Advertisement
సీఎస్ఐఆర్ నెట్ డిసెంబర్ 2023 : ఎగ్జామ్ డేట్, రిజిస్ట్రేషన్ , ఎగ్జామ్ నమూనా
Admissions Research Entrance Exams

సీఎస్ఐఆర్ నెట్ డిసెంబర్ 2023 : ఎగ్జామ్ డేట్, రిజిస్ట్రేషన్ , ఎగ్జామ్ నమూనా

సీఎస్ఐఆర్ నెట్ డిసెంబర్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఇది భారతీయ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ప్రోగ్రాంలో లేదా లెక్చరేషిప్(ఎల్ఎస్ఎఫ్)/ అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ అందించే అర్హుత పరీక్ష. దేశంలో ఒకానొక క్లిష్టమైన పరీక్షగా భావించే ఈ జాతీయ అర్హుత పరీక్షను ఏటా జూన్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు.

సీఎస్ఐఆర్ నెట్ 2023

Exam Name CSIR NET 2023 (Dec)
Exam Type Eligibility Test
Eligibility For JRF/LS/APS
Exam Date 26,27,28 Dec 2023
Exam Duration 3 Hours
Exam Level National Level

ఈ ప్రతిష్టాత్మకమైన అర్హుత పరీక్షలో సైన్స్ విద్యార్థులు విజయం సాధిస్తే, వారి కెరీర్ ఉజ్వలభరితమయ్యే అవకాశం ఉన్నందున, ఈ పరీక్షను భారతీయ సైన్స్ విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. సీఎస్ఐఆర్ మరియు యూజీసీ ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జేఆర్ఎఫ్ ప్రోగ్రాంలలో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది.

సీఎస్ఐఆర్ నెట్ యందు టాప్ మెరిట్ సాధించిన విద్యార్థులకు అనుభవిజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తల మార్గదర్శికంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లు, ఐఐటీలు, జాతీయ ప్రయోగశాలలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఫార్మా కంపెనీల యందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రాం కింద ఆయా సైన్స్ డిపార్టుమెంటులలో పనిచేసే అవకాశం లభిస్తుంది.

లెక్చరేషిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్‌కి అర్హుత సాధించిన వారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇనిస్టిట్యూట్లు, పీజీ కాలేజీలు లలో లెక్చరరుగా లేదా ప్రొఫిసర్లుగా జాయిన్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల ఉద్యోగ భర్తీ ప్రక్రియ ద్వారా కొలువులు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఎల్ఎస్/ఏపీఎస్ కాలపరిమితి జీవితకాలం ఉంటుంది.

సీఎస్ఐఆర్ నెట్ 2023 వివరాలు

సీఎస్ఐఆర్ నెట్ : జేఆర్ఎఫ్ స్టైపెండ్ వివరాలు

సీఎస్ఐఆర్ నెట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హుత సాధించిన అభ్యర్థులకు రెండేళ్ల వరకు ప్రతి నెల 37,000 ల వరకు స్టైపెండ్ లభిస్తుంది. అభ్యర్థులు అదనపు ప్రతిభ కనపరిస్తే సీఎస్ఐఆర్ మరియు యూజీసీ అనుమతితో ఏడాదిలో ఇంకో ఇరవై వేలు అదనంగా పొందొచ్చు. జేఆర్ఎఫ్ ఎంపికయిన తర్వాత రెండేళ్లలోపు పీహెచ్డీ కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జూనియర్ ఫెలోషిప్ లో ఉన్నత ప్రతిభ చూపిన వారికీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎస్ఆర్ఎఫ్) కి అర్హుత కల్పిస్తారు. సీనియర్ ఫెలోషిప్ కాలవ్యవధి మూడేళ్లు ఉంటుంది. ఈ మూడేళ్లు ప్రతి నెల 42,000 వరకు స్టైపెండ్ అందిస్తారు. అవసరమైతే ఇంకో రెండేళ్లు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.

