జీవుల అధ్యయనాన్ని జీవశాస్త్రం లేదా బయాలజీ అని అంటారు. ఈ జీవశాస్త్రాన్ని తిరిగి జంతుశాస్త్రం (జూవాలాజీ) మరియు వృక్షశాస్త్రం (బోటనీ) లుగా విభజించారు. ఈ రెండింటి మధ్యలో సూక్ష్మజీవ శాస్త్రం (మైక్రో బయాలజీ) ఒక ప్రత్యేక అధ్యయనంగా ఉంది.
ఈ సాధారణ వర్గీకరణ పక్కన పెడితే భూమి పై ఉండే జీవులన్నింటిని 5 రాజ్యాలుగా వర్గీకరించారు. ఈ అంశాలకు సంబంధించి పోటీ పరీక్షల్లో వచ్చిన పాత ప్రశ్నలను మరియు మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి.
ఫైవ్ కింగ్డమ్స్ ఆఫ్ బయాలజీ
- కింగ్‌డమ్ మోనెరా (ప్రోకార్యోటిక్ బ్యాక్టీరియా మరియు బ్లూ గ్రీన్ ఆల్గే).
- కింగ్‌డమ్ ప్రొటిస్టా (ఏకకణ యూకారియోటిక్ జీవులు- ప్రోటోజోవాన్‌లు మరియు ఆల్గే).
- కింగ్‌డమ్ ఫంగై (మల్టీన్యూక్లియేట్ హైయర్ ఫంగై).
- కింగ్‌డమ్ ప్లాంటే (బహుకణ ఆకుపచ్చ మొక్కలు మరియు అధునాతన ఆల్గే).
- కింగ్‌డమ్ యానిమలియా (బహుకణ జంతువులు)
1. జీవులను 5 జీవ రాజ్యాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు ?
- కరోలస్ లిన్నెయస్
- అరిస్టాటిల్
- ఎర్నెస్ట్ హేకెల్
- రాబర్ట్ విట్టేకర్
సమాధానం
4. రాబర్ట్ విట్టేకర్
2. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
- కరోలస్ లిన్నెయస్
- అరిస్టాటిల్
- ఎర్నెస్ట్ హేకెల్
- రాబర్ట్ విట్టేకర్
సమాధానం
1. కరోలస్ లిన్నెయస్
3. జీవశాస్త్ర పితామహుడుగా ఎవరిని సంబోధిస్తారు ?
- ఆర్కిమెడిస్
- అరిస్టాటిల్
- చార్లెస్ డార్విన్
- థియోఫ్రాస్టస్
సమాధానం
2. అరిస్టాటిల్
4. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో ప్రధాన ప్రాతిపదిక ఏంటి ?
- కణ నిర్మాణం
- పోషణ విధానం
- పునరుత్పత్తి విధానం
- పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని
5. విట్టేకర్ 5 రాజ్యాల సరైన క్రమాన్ని గుర్తించండి ?
- యానిమలియా, ప్లాంటే, ఫంగై, ప్రొటిస్టా, మోనెరా
- ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమలియా, మోనెరా
- మోనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమలియా
- మోనెరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమలియా
సమాధానం
3. మోనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమలియా
6. విట్టేకర్ వర్గీకరణలో అతిపురాతన జీవులు ఏవి ?
- యానిమలియా
- ఫంగై
- మోనెరా
- ప్రొటిస్టా
సమాధానం
3. మోనెరా
7. ప్రొటిస్టా సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ?
- ఏకకణ యూకారియోటిక్ జీవులు
- క్లోరోప్లాస్ట్ ఉన్న ప్రొటిస్టా సమూహాన్ని క్లోరోఫైటా అంటారు
- క్లోరోప్లాస్ట్ లేని ప్రొటిస్టా సమూహాన్ని ప్రోటోజోవా అంటారు
- బహుకణ ప్రోకారియోటిక్ జీవులు
సమాధానం
4. బహుకణ ప్రోకారియోటిక్ జీవులు
8. బాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు ఏ జీవ వర్గానికి చెందుతాయి ?
- యానిమలియా
- ఫంగై
- మోనెరా
- ప్రొటిస్టా
సమాధానం
3. మోనెరా
9. అమీబా, ప్లాస్మోడియం, పారమీషియం ఏ జీవ వర్గానికి చెందుతాయి ?
- యానిమలియా
- ఫంగై
- ప్లాంటే
- ప్రొటిస్టా
సమాధానం
4. ప్రొటిస్టా
10. యానిమలియా వర్గానికి మరో పేరు ఏంటి ?
