అర్పిట్ ప్రోగ్రాంను టీచింగ్ సిబ్బంది కెరీర్ పురోగతికి తోడ్పడే అంశాల యందు ట్రైనింగ్ ఇచ్చేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏటా బోధన పద్ధతుల్లో వచ్చే మార్పులును, నూతనంగా చేర్చిన అంశాలపై అవగాహనా కార్యక్రమాలు మరియు బోధనా సంబంధిత టెక్నికల్ అంశాలు మెరుగుపరచడం సంబంధించి వీడియో శిక్షణ కార్యక్రమాలు రూపొందించి స్వయం మరియు ఎన్ఆర్సీ ద్వారా ఆన్లైన్ యందు అందుబాటులో ఉంచుతారు.
ఈ శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసిన వారికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఏడాదికోసారి అర్పిట్ పరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణత అయిన వారికి యూజీసీ గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ అందజేస్తారు. దీన్ని సదురు అభ్యర్థులు తమ టీచింగ్ కెరీర్ పురోగతికి ఉపయీగించుకోవచ్చు.
నాన్-టీచింగ్ లెర్నర్లకు కూడా స్వయం పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ అందజేస్తారు. భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2018 లో అర్పిట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దేశంలో ఉన్న దాదాపు 15 లక్షల ఉన్నత విద్యా బోధన సిబ్బంది ఈ ప్రోగ్రాంలో పాల్గున్నారు. 31 మార్చి 2019లో మొదటి సారి ఈ పరీక్షా 75 సబ్జెక్టులకు సంబంధించి నిర్వహించారు.
అర్పిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం 2023
Exam Name | ARPIT EXAM 2023 |
Exam Type | Qualifying |
Exam Date | - |
Exam Duration | 180 Minutes |
Exam Level | National Level |
అర్పిట్ ఎగ్జామ్ వివరాలు
అర్పిట్ ప్రోగ్రాం 2023 షెడ్యూల్
దరఖాస్తు తేదీ | - |
అడ్మిట్ కార్డు | - |
ఎగ్జామ్ | - |
రిజల్ట్స్ | - |
అర్పిట్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు
హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లలో బోధనా సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నవారు. ఈ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫీజు చెల్లించనక్కరలేదు. వీరు వృత్తి పరమైన ఫ్యాకల్టీ ఐడి ప్రూఫ్ / నియామకం లేఖ / తాజా పే స్లిప్ లేదా ప్రమోషన్ ఆర్డర్ లలో ఏదో ఒకటి అందజేయాల్సి ఉంటుంది. నాన్-ఫ్యాకల్టీ లెర్నర్ ఈ క్రింది నిర్ణహించిన రిజిస్ట్రేషన్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ కేటగిరి | దరఖాస్తు ఫీజు |
జనరల్ కేటగిరి | 1000/- |
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు | 500/- |
అర్పిట్ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ |
చీరాల, తిరుపతి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం | హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ |
అర్పిట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
అర్పిట్ ఎగ్జామ్ పోర్టల్ యందు ప్రస్తుతం 48 కోర్సులకు మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న కోర్సు సంపూర్ణగా పూర్తిచేశాక NTA అర్పిట్ ఎగ్జామ్ వెబ్సైటులో ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏడాదికోసారి నిర్వహిస్తారు. పరీక్షా వరుస రెండు స్లాట్'ల్లో జరుపుతారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో అర్పిట్ ఎగ్జామ్ (www.ntaarpit.nic.in) అధికారిక వెబ్సైటు ద్వారా చేసుకోవాలి.
మొదట మొబైల్ మరియు మెయిల్ ఐడీతో అకౌంట్ క్రీయేట్ చేసుకోవాలి. తర్వాత దశలో మీ వ్యక్తిగత సమాచారం, కాలేజీ సమాచారం మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తర్వాత మీరు పూర్తిచేసిన కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీకు అందుబాటులో ఉండే ఎగ్జామ్ స్లాట్ మరియు పరీక్షా కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ప్రతి అభ్యర్థి మూడు ఆప్షన్ పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది.
అర్పిట్ ఎగ్జామ్ నమూనా
అర్పిట్ ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 100 ప్రశ్నలతో 100 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాధానాలు కలిగిఉంటుంది. ఇందులో ఒక సరైన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు ఇవ్వబడుతుంది. పరీక్షా రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఈ రెండు షిఫ్టులలో రెండు స్లాట్లు అందుబాటులో ఉంటాయి.
అర్పిట్ ఎగ్జామ్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
ఆప్షనల్ సబ్జెక్టు | 100 | 100 | 3 గంటలు |
అర్పిట్ ఎగ్జామ్ ఫలితాలు మరియు గ్రేడింగ్
అర్పిట్ ఎగ్జామ్ పూర్తియిన వారం నుండి పది రోజుల్లో నేషనల్ టీసింగ్ ఏజెన్సీ వెబ్సైటులో పలితాలు అందుబాటులో ఉంటాయి. పరీక్షలో అర్హుత సాధించాలంటే 50 శాతం దాటి మార్కులు సాధించాలి. 50 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికీ E గ్రేడ్ కేటాయిస్తారు. E గ్రేడ్ వచ్చిన అభ్యర్థులను అనర్హులుగా భావిస్తారు. 50 శాతం దాటి మార్కులు సాధించిన అభ్యర్థులకు అర్పిట్ ఎగ్జామ్ సర్టిఫికెట్ అందజేస్తారు.