వీటీఈ (VITEEE) 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams

వీటీఈ (VITEEE) 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

వీటీఈ 2023 నోటిఫికేషన్ వెలువడింది. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వివిధ బీటెక్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నుండి 23వ తేదీ మధ్య జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.

Advertisement

వీటీఈ ప్రవేశ పరీక్షను వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) లో ఇంజనీరింగ్ మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విన్నూత పరిశోధనాత్మక ఇంజనీరింగ్ కోర్సులకు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెలవు.

వెల్లూరు ఇనిస్టిట్యూట్, నాణ్యమైన ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందిస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలలో ముందు వరుసలో ఉంటుంది. విట్ అంతర్జాతీయంగా వందల సంస్థలతో సంబంధాలు కలిగిఉండటమే కాకుండా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేసెమెంట్స్ కల్పించటంలో దేశంలోనే నెంబర్ 1 ఇనిస్టిట్యూటుగా ప్రసిద్ధికెక్కింది.

వరుసగా 7 ఏళ్ళు అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూటుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ యందు  ప్రవేశించింది. వెల్లూరు ఇనిస్టిట్యూటుకు దేశవ్యాప్తంగా వెల్లూరు (కర్నాటక), చెన్నై (తమిళనాడు), అమరావతి (ఆంధ్రప్రదేశ్) మరియు భోపాల్ (మధ్యప్రదేశ్) లో  క్యాంపసులు ఉన్నాయి. ఈ నాలుగు క్యాంపస్ల యందు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (విట్ఈఈఈ) ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.

వీటీఈ 2023

Exam Name VITEEE 2023
Exam Type Entrance
Admission For B.Tech
Exam Date 17 April 2023 O/W
Exam Duration 2.30 Hours
Exam Level University Level

విట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వివరాలు

విట్ అందిస్తున్న కోర్సులు & ఫీజులు

ఇంజనీరింగ్ విద్యలో దేశంలో ఎవరు అందించని విన్నూత కోర్సులు విట్ అందిస్తుంది. 4 ఏళ్ళ నిడివితో సాగే ఈ ఇంజనీరింగ్ కోర్సులు అన్నీ విట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు.

Group A : 1) బయో ఇంజనీరింగ్ 2) బయోటెక్నాలజీ 3) కెమికల్ ఇంజనీరింగ్ 4) సివిల్ ఇంజనీరింగ్  5) ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 6) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 7) ఫ్యాషన్ టెక్నాలజీ  8) ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బి.డెస్ (ఇండస్ట్రియల్ డిజైన్)

Group B: 1) మెకానికల్ ఇంజనీరింగ్ 2) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 4) మెకానికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ 5) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషల్ 6) ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 7) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషల్ 8) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సెన్సార్

9) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా అనలిటిక్స్ 10) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ నెట్‌వర్క్స్ అండ్ సెక్యూరిటీ 11) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ స్పెషల్ 12)సెన్సార్లు మరియు ధరించగలిగే టెక్నాలజీ 13) ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో స్పెషల్ 14) ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో స్పెషల్

15) ఎంబెడెడ్ సిస్టమ్స్ 16) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ & డిజిటల్ ఫోరెన్సిక్స్లో స్పెసిలైజేషన్) 17) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్ప్లి. గేమింగ్ టెక్నాలజీలో 18) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషల్ 19) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 20) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషల్ 21) సైబర్ ఫిజికల్ సిస్టమ్స్‌లో.

పార్ట్ A కోర్సుల ఫీజు వివరాలు
ట్యూషన్ ఫీజు (ఏడాదికి) 1,73,000 /-
క్యాషన్ డిపాజిట్ (రిఫండబుల్) 3,000 /-
మొదటి ఏడాది మొత్తం ఫీజు 1,76,000 /-
పార్ట్ B  కోర్సుల ఫీజు వివరాలు
ట్యూషన్ ఫీజు (ఏడాదికి) 1,95,000 /-
క్యాషన్ డిపాజిట్ (రిఫండబుల్) 3,000
మొదటి ఏడాది మొత్తం ఫీజు 1,98,000 /-

వీటీఈ 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 1 జనవరి 2023
దరఖాస్తు చివరి తేదీ 31 మార్చి 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 1 ఏప్రిల్ 2023
వీటీఈ పరీక్ష తేదీ 17 - 23 ఏప్రిల్ 2023
ఫలితాలు మే 2023
కౌన్సిలింగ్ జూన్ 2023

వీటీఈ 2023 ఎలిజిబిలిటీ

  • ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీ సబ్జెక్టుల యందు 60% మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయ్యివుండాలి. SC/ST అభ్యర్థులకు 50% మార్కులు తప్పనిసరి.
  • విట్ లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనంటే VITEEE ప్రవేశ పరీక్ష రాయటం తప్పనిసరి.
  • VITEEE 2020 కు హాజరయ్యే అభ్యర్థులు 1 జూన్ 1997 తర్వాత జన్మించి ఉండాలి.
  • SSC సర్టిఫికెట్ పై ఉన్న పుట్టిన తేదీలను ప్రామాణికంగా తీసుకోబడును.

వీటీఈ 2023 దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు (ఇండియా) 1,350/-
దరఖాస్తు ఫీజు (విదేశీ విద్యార్థులకు) $90 USD

వీటీఈ దరఖాస్తు ప్రక్రియ

వీటీఈ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. విట్ఈఈఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వెరిఫై చేసుకోవడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చి, పరీక్ష ఫీజును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తులో సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక ఒకటి లేదా కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

వీటీఈ 2023 ఎగ్జామ్ నమూనా

విట్ సంబంధించి నాలుగు ఇనిస్టిట్యూట్లలో బీఈ/బీటెక్ అడ్మిషన్లు విట్ఈఈఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మరియు సీట్ల ఖాళీల ఆదరంగా భర్తీచేస్తారు. వీటీఈ ప్రవేశ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాదానాలు ఉంటాయి.

అందులో ఒక సరైన సమాధానం గుర్తించవల్సి ఉంటుంది. 2.30 గంటల నిడివితో జరిగే ఈ పరీక్ష మొత్తం 125 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఎగ్జామ్ ప్రతి రోజు మూడు షిఫ్టులలో జరుగుతుంది.

ఫిజిక్స్ 35 ప్రశ్నలు
కెమిస్ట్రీ 35 ప్రశ్నలు
మేథమేటిక్స్ / బయాలజీ 40 ప్రశ్నలు
ఆప్టిట్యూట్డ్ 10 ప్రశ్నలు
ఇంగ్లీష్ 5 ప్రశ్నలు
మొత్తం ప్రశ్నల సంఖ్యా 125 ప్రశ్నలు

వీటీఈ ప్రవేశ పరీక్షకు ధరఖాస్తు చేసేముందు అభ్యర్థులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. బీటెక్ డిగ్రీ కోర్సులలో చేరాలనుకునే అభ్యర్థులు పీసీఎంఈ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్) పేపర్ రాయాల్సి ఉంటుంది. బయో ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ వంటి కోర్సులలో చేరాలనుకునే వారు పీసీబీఈ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్) పేపర్ రాయాల్సి ఉంటుంది.

విట్ ఇనిస్టిట్యూట్లు

INSTITUTE WEBSITE
వెల్లూరు(కర్ణాటక) VIT
చెన్నై(తమిళనాడు) VIT-CHENNAI
అమరావతి(ఆంధ్రప్రదేశ్) VIT-AP
భోపాల్(మధ్యప్రదేశ్) VIT-BHOPAL

Advertisement

Post Comment