సీఎస్ఐఆర్ నెట్ ఎలిజిబిలిటీ

  • 55 శాతం మార్కులతో మాస్టర్ అఫ్ సైన్స్ (M.Sc)/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా నాలుగేళ్ళ బ్యాచిలర్ సైన్స్ డిగ్రీలు అయిన బీఈ, బీటెక్, బీఫార్మా, ఎంబీబీస్ లలో ఉత్తీర్ణత అయిన వారు అర్హులు. రిజర్వేషన్ కేటగిర్లకు చెందిన అభ్యర్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది.
  • 55 శాతం మార్కులతో బీఎస్సీ (Hons) లేదా దానికి సమానమైన డిగ్రీలు కలిగినవారు మరియు ఏంఎస్-పీహెచ్డీ ప్రోగ్రామ్స్ లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు కూడా అర్హులు.
  • బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు JRF ఎలిజిబిలిటీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ అర్హుత సాధిస్తే రెండేళ్లు లోపు పీహెచ్డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • పీజీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వేళా వీరు ఈ పరీక్షలో ఎలిజిబిలిటీ సాధిస్తే వారికీ పీజీ పూర్తిచేశాక మాత్రమే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
  • జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం పోటీపడే అభ్యర్థుల వయసు 1 డిసెంబర్ 2023 నాటికీ 28 ఏళ్ళు  మించకూడదు.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ట్రాన్స్జండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ మహిళా అభ్యర్థులకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది.
  • లెక్చరేర్షిప్/అసిస్టెంట్ ప్రొఫిసర్షిప్ కోసం పోటీపడే అభ్యర్థులకు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.

సీఎస్ఐఆర్ నెట్ 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 1 నవంబర్ 2023
దరఖాస్తు చివరి తేదీ 30 నవంబర్ 2023
చేర్పులు మార్పులు 2 - 4 డిసెంబర్ 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 22 డిసెంబర్ 2023
ఎగ్జామ్ డేట్ 26, 27, 28 డిసెంబర్ 2023
ఫలితాలు జనవరి /ఫిబ్రవరి 2024

సీఎస్ఐఆర్ నెట్ దరఖాస్తు ఫీజు

సీఎస్ఐఆర్ నెట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి. వికలాంగులకు ఫీజు మినహాయింపు అవకాశం కల్పించారు.

జనరల్ కేటగిరి 1100/-
ఓబీసీ అభ్యర్థులు 550/-
ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్స్ 275/-

సీఎస్ఐఆర్ నెట్ దరఖాస్తు ప్రక్రియ

సీఎస్ఐఆర్ నెట్ దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. సీఎస్ఐఆర్ నెట్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ నుండి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో మీరు జెఆర్ఎఫ్ లేదా లెక్చరేర్షిప్/అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ లో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలపాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు నింపాల్సి ఉంటుంది. రెండవ దశలో పరీక్షకు సంబంధించిన వివరాలు, ఎంపీకలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తివుతుంది.

దరఖాస్తు సమయంలో నింపే ప్రతి సమాచారం కు జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు స్టెప్ బై స్టెప్ పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి ఉంచుకోండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

సీఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ సెంటర్లు

  1. ఆంధ్రప్రదేశ్: అనంతపూర్, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం.
  2. తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగరెడ్డి, కరీంనగర్. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్

సీఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ నమూనా

సీఎస్ఐఆర్ నెట్ పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో 200 మార్కులకు జరిగే ఈ ఎలిజిబిలిటీ పరీక్షలో అభ్యర్థుల సబ్జెక్టుల ఎంపికల వారీగా ఐదు విభిన్న ప్రశ్న పత్రాలు ఉంటాయి. అవి 1. కెమికల్ సైన్సెస్ 2. ఎర్త్ సైన్సెస్ 3. లైఫ్ సైన్సెస్ 4. మాథమెటికల్ సైన్సెస్ 5. ఫీజికల్ సైన్సెస్.

