ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ : AFCAT 2024 Notification
Admissions Engineering Entrance Exams

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ : AFCAT 2024 Notification

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యందు గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఫ్లైయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ అధికారుల భర్తీ కోసం ఈ నియామక పరీక్షను నిర్వహిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 258 పోస్టులు భర్తీ చేయనున్నారు.

టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో భర్తీచేసే ఈ పోస్టుల ఎంపిక, రాతపరీక్ష మరియు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్  బోర్డు టెస్ట్ ద్వారా నిర్వహిస్తారు. అందుబాటులో ఉండే పోస్టుల వారీగా ఇంటర్మీడియట్ (ఎంపీసీ), డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పూర్తిచేసిన అవివాహిత యువతి, యువకులు డిసెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోండి

నియామక బోర్డు ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఎగ్జామ్ పేరు ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఫీజికల్ & మెడికల్ టెస్ట్
ఎలిజిబిలిటీ ఇంటర్ & ఇంజనీరింగ్
వయో పరిమితి 20 - 24 ఏళ్ళు

AFCAT 2024 ఎలిజిబిలిటీ

  • జాతీయత : అభ్యర్థి భారతీయ పౌరుడయి ఉండాలి.
  • వయోపరిమితి : ఫ్లైయింగ్ బ్రాంచుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 20 నుండి 24 ఏళ్ళ మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీకి ధరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 20 నుండి 26 ఏళ్ళ మధ్య ఉండాలి.
  • వైవాహిక స్థితి: 25 ఏళ్ళ లోపు ఉండే అభ్యర్థులు అవివాహితులై ఉండాలి.
  • విద్యా అర్హుత : ఫ్లయ్లింగ్ బ్రాంచికు ధరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (మ్యాథ్స్, ఫిజిక్స్), గ్రాడ్యుయేషన్ లేదా బీఈ/బీటెక్ పూర్తిచేసుండాలి. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) కి దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (మ్యాథ్స్, ఫిజిక్స్), బీటెక్ (కంప్యూటర్ & ఎలక్ట్రికల్, మెకానికల్ గ్రూపులలో ) పూర్తిచేసుండాలి. గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్- అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ ) కి దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ బ్రాంచీకు ధరఖాస్తు చేసే అభ్యర్థులు NCC ఎయిర్ వింగ్ డివిజన్ C సర్టిఫికెట్ కలిగివుండాలి. అలానే 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఎంపీసీ) పూర్తిచేసి ఉండాలి.
భారత వైమానికదళం ఎంట్రీ, బ్రాంచ్ మరియు కమిషన్
ఎంట్రీ బ్రాంచ్ PC/SCC
AFCAT  ఎంట్రీ ఫ్లైయింగ్ SSC (పురుషులు/మహిళలు)
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్  (ఏరోనాటికల్ ఇంజనీర్ ఎలిక్ట్రికల్ & మెకానికల్ ) PC (పురుషులు) & SSC (పురుషులు/మహిళలు)
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ (అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్)  PC (పురుషులు) & SSC (పురుషులు/మహిళలు)
NCC స్పెషల్ ఎంట్రీ ఫ్లైయింగ్  PC (పురుషులు) & SSC (పురుషులు/మహిళలు)

Permanent Commission (PC) & Short Service Commission (SSC)

AFCAT 2024 షెడ్యూల్

నోటిఫికేషన్ నెంబర్ AFCAT 2024
పోస్టులు 258
నోటిఫికేషన్ తేదీ 1 డిసెంబర్ 2023
దరఖాస్తు తుది గడువు 30 డిసెంబర్ 2023
పరీక్ష తేదీ ఫిబ్రవరి 2024
అడ్మిట్ కార్డు జనవరి 2024
ఫలితాలు ఫిబ్రవరి 2024

AFCAT 2024 దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరి. దరఖాస్తులో ఖచ్చితమైన విద్య, వ్యక్తిగత సమాచారం నింపాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పులు దొర్లితే అనర్హుత పొందే అవకాశం ఉంటుంది. AFCAT ఎంట్రీ లెవెల్ ఎంపిక, ప్రవేశించే బ్రాంచ్ వివరాలు నింపే సమయంలో జాగ్రత్త వహించండి. పరీక్షా కేంద్రం, కమ్యూనికేషన్ వివరాలు మరోమారు సరి చూసుకుని తుది దశ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయండి.

