 సీట్లు గెలుచుకోవాలి. అదే సమయంలో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను పొందాలి మరియు లోక్‌సభలో కనీసం 1 సీటు గెలుచుకోవాలి.

భారతదేశంలో జాతీయ రాజకీయ పార్టీలు

భారత ఎన్నికల సంఘం మొత్తం 8 రాజకీయ పార్టీలకు జాతీయ హోదా కల్పించింది. ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ (INC), భారతీయ జనతా పార్టీ (BJP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI -M), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లు ఉన్నాయి.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)

Indian_National_Congress_hand_logoభారత జాతీయ కాంగ్రెస్ దేశంలో ఉన్న అతి పురాతనమైన రాజకీయపార్టీ. ఈపార్టీని బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అధికారి అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ 1885లో స్థాపించారు. 1920 తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. భారత స్వాతంత్రం తర్వాత 1951 లో జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 17 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఏడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 54 సంవత్సరాలకు పైగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం ఏడుగురు ప్రధానమంత్రులు ప్రమాణస్వీకారం చేసారు.

  1. జవహర్‌లాల్ నెహ్రూ (1947-1964)
  2. గుల్జారీలాల్ నందా (1964 - 1964)
  3. లాల్ బహదూర్ శాస్త్రి (1964–1966)
  4. ఇందిరా గాంధీ (1966–1977)
  5. రాజీవ్ గాంధీ (1984–1989)
  6. పి.వి.నరసింహారావు(1991–1996)
  7. మన్మోహన్ సింగ్ (2004-2014)

2004 లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) పేరుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తదనంతరం 2009 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. 1962లో నెహ్రూ తర్వాత పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నిలిచారు.

  • పొలిటికల్ ఐడియాలాజీ : సోషలిజం, లౌకికవాదం (సెక్యులరిజం), సివిల్ లిబరేషన్ & సోషల్ లిబరేషన్
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • విద్యార్థి విభాగం : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI)

భారతీయ జనతా పార్టీ (BJP)

Bjpభారతీయ జనతా పార్టీని 1980 లో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీలు స్థాపించారు. బీజేపీ సాంప్రదాయ హిందూ జాతీయవాద భావజాలంతో ఏర్పాటు చేయబడింది. బీజేపీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కి దగ్గరి సైద్ధాంతిక మరియు సంస్థాగత సంబంధాలను కలిగి ఉంది.

1996లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో పార్లమెంటులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. దిగువ సభలో మెజారిటీ లేకపోవడంతో కేవలం 13 రోజుల్లో ప్రభుత్వం కోల్పోయింది. బీజేపీ నుండి ఇద్దరు ప్రధాని మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు.

  1. అటల్ బిహారీ వాజ్‌పేయి (1998 - 2004)
  2. నరేంద్ర మోదీ (2014 - ప్రస్తుతం)
  • పొలిటికల్ ఐడియాలాజీ : హిందూ జాతీయవాదం, సామ్యవాదం, లౌకికవాదం, సమగ్ర మానవతావాదం
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • విద్యార్థి విభాగం : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)

బహుజన్ సమాజ్ పార్టీ (BSP)

Bahujan_Samaj_Partyబహుజన్ సమాజ్ పార్టీ, అంబేద్కర్ భావజాలంతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు నేతృత్వం వహించేందుకు ఏర్పాటు చేయబడింది. బహుజన్ సమాజ్ పార్టీ ని 1986 లో కాన్షీరామ్ ఏర్పాటు చేసారు. కాన్షీరామ్ ప్రకారం 1984లో పార్టీని స్థాపించినప్పుడు దేశంలో 85 శాతం బహుజనులు ఉన్నారు. ఈ జనాభా దాదాపు 6,000 విభిన్న కులాలుగా విభజించబడి ఉన్నారు.

2001 నుండి ఈ పార్టీ మాయావతి నేతృత్వంలో నడుస్తుంది. ఈమె నాయకత్వంలో బీఎస్పీ 2019 జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో 19.3% ఓట్లతో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. మే 2007 ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఎస్పీ ఏకైక మెజారిటీ పార్టీగా అవతరించింది.

  • పొలిటికల్ ఐడియాలాజీ : బహుజన్ సమాజ్, సోషల్ ట్రాన్సఫార్మాషన్, అంబేద్కర్ సైద్ధాంతిక భావజాలం
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)

CPIకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలోని రెండవ పురాతన రాజకీయ పార్టీ. సిపిఐ 26 డిసెంబర్ 1925న కాన్పూర్‌లో జరిగిన మొదటి పార్టీ కాన్ఫరెన్స్‌లో స్థాపించబడింది. 1952లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలో ఉండగా, సీపీఐ లోక్‌సభలో మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా స్థానం దక్కించుకుంది. 1964 లో సైద్ధాంతిక విభేదాల కారణంగా సిపిఐ మరియు సిపిఐ (ఏం) పేర్లతో రెండు వేర్వేరు పార్టీలుగా విభజించబడింది.

  • పొలిటికల్ ఐడియాలాజీ : కమ్యూనిజం
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • విద్యార్థి విభాగం : ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF)

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

Cpmకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (సీపీఎం) దేశంలోని అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది. ఈ పార్టీ 1964 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) చీలిక నుండి ఉద్భవించింది. 2022 నాటికి సిపిఎం మూడు రాష్ట్రాలలో పాలక కూటమిలలో ఒక భాగంగా ఉంది.

  • పొలిటికల్ ఐడియాలాజీ : కమ్యూనిజం
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • విద్యార్థి విభాగం : స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)
  • కార్మిక విభాగం : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU)

ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AICT)

Tmcఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 1998 లో భారతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఉద్బవించింది. ఈ పార్టీని మమతా బెనర్జీ నేతృత్వంలో ఏర్పడింది. మమతా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 2011 నుండి పశ్చిమ బెంగాల్ యందు అధికారంలో ఉంది. మమతా బెనర్జీ వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.

  • పొలిటికల్ ఐడియాలాజీ : జాతీయవాదం, పాపులిజం, ప్రోగ్రెసివిజం, లౌకికవాదం, యాంటీ కమ్యూనిజం
  • ప్రధాన కార్యాలయం : కోల్‌కతా
  • విద్యార్థి విభాగం : ఆల్ ఇండియా తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP)

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)

NCPనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరాఠీ జాతీయవాదం మరియు గాంధీ లౌకికవాద భావజాలంతో ఏర్పడింది. ఈ పార్టీ కూడా భారతీయ కాంగ్రెస్ పార్టీ నుండి 1999 లో ఉద్బవించింది. దీనిని శరద్ పవార్, పీఏ సంగ్మా. తారిఖ్ అన్వర్లు స్థాపించారు. సోనియా గాంధీ నాయకత్వంపై వ్యతిరేకతతో ఏర్పడిన ఎన్సీపీ అదే పార్టీతో 1999లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సమయంలో  2004లో ఏర్పడ్డ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్ ఐదేళ్లపాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

  • పొలిటికల్ ఐడియాలాజీ : మరాఠీ జాతీయవాదం, గాంధీ లౌకికవాదం
  • ప్రధాన కార్యాలయం : న్యూఢిల్లీ
  • విద్యార్థి విభాగం : నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ (NSC)

నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)

NPP_Flagనేషనల్ పీపుల్స్ పార్టీ గిరిజన కేంద్రీకృత దృక్పధంతో 2013 లో స్థాపించబడింది. ఈ పార్టీని ఎన్సీపీ నుండి బహిష్కరించబడిన తర్వాత అస్సాం కేంద్రంగా పూర్ణో అగితోక్ సంగ్మా ప్రారంభించారు. ఈ పార్టీకి 2019 లో జాతీయ హోదా లభించింది. ఈ పార్టీ ఈశాన్య భారత్ యందు తగినంత ఓటు బ్యాంకును కలిగి ఉంది.

  • పొలిటికల్ ఐడియాలాజీ : ప్రాంతీయవాదం, ఎథ్నోసెంట్రిజం
  • ప్రధాన కార్యాలయం : షిల్లాంగ్, మేఘాలయ
  • విద్యార్థి విభాగం : నేషనల్ పీపుల్స్ స్టూడెంట్స్ యూనియన్ (NPSU)

ప్రాంతీయ రాజకీయ పార్టీలు

భారత ఎన్నికల సంఘం మొత్తం 54 రాజకీయ పార్టీలకు ప్రాంతీయ హోదా కల్పించింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్, తెలుగు దేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, జార్ఖండ్ ముక్తి మోర్చా, వైఎస్ఆర్ కాంగ్రెస్, డీఎంకే వంటి పాపులర్ పార్టీలు ఉన్నాయి.