ప్రశ్నపత్రంలో మూడు విభాగాలలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి విభాగంలో నిర్దేశించిన గరిష్ట పరిమితి ప్రశ్నల సంఖ్యకు సమాధానం చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి కంటే తక్కువ సంఖ్యలో ప్రశ్నలకు సమాధానం చేస్తే ఆ విభాగంలో సాధించిన మార్కులు పరిగణలోకి తీసుకోరు. ప్రశ్నలు అన్ని మల్టిఫుల్ ఛాయస్ విధానంలో ఉంటాయి. తప్పు సమాధానం ఇచ్చిన వాటికీ రుణాత్మక మార్కులు ఉంటాయి.  సబ్జెక్టు వారీగా వాటి పూర్తి వివరాలు ఈ కింద పట్టిక ద్వారా వివరంగా తెలుసుకుందాం.

1. కెమికల్ సైన్సెస్

పార్ట్ A పార్ట్ B పార్ట్ C మొత్తం
మొత్తం ప్రశ్నలు 20 40 60 120
గరిష్టంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు 15 35 25 75
సరైన సమాధానంకు మార్కులు 2 2 4 200
తప్పు సమాధానంకు మార్కులు -0.5 -0.5 -1

2. ఎర్త్ సైన్సెస్

పార్ట్ A పార్ట్ B పార్ట్ C మొత్తం
మొత్తం ప్రశ్నలు 20 50 80 150
గరిష్టంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు 15 35 25 75
సరైన సమాధానంకు మార్కులు 2 2 4 200
తప్పు సమాధానంకు మార్కులు -0.5 -0.5 -1.32

3. లైఫ్ సైన్సెస్

పార్ట్ A పార్ట్ B పార్ట్ C మొత్తం
మొత్తం ప్రశ్నలు 20 50 75 145
గరిష్టంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు 15 35 25 75
సరైన సమాధానంకు మార్కులు 2 2 4 200
తప్పు సమాధానంకు మార్కులు -0.5 -0.5 -1

4. మేథమెటికల్ సైన్సెస్

పార్ట్ A పార్ట్ B పార్ట్ C మొత్తం
మొత్తం ప్రశ్నలు 20 40 60 120
గరిష్టంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు 15 25 20 60
సరైన సమాధానంకు మార్కులు 2 3 4.75 200
తప్పు సమాధానంకు మార్కులు -0.5 -0.75 0

5. ఫీజికల్ సైన్సెస్

పార్ట్ A పార్ట్ B పార్ట్ C మొత్తం
మొత్తం ప్రశ్నలు 20 25 30 75
గరిష్టంగా సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు 15 20 20 55
సరైన సమాధానంకు మార్కులు 2 3.5 5 200
తప్పు సమాధానంకు మార్కులు -0.5 -0.875 -0.25

సీఎస్ఐఆర్ నెట్ ర్యాంకింగ్ విధానం

సీఎస్ఐఆర్ నెట్ అర్హుత పరీక్షలో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగా వివిధ రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకుని తుది లిస్ట్ ను విడుదల చేస్తారు. నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన టాప్ 0.3 నుండి 0.5 శాతం మందిని జూనియర్ రెసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) కు ఎంపిక చేస్తారు. అలానే ఉత్తీర్ణత సాధించిన వారిలో టాప్ 5 నుండి 6 శాతం మందికి అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ ప్రోగ్రాం ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు అందజేస్తారు.

జేఆర్ఎఫ్ అర్హుత సాధించిన వారు జేఆర్ఎఫ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ కూడా అర్హుత సాధించినట్లు అవుతుంది. కాని, అసిస్టెంట్ ప్రొఫెర్షిప్ అర్హుత సాధించిన వారు జేఆర్ఎఫ్ పొందే అవకాశం ఉండదు. అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లును రిజల్ట్ వచ్చిన నెల నుండి రెండు నెలల్లో అందజేస్తారు. వీటి కాలపరిమితి జీవితకాలం ఉంటుంది.

వివిధ కేటగిరీల వారి రిజర్వేషన్లు

ఎస్సీ 15 శాతం
ఎస్టీ 7.5 శాతం
ఓబీసీ 27 శాతం
వికలాంగుల కోటా 5 శాతం

సీఎస్ఐఆర్ నెట్ ఇతర సమాచారం

వెబ్‌సైట్ వెబ్‌సైట్ 2
ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అడ్మిట్ కార్డు
సిలబస్  రిజల్ట్
మునపటి ప్రశ్న పత్రాలు  Mock Test

Post Comment