- హోమో సేపియన్స్
- మెటా ఫైటా
- మెటాజోవా
- ప్రోటోజోవా
సమాధానం
3. మెటాజోవా
11. విట్టేకర్ వర్గీకరణలో మొదటి బహుకణ యూకారియోటిక్ జీవులు ?
- యానిమలియా
- ఫంగై
- మోనెరా
- ప్రొటిస్టా
సమాధానం
2. ఫంగై
12. మెటాఫైటా అని పిలుచుకునే జీవ రాజ్యం ఏది ?
- యానిమలియా
- ఫంగై
- ప్లాంటే
- ప్రొటిస్టా
సమాధానం
3. ప్లాంటే
13. క్రిసోఫైట్స్, యూగ్లెనాయిడ్స్, డైనోఫ్లాగెల్లేట్స్ ఏ రాజ్యానికి చెందిన జీవులు ?
- యానిమలియా
- ఫంగై
- ప్లాంటే
- ప్రొటిస్టా
సమాధానం
4. ప్రొటిస్టా
14. డయాటమ్‌లకు సంబంధించి నిజం కాని వాక్యాన్ని గుర్తించండి ?
- సిలికాతో రూపొందిన ఫ్రస్ట్యుల్ అనే సెల్ వాల్ కలిగి ఉంటాయి
- నీటిలో కరిగిన కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తాయి
- డయాటమ్స్ క్లోరోఫిల్ లేదా శాంతోఫిల్ వర్ణద్రవ్యలను కలిగి ఉంటాయి
- డయాటమ్స్ పోషణకు హైడ్రేటెడ్ సిలికాన్ డయాక్సైడ్ అవసరం
సమాధానం
4. డయాటమ్స్ పోషణకు హైడ్రేటెడ్ సిలికాన్ డయాక్సైడ్ అవసరం
15. కింది వాటిలో ఏ జీవులను సముద్రాలలో చీఫ్ ప్రొడ్యూసర్లుగా పిలుస్తారు ?
- సైనోబాక్టీరియా
- డైనోఫ్లాగెల్లేట్స్
- డయాటమ్స్
- యూగ్లెనోయిడ్స్
సమాధానం
3. డయాటమ్స్
16. శిలీంధ్రాలు సంబంధించి కింది వాటిలో ఏది నిజం కాదు ?
- శిలీంధ్రాలు హెటెరోట్రోఫిక్
- ఫంగై సెల్ వాల్ గ్లూకాన్‌లు, చిటిన్ & గ్లైకోప్రొటీన్‌లతో కూడి ఉంటుంది .
- శిలీంధ్రాలు పూర్తిగా సెల్యులోజ్ సెల్ గోడను కలిగి ఉంటాయి
- శిలీంధ్రాలు యూకారియోటిక్ జీవులు
సమాధానం
3. శిలీంధ్రాలు పూర్తిగా సెల్యులోజ్ సెల్ గోడను కలిగి ఉంటాయి
17. ప్లాంటే సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ?
- బహుకణ యూకారియోటిక్ జీవులు
- కణాలు సెల్యులోజ్ గోడలను కలిగి ఉంటాయి.
- ప్లాంటే సమూహపు జీవులు ఆటోట్రోఫిక్
- బ్రయోఫైట్స్ మినహా మిగతా అన్ని మొక్కలు ప్లాంటే సమూహంలో భాగం
సమాధానం
4. బ్రయోఫైట్స్ మినహా మిగతా అన్ని మొక్కలు ప్లాంటే సమూహంలో భాగం
18. చైట్రిడియోమైకోటా, జైగోమైకోటా, అస్కోమైకోటా, బాసిడియోమైకోటా ?
- శిలీంధ్రాల రకాలు
- శైవలాల రకాలు
- బయోఫైటా రకాలు
- టెరిడోఫైటా రకాలు
సమాధానం
1. శిలీంధ్రాల రకాలు
19. మొలస్కా, పోరిఫెరా, ఆర్థ్రోపోడా అన్నెలిడా వర్గాలు ఏ రాజ్యానికి చెందినవి ?
- యానిమలియా
- ఫంగై
- ప్లాంటే
- ప్రొటిస్టా
సమాధానం
1. యానిమలియా
20. బ్యాక్టీరియాకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం ?
- ఏకకణ, యూకార్యోటిక్, మైక్రోస్కోపిక్ జీవులు
- కణ కవచం ప్లాస్మాతో రూపొంది ఉంటుంది
- బ్యాక్టీరియాలు ప్రొటిస్టా రాజ్యంలో ఉంచబడ్డాయి
- బ్యాక్టీరియాలు లైంగిక ప్రత్యుపత్తిలో పాల్గొంటాయి
సమాధానం
2. కణ కవచం ప్లాస్మాతో రూపొంది ఉంటుంది
21. కింది వాటిలో కరోలస్ లిన్నెయస్ యొక్క బుక్ కానిది ఏది ?
