విదేశీ ఉన్నత విద్య కోసం యూఎస్ తర్వాత యూకే వెళ్లేందుకు అత్యధిక మంది విద్యార్థులు మొగ్గుచూపిస్తారు. ఒకప్పుడు ఉన్నత విద్యకు కేరాఫ్ అడ్రెస్సుగా ఉండే ఇంగ్లీష్ యూనివర్సిటీలు, నేడు అంత జోరు కనబర్చకపోయినా అడ్మిషన్స్ కోసం పోటీపడే విదేశీ విద్యార్థుల సంఖ్యా మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. ఒక్క ఇండియా నుండి ప్రతీ ఏడాది 50 నుండి 60 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం యూకే లో అడుగుపెడుతున్నారు.
ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లాంటి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలకు నెలవైన యునైటెడ్ కింగ్డమ్, ఉన్నత విద్యకోసం యూకే లో అడుగు పెట్టే విదేశీ విద్యార్థులకు ప్రభుత్వం పరంగా, యూనివర్సిటీల పరంగా ప్రత్యేక ప్రాధాన్యత అందించడంతో పాటుగా ఆర్థిక చేయూతను కూడా అందిస్తున్నాయి. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూకే వైపు మొగ్గుచూపడానికి ఐడి కూడా ఒక కారణం కావొచ్చు.
దీనితో పాటుగా యూకే, విదేశీ విద్యార్థులకు పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ఇటీవలే విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి రెండేళ్ల పాటు ఉపాధి పొందేలా అవకాశం కల్పిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది బ్రిటన్. చాలా రోజులుగా వస్తున్న డిమాండ్ల మేరకు రెండేళ్ల వర్క్ వీసాను ప్రకటించింది. దీని ద్వారా యూకే వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది.
మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ యూజీ, పీజీ ప్రోగ్రాములు పూర్తిచేయటానికి తక్కువ వ్యవధి పడుతుంది. దీంతో ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులూ బెడద తగ్గుతుంది. అలానే యూఎస్ స్టూడెంట్ వీసా తో పోల్చుకుంటే యూకే వీసా తక్కువ వ్యవధిలో ఆమోదం పొందుతుంది. వీటితో పాటుగా యూకే స్టూడెంట్ కల్చర్, యూకే ఆహ్లాదకరమైన వాతావరణ మార్పులు, యూరోప్ పర్యాటక ప్రాంతాలు, బ్రిటిష్ ఇంగ్లీషుపై పట్టుసాధించేందుకు వంటి అంశాలు విదేశీ విద్యార్థులను యూకేకు ఆకర్షిస్తుంది.
Cost of Studying in UK for Indian Students
యూఎస్ తో పోల్చుకుంటే యూకే స్టడీ బడ్జెట్ తక్కువనే చెప్పాలి. ప్రాంతాల వారీగా కొద్దిపాటి తేడా ఉన్న, ఏడాదిలో 20 లక్షల నుండి గరిష్టంగా 25 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. 3 లేదా 4 ఏళ్ళ గ్రాడ్యుయేషన్ కోర్సులను గరిష్టంగా 60 లక్షలలోపు ఖర్చుతో యూకేలో ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు. ట్యూషన్ మరియు వసతికి సంబంధించి మొత్తం అంచనా ఇది. టాప్ ఇండియన్ ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లలో చేరితే ఇండియాలో కూడా దీనికి మించే వెచ్చించాల్సి వస్తుంది.
పైగా యూకే లో ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం మరియు యూనివర్శిటీల నుండి ఉపకారవేతనాలు అందుకునే అవకాశం వుంది. దానితో పాటుగా యూకే ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వారానికి గరిష్టంగా 20 గంటలు వర్క్ చేసినా, నెలకు గరిష్టంగా 700 యూరోల వరకు అర్జించే అవకాశం ఉంటుంది. లండన్ వంటి నగరాలూ మినహాయిస్తే యూకేలో ఉన్నత విద్యను ఇండియాలో పెట్టె ఖర్చుతో పూర్తి దర్జాగా చేయొచ్చు.
Avarage Tuition fees in Uk
Study Program | Average fee (in Rupee) |
Undergraduate bachelor degree | 10 నుండి 20 లక్షలు |
Postgraduate master's degree | 10 నుండి 20 లక్షలు |
Doctoral degree | 15 నుండి 25 లక్షలు |
Short term courses | 8 నుండి 12 లక్షలు |
Accommodation costs
Cost of student visa | Rs 35,000/- (సుమారుగా) |
Food | Rs 15,000/- Pm (సుమారుగా) |
Bills | Rs 5,000/- pm (సుమారుగా) |
House rents (అపార్టుమెంట్ తీసుకుంటే) | Rs 35,000/- pm (సుమారుగా) |
Others | Rs 15,000/- pm (సుమారుగా) |
Scholarships for uk study
- ఏపీ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి
- తెలంగాణ ఓవర్సీస్ విద్యానిధి
- పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ స్కాలర్‌షిప్‌లు
- కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌లు మరియు ఫెలోషిప్లు
- బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్‌షిప్‌లు (మహిళలకు)
- న్యూటన్ ఫండ్ పీహెచ్డీ కాల్ - ఇండియా
- Great స్కాలర్‌షిప్‌లు
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ స్కాలర్‌షిప్‌లు
Useful Websites
British Council of India | Website |
Study in Uk | Website |
UK Govt | Website |
UK International Student Affairs | Website |
UK Immigration | Website |
Study in UK Free Consultancy | Website |
UK Embassy in India
British Deputy High Commission Hyderabad
2nd Floor, Taj Deccan Hotel,
Road No.1, Banjara Hills,
Hyderabad 500 034
India
General telephone +91 (40) 6666 9147 / 48
Emergency telephone +91 (11) 2419 2100 (24 hrs a day)
Fax +91 (40) 6666 9149
Consular telephone +91 (44) 42192151