పార్టీ పేరు పార్టీ ఐడియాలజీ రాష్ట్రం & నాయకుడు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) - 2012 ఆర్థిక జాతీయవాదం, మానవతావాదం, లౌకికవాదం, దేశభక్తి రాష్ట్రం : ఢిల్లీ, పంజాబ్, గోవా
లీడర్ : అరవింద్ కేజ్రీవాల్
జనతాదళ్ (సెక్యులర్) (జేడీఎస్) - 1999 సామాజిక ప్రజాస్వామ్యం, సెక్యులరిజం రాష్ట్రం : కర్ణాటక
లీడర్ : హెచ్‌డి దేవెగౌడ
జనతా దళ్ (యునైటెడ్) (జేడీయూ) - 2003 సోషలిజం, సెక్యులరిజం, సమగ్ర మానవతావాదం రాష్ట్రం : బీహార్
లీడర్ : నితీష్ కుమార్
ఏఐఏడీఎంకే - 1972 ద్రావిడవాదం, పాపులిజం, సామాజిక ప్రజాస్వామ్యం రాష్ట్రం : తమిళనాడు
లీడర్ : ఎకె. పళనిస్వామి
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) -1949 సామాజిక ప్రజాస్వామ్యం, ద్రావిడవాదం, సామాజిక న్యాయం, ఫెడరలిజం రాష్ట్రం : తమిళనాడు
లీడర్ : ఎకె. పళనిస్వామి
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) - 1997 సోషలిజం రాష్ట్రం : బీహార్
లీడర్ : తేజస్వి యాదవ్
తెలుగు దేశం పార్టీ (టీడీపీ) - 1982 పాపులిజం, ఆర్థిక ఉదారవాదం రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ
లీడర్ : చంద్రబాబు నాయుడు
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) - 2011 పాపులిజం, ప్రాంతీయవాదం రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
లీడర్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) -2001 ప్రాంతీయవాదం, పాపులిజం, సంప్రదాయవాదం, వేర్పాటువాదం రాష్ట్రం : తెలంగాణ
లీడర్ : కె. చంద్రశేఖర రావు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) - 1958 మిశ్రమ జాతీయవాదం, మైనారిటీ హక్కులు, దళితుల హక్కులు, రాజ్యాంగవాదం రాష్ట్రం : తెలంగాణ
లీడర్ : అసదుద్దీన్ ఒవైసీ
ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) - 2011 సామాజిక ప్రజాస్వామ్యం, పాపులిజం రాష్ట్రం : పుదుచ్చేరి
లీడర్ : ఎన్. రంగస్వామి
బిజు జనతా దళ్ (బీజేడీ) - 1997 ప్రాంతీయవాదం, పాపులిజం, సెక్యులరిజం, ఉదారవాదం రాష్ట్రం : ఒడిశా
లీడర్ : నవీన్ పట్నాయక్
నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ప్రాంతీయవాదం రాష్ట్రం : మణిపూర్, నాగాలాండ్
లీడర్ : టీఆర్ జెలియాంగ్
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) - 2005 సెక్యులరిజం, ప్రాంతీయవాదం రాష్ట్రం : అస్సాం
లీడర్ : బద్రుద్దీన్ అజ్మల్
అసోం గణ పరిషద్ (ఏజిపి) - 1985 ప్రాంతీయవాదం, బెంగాలీ వ్యతిరేక భావన రాష్ట్రం : అస్సాం
లీడర్ : అతుల్ బోరా
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) - 1948 ముస్లిం రీజనల్, సామాజిక సంప్రదాయవాదం రాష్ట్రం : కేరళ
లీడర్ : హైదరాలీ షిహాబ్ తంగల్
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) - 1932 కాశ్మీరియత్, కాశ్మీరీ స్వయంప్రతిపత్తి, సెక్యులరిజం రాష్ట్రం : జమ్మూ & కాశ్మీర్
లీడర్ : ఫరూక్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (JKPDP) - 1999 కాశ్మీరియత్, కాశ్మీరీ స్వయంప్రతిపత్తి, ప్రాంతీయవాదం రాష్ట్రం : జమ్మూ & కాశ్మీర్
లీడర్ : మెహబూబా ముఫ్తీ
శివసేన (SS) -1966 సంప్రదాయవాదం, హిందుత్వ అల్ట్రానేషనలిజం, రైట్-వింగ్ పాపులిజం రాష్ట్రం : మహారాష్ట్ర
లీడర్ : ఉద్ధవ్ ఠాక్రే
శిరోమణి అకాలీ దళ్ -1920 పంజాబియాత్, సంప్రదాయవాదం, ఫెడరలిజం రాష్ట్రం : పంజాబ్
లీడర్ : సుఖ్బీర్ సింగ్ బాదల్
సమాజ్ వాదీ పార్టీ (SP) - 1992 సామాజిక ప్రజాస్వామ్యం , ప్రజాస్వామ్య సామ్యవాదం, వామపక్ష పాపులిజం రాష్ట్రం : ఉత్తర ప్రదేశ్
లీడర్ : అఖిలేష్ యాదవ్
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) - 1993 ప్రజాస్వామ్య సోషలిజం రాష్ట్రం : సిక్కిం
లీడర్ : పవన్ కుమార్ చామ్లింగ్
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) - 2013 ప్రజాస్వామ్య సోషలిజం రాష్ట్రం : సిక్కిం
లీడర్ : ప్రేమ్ సింగ్ తమాంగ్
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) - 1972 ప్రాంతీయవాదం రాష్ట్రం : జార్ఖండ్
లీడర్ : శిబు సోరెన్ హేమంత్ సోరెన్
మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) - 1961 ప్రాంతీయవాదం రాష్ట్రం : మిజోరాం
లీడర్ : జోరంతంగా
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) - 2017 ప్రాంతీయవాదం రాష్ట్రం : నాగాలాండ్
లీడర్ : నీఫియు రియో
రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) - 1966 ప్రాంతీయవాదం రాష్ట్రం : ఉత్తర ప్రదేశ్
లీడర్ : జయంత్ చౌదరి
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పా (RLP) - 2020 ప్రాంతీయవాదం రాష్ట్రం : రాజస్థాన్
లీడర్ : హనుమాన్ బెనివాల్
యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL) -1997 ప్రాంతీయవాదం రాష్ట్రం : అస్సాం
లీడర్ : ఉర్ఖావో గ్వారా బ్రహ్మ

Advertisement

Post Comment