- స్పీషిస్ ప్లాంటారమ్
- సిస్టమా నేచురే
- జెనెరా ప్లాంటరమ్
- హిస్టోరియా ప్లాంటరమ్
సమాధానం
4. హిస్టోరియా ప్లాంటరమ్
22. ఏడు జంతు రాజ్యాల ప్రతిపాదన చేసిన శాస్త్రవేత్త ?
- ఎర్నెస్ట్ హేకెల్
- థామస్ కావలీర్-స్మిత్
- కార్ల్ లిన్నేయస్
- రాబర్ట్ హార్డింగ్ విట్టేకర్
సమాధానం
2. థామస్ కావలీర్-స్మిత్
23. థామస్ కావలీర్-స్మిత్ వర్గీకరణలో కొత్తగా చేర్చిన రాజ్యాలు ఏవి ?
- యూబాక్టీరియా
- ఆర్కిబాక్టీరియా
- క్రోమిస్టా
- పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని
24. జీవశాస్త్ర వర్గీకరణ యొక్క 7 స్థాయిల సరైన క్రమాన్ని గుర్తించండి ?
- రాజ్యం, ఫైలం, తరగతి, ఆర్డర్, కుటుంబం, జాతి, ప్రజాతి
- రాజ్యం, ఫైలం, తరగతి, ఆర్డర్, కుటుంబం, ప్రజాతి, జాతి
- ఫైలం, రాజ్యం, తరగతి, ఆర్డర్, కుటుంబం, జాతి, ప్రజాతి
- రాజ్యం, కుటుంబం, జాతి, ప్రజాతి, ఫైలం, తరగతి, ఆర్డర్, ,
సమాధానం
2. రాజ్యం, ఫైలం, తరగతి, ఆర్డర్, కుటుంబం, ప్రజాతి, జాతి
25. ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ?
- గాస్పర్డ్ బాహిన్
- కరోలిస్ లిన్నేయస్
- చార్లెస్ డార్విన్
- రాబర్ట్ విట్టేకర్
సమాధానం
2. కరోలిస్ లిన్నేయస్
26. సహజ వర్గీకరణ విధానాన్ని ఎవరు ప్రతిపాదించారు ?
- కార్ల్ లిన్నెయస్
- బెంథామ్ & హుకర్
- రాబర్ట్ విట్టేకర్
- ఎర్నెస్ట్ హేకెల్
సమాధానం
2. బెంథామ్ & హుకర్
27. యూకారియోటిక్ కణాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ?
- యూకారియోటిక్ కణంలో న్యూక్లియర్ మెమ్బ్రేన్ ఉంటుంది
- మైటోకాండ్రియా, గొల్గి బాడీలు, సెల్ గోడను కలిగి ఉంటుంది
- సిలియా & ఫ్లాగెల్లా వంటి లోకోమోటరీ అవయవాలను కూడా కలిగి ఉంటాయి
- యూకారియోటిక్ కణంలో డీఎన్ఏ జీవ పదార్థం ఉండదు
సమాధానం
4. యూకారియోటిక్ కణంలో డీఎన్ఏ జీవ పదార్థం ఉండదు
28. మూడు డొమైన్‌ల వర్గీకరణలో ప్రధాన జంతు సామ్రాజ్యాలు ఏవి ?
- ఆర్కియా, బాక్టీరియా, యూకారియా
- ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే,
- ఫంగై, ప్లాంటే, యానిమలియా
- పైవి ఏవి కావు
సమాధానం
1. ఆర్కియా, బాక్టీరియా, యూకారియా
29. క్రింది వాటిలో యూకారియోటిక్ రాజ్యాలు ఏమిటి ?
- ఆర్కియా, బాక్టీరియా, యూకారియా
- యానిమాలియా, ప్లాంటే, మోనెరా
- మోనెరా, ఫంగై, ప్లాంటే
- ఫంగై, మెటాజోవా, ఫైటోజోవా
సమాధానం
4. ఫంగై, మెటాజోవా, ఫైటోజోవా
30. జీవ వర్గీకరణ ఎందుకు ముఖ్యమైనది ?
- జీవుల యొక్క వివిధ సమూహాల మధ్య పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి
- విభిన్న జీవుల మధ్య లక్షణాలు, సారూప్యతలు & వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి
- జీవుల పుట్టుక మరియు పరిణామాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది
- పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని