ఏపీ ఎల్‌పీసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కాలేజీల్లో తెలుగు/హిందీ ఎల్‌పీటీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఏపీ డిపార్టుమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది.
Exam Name | AP LPCET 2023 |
Exam Type | Admission |
Admission For | LPT Courses |
Exam Date | NA |
Exam Duration | 120 Minutes |
Exam Level | State Level (AP) |
ఏపీ ఎల్‌పీసెట్ ఎలిజిబిలిటీ
- ఏపీ & తెలంగాణ విద్యార్థులు అర్హులు.
- అభ్యర్ది కనిష్ట వయస్సు 19 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
- అభ్యర్థి యూనివర్సిటీ అడ్మిషన్ చట్టానికి లోబడి లోకల్/నాన్ లోకల్ నిబంధలను సంతృప్తి పర్చాలి.
తెలుగు పండిట్ విద్య అర్హుత | హిందీ పండిట్ విద్య అర్హుత |
---|---|
బీఏ తెలుగు లిటరేచర్ (లేదా) బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు (లేదా) బ్యాచిలర్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ తెలుగు (లేదా) తెలుగు ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఎంఏ తెలుగు |
బ్యాచిలర్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ హిందీ (లేదా) హిందీ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ప్రవీణ ఆఫ్ దక్షిణ భారత హిందీ ప్రసార సభ (లేదా) విద్వాన్ ఆఫ్ హిందీ ప్రసార సభ హైదరాబాద్ (లేదా) ఎంఏ హిందీ |
ఏపీ ఎల్‌పీసెట్ 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం | - |
దరఖాస్తు గడువు | - |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | - |
పరీక్ష తేదీ | - |
ఫలితాలు | - |
కౌన్సిలింగ్ | - |
ఏపీ ఎల్‌పీసెట్ దరఖాస్తు విధానం
ఏపీ ఎల్‌పీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఎల్‌పీసెట్ అధికారిక వెబ్‌సైట్ (www.aplpcet.apcfss.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. రెండవ దశలో పరీక్షకు సంబంధించిన లాంగ్వేజ్, ఎగ్జామ్ సెంటర్, కోర్సు ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది.
చివరిగా పరీక్ష ఫీజును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు చేసే ముందు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్లోడ్ చేసి, పరీక్ష సంబంధిత నియమ నిబంధనలు తెలుసుకోండి. దరఖాస్తులో నింపే విద్య, వ్యక్తిగత వివరాలలో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించండి.
ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక రెండు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
ఏపీ ఎల్‌పీసెట్ దరఖాస్తు ఫీజు
- దరఖాస్తు ఫీజు 600/- రూపాయలు
- పరీక్షా కేంద్రాలు ఆంధ్ర ప్రదేశ్ సంబంధించి 13 జిల్లాల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు సమయంలో మీకు అందుబాటులో ఉండే జిల్లాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది
- ఎంపిక చేసుకున్న జిల్లాలో పరీక్షా కేంద్రం గరిష్ట పరిమితి మించితే అభ్యర్థికి దగ్గరలో ఉండే జిల్లాలో కేటాయిస్తారు
ఏపీ ఎల్‌పీసెట్ ఎగ్జామ్ నమూనా
ఏపీ ఎల్‌పీసెట్ సీబీటీ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్న పత్రం నాలుగు భాగాలుగా ఉంటుంది. పార్ట్ I యందు 20 ప్రశ్నలు, పార్ట్ II యందు 10 ప్రశ్నలు మరియు పార్ట్ III యందు 30 ప్రశ్నలు మరియు పార్ట్ IV యందు 40 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
పార్ట్ I & II సంబంధించిన ప్రశ్నలు 8 నుండి 10 తరగతుల సిలబస్ నుండి ఇవ్వబడతాయి. పార్ట్ III ప్రశ్నలు ఇంటర్మీడియట్ సిలబస్ నుండి ఇవ్వబడతయి. పార్ట్ IV ప్రశ్నలు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్ పద్దతిలో ఇవ్వబడతాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఋణాత్మక మార్కులు లేవు.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | |
---|---|---|---|
పార్ట్ I | కరెంటు అఫైర్స్ | 20 | 20 |
పార్ట్ II | న్యూమరికాల్ ఎబిలిటీ | 10 | 10 |
పార్ట్ III | లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్ | 30 | 30 |
పార్ట్ IV | లిటరేచర్ | 40 | 40 |
ఏపీ ఎల్‌పీసెట్ అడ్మిషన్ విధానం
లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ అడ్మిషన్ ఎల్‌పీసెట్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా కల్పిస్తారు. ఎల్‌పీసెట్ యందు 40 శాతం కనీస మార్కులు సాధించిన అభ్యర్థులను ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు.
అందుబాటులో సీట్లు గవర్నమెంట్, అన్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీలలో కన్వినర్ కోటా క్రింద ఎల్పీసెట్ మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు. 85 శాతం సీట్లు లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.
ఎస్సీ అభ్యర్థులు | 15% శాతం |
ఎస్టీ అభ్యర్థులు | 8 శాతం |
బీసీ కులాలు | 29 శాతం |
మహిళలు | 33% శాతం |
NCC, Sports | 1 శాతం, 0.5 శాతం |