AFCAT దరఖాస్తు ఫీజు  250/-
NCC అభ్యర్థులకు ఫీజు లేదు

తెలుగు రాష్ట్రాల్లో AFCAT 2024 ఎగ్జామ్ సెంటర్లు

  1. హైదరాబాద్
  2. వరంగల్
  3. తిరుపతి
  4. విజయవాడ
  5. విశాఖపట్నం

AFCAT 2024 ఎగ్జామ్ నమూనా

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్దతిలో ఇవ్వబడతాయి. జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, ​​న్యూమరికాల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ & మిలిటరీ ఆప్టిట్యూడ్ అంశాల నుండి వంద మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

పరీక్షకు 2 గంటల సమయం కేటాయిస్తారు. పరీక్షా మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కోత విధిస్తారు. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు.

గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచిను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు AFCAT తో పాటుగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (EKT)కు హాజరవ్వాల్సి ఉంటుంది. EKT 45 నిముషాల వ్యవధితో 150 మార్కులకు జరుగుతుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 3 మార్కులు, తప్పు సమాధానం చేసినప్రశ్నకు -1 మార్కు తొలగిస్తారు. AFCAT మరియు EKT ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామ్ సబ్జెక్టు సమయం ప్రశ్నలు మార్కులు
AFCAT జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంజనీరింగ్, న్యూమరికాల్ ఎబిలిటీ & రీజనింగ్  మరియు
మిలిటరీ ఆప్టిట్యూడ్ .
2 గంటలు 100 300
KET మెకానికల్, కంప్యూటర్, సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ &
ఎలక్ట్రానిక్స్
45 నిముషాలు 50 150

AFCAT సిలబస్

  • English: Comprehension, Error Detection, Sentence Completion/ Filling in of correct word, Synonyms, Antonyms and Testing of Vocabulary, Idioms and Phrases.
  • General Awareness: History, Geography, Civics, Politics, Current Affairs, Environment, Basic Science, Defence, Art, Culture, Sports, etc.
  • Numerical Ability: Decimal Fraction, Time and Work, Average, Profit & Loss, Percentage, Ratio & Proportion and Simple Interest, Time & Distance (Trains/Boats & Streams).
  • Reasoning and Military Aptitude Test: Verbal Skills and Spatial Ability

ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు

AFCAT మెరిట్ సాధించిన అభ్యర్థులను ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు టెస్టింగ్ కోసం అందుబాటులో ఉండే AFSB సెంటరుకు ఆహ్వానిస్తారు. AFSB సెంటర్లు డెహ్రాడూన్, మైసూరు,గాంధీనగర్ మరియు వారణాసిలో అందుబాటులో ఉన్నాయి. ఫ్లైయింగ్ బ్రాంచిను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు డెహ్రాడూన్, మైసూర్, వారణాసి AFSB కేంద్రాల్లో హాజరవ్వాల్సి ఉంటుంది.

NCC అభ్యర్థులు నేరుగా అందుబాటులో ఉండే AFSB సెంటర్కు చేరుకోవాల్సి ఉంటుంది. AFCAT లో అర్హుత సాధించిన అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ వెబ్సైటు ద్వారా AFSB సెంటరును, హాజరయ్యే తేదీని ఎంపికచేసుకుని కాల్ లెటర్ పొందాల్సి ఉంటుంది.

AFSB టెస్టింగ్'కు వెళ్లేముందు అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షా నిర్వహిస్తారు. దీనితో పాటుగా  శరీరంపై టాటూస్ పరిశీలన. నార్కోటిక్స్ టెస్టులు నిర్వహిస్తారు.

  • ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్: ఈ టెస్టులో భాగంగా 10 నిముషాల్లో 1.6 కిలోమీటరు పరుగును పూర్తిచేయాల్సి ఉంటుంది. పది పుష్ అప్స్ మరియు 3 చిన్ అప్స్ కూడా చేయాల్సి ఉంటుంది.
  • టాటూస్ పరిశీలన: శాశ్వత శరీర పచ్చబొట్లు ముంజేయి లోపలి ముఖంపై (మోచేయి లోపలికి మణికట్టుకు)మరియు అరచేతి / వెనుక (డోర్సల్) చేతి  రివర్స్ వైపు) మాత్రమే అనుమతించబడతాయి. శరీరంలోని ఇతర భాగాలపై శాశ్వత శరీర పచ్చబొట్లు ఆమోదయోగ్యం కాదు. గిరిజన తెగలు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం ముఖాలపై వేసుకునే పచ్చబొట్లు అనుమతించబడతాయి.
  • నార్కోటిక్ టెస్ట్: ఎంపిక ప్రక్రియలో కానీ, ట్రైనింగ్ సమయంలో కానీ కెరీర్లో కానీ నార్కోటిక్ డ్రగ్స్ ఉపయోగించడం నిషిద్ధం. నియమాల్ని ఉల్లఘించి ఉపయోగించే అభ్యర్థులను బాధ్యతులు నుండి తొలగిస్తారు.

ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు టెస్ట్

AFSB టెస్ట్ మూడు స్టేజీల్లో నిర్వహిస్తారు.

స్టేజ్ I : స్టేజ్ Iలో స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ఆఫీసర్ ఇంటిలిజెన్స్ రేటింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనితో పాటుగా పిక్చర్ ప్రిస్క్రిప్షన్ మరియు జనరల్ డిస్కషన్ జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయినా అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పంపిస్తారు. అర్హుత సాధించని అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ నుండి తొలగించబడతారు.

స్టేజ్ II : డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత అదే రోజు మధ్యాహ్నం స్టేజ్ II లో భాగంగా సైకాలాజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులు గ్రూపు డిస్కషన్లు మరియు ఇంటర్వ్యూలు కొనసాగిస్తారు.

స్టేజ్ III : ఇది ఫ్లైయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. సిపార్సు చేసిన అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ (CPSS) టెస్ట్ నిర్వహిస్తారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ పరీక్షా విఫలమైతే పైలట్ అవ్వాలనే కలకు ముగింపు పలికినట్లే.

తుది ఎంపిక మరియు ట్రైనింగ్

AFCAT మరియు AFSB టెస్టులకు విడివిగా అర్హుత మార్కులు ప్రకటిస్తారు. ఈ రెండు టెస్టులల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను కలిపి తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఖాళీల సంఖ్యలో 10% సీట్లను NCC అభ్యర్థులకు కేటాయిస్తారు.

గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ విభాగాల్లో చేరిక, అభ్యర్థులు నియామక ప్రక్రియలో చూపిన ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. ఎక్కువ మెరిట్ సాధించిన అభ్యర్థులకు మొదటి అవకాశం కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులను ట్రైనింగ్ కోసం పంపిస్తారు.

AFSB ఎంపిక చేసిన అభ్యర్థులకు జూన్ మొదటి వారంలో ట్రైనింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫ్లైయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అభ్యర్థులకు 74 వారాల పాటు కఠినమైన ట్రైనింగ్ అందిస్తారు. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ అభ్యర్థులకు 52 వారాల ట్రైనింగ్ ఉంటుంది.

ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులు ఫీజికల్ గా, మెంటల్ గా తమని తాము దృడంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ప్రతిరోజూ రన్నింగ్, స్విమ్మింగ్, రోప్ క్లయింబింగ్ కార్యకమాల్లో పాల్గునల్సి ఉంటుంది.

15 నిమిషాల్లో 4 కిలోమీటర్ల పరుగు
స్కిప్పింగ్
పుష్ అప్స్ & సిట్-అప్స్ కనిష్టంగా 20 చొప్పున
చిన్ అప్స్ 8
రోప్ క్లైమ్బింగ్ 3 నుండి 4 మీటర్లు
ఈత (25 మీ)

One Comment

Post Comment