స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
Scholarships

స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్

స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన డిజాబిలిటీ విద్యార్థులకు, ప్రభుత్వం గుర్తించిన టాప్ క్లాస్ యూనివర్సిటీలు మరియు ఇనిస్టిట్యూట్లలో పూర్తిస్థాయి రెసిడెన్సియల్ టైపు ఉన్నత విద్య అందిస్తారు. ఈ స్కాలర్షిప్ 12 వ ప్లానింగ్ కమిషన్ సిపార్సు మేరకు 2015-16 నుండి అందిస్తున్నారు. ఈ స్కీమ్ అన్ని రకాల గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా కోర్సులకు వర్తింపజేస్తారు. ప్రతిభావంతులైన డిజాబిలిటీ విద్యార్థులను గౌరవనీయమైన స్థాయిలో నిలబెట్టలనే ఉద్దేశ్యంతో దీన్ని అమలుచేస్తున్నారు.

Advertisement
స్కాలర్షిప్ పేరు స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
ఎవరు అర్హులు 40% డిజాబిలిటీ కలిగిన యూజీ, పీజీ విద్యార్థులు
దరఖాస్తు ముగింపు తేదీ 31-10-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 15-11-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 30-11-2022

ఈ స్కాలర్షిప్ దేశవ్యాప్తంగా కేవలం 300 మంది విద్యార్థులకు మాత్రమే అందజేస్తారు. ఇందులో 50 శాతం మహిళా విద్యార్థులకు కేటాయిస్తారు. వారు అందుబాటులో లేని సమయంలో అర్హులైన పురుషులకు కేటాయిస్తారు. ఈ స్కాలర్షిప్'కు అర్హుత పొందిన విద్యార్థులకు మైంటెనెన్సు అలోవెన్సు, ఫీజు రీయింబర్సమెంట్, బుక్ గ్రాంట్ అమౌంట్, స్పెషల్ అలోవెన్సు మరియు ఇతర ఖర్చుల కోసం స్పెషల్ గ్రాంట్స్ అందిస్తారు. వీటిని విద్యార్థి యొక్క కోర్సు వ్యవధి ఆధారంగా రెండు నుండి ఐదేళ్ల వరకు అందిస్తారు.

Components of scholarship Rate for Awadree
 ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థి చేరిన కోర్సు ఆధారంగా గరిష్టంగా 2 లక్షలు
మెంటెనన్స్ అలోవెన్సు హాస్టల్లో ఉండే వాళ్ళకు నెలకు 3 వేలు, డేస్ స్కాలర్ విద్యార్థులకు 1500/-
స్పెషల్ అలోవెన్సు (డిజాబిలిటీ విద్యార్థి సహాయకుల కొరకు) నెలకు 2,000/-
బుక్స్ & స్టేషనరీ ఏడాదికి 5 వేలు
కంప్యూటర్ మరియు సంబంధిత వస్తువులు కొనుక్కునేందుకు రీయింబర్స్‌మెంట్ 30 వేలు (వన్ టైమ్ గ్రాంట్)
విద్యార్థికి అవసరమయ్యే ఇతర వస్తువులు కొనుక్కునేందుకు రీయింబర్స్‌మెంట్ 30 వేలు (వన్ టైమ్ గ్రాంట్)

స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ

40 శాతం కనీస డిజాబిలిటీ కలిగి ఉండి, టాప్ మెరిట్ కలిగిన విద్యార్థులు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు విద్యార్థి, డిజాబిలిటీ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, అకాడమిక్ సర్టిఫికెట్, ఫొటోగ్రాఫ్, ఫీజు రిసిప్టులు మరియు ఆధార్ కార్డు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.

దరఖాస్తు చేయండి

ఈ స్కాలర్షిప్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎంపవర్మెంటు ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తు నోటిఫికేషన్ స్థానిక వార్తాపత్రికల్లో మరియు న్యూస్ ఛానెళ్లలో పబ్లిష్ చేస్తారు. అర్హుత ఉండే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం నియమింపబడిన స్టీనింగ్ కమిటీ దరఖాస్తు పరిశీలించి, అర్హులను గుర్తిస్తుంది. దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం, వీరి సిపార్సు మేరకు స్కాలర్షిప్ ప్రకటిస్తారు.

అందుబాటులో ఉండే స్కాలర్షిప్'లలో 50 శాతం బాలికలకు రిజర్వ్ చేయబడి ఉంటాయి. అలానే ఒక కుటుంబంలో గరిష్టంగా ఒక విద్యార్థికి మాత్రమే ఈ స్కాలర్షిప్ అందిస్తారు. ఈ పథకం పరిధిలో గరిష్టంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి టాప్ 300 మందికి అవకాశం కల్పిస్తారు.

Advertisement

Post Comment