Advertisement
ఐడిబిఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ : స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి
Student Loans

ఐడిబిఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ : స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి

ఐడిబిఐ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయండి. ఐడిబిఐ బ్యాంకు ఆకర్షణీయమైన విద్యా రుణాలను దేశీయ మరియు విదేశీ ఉన్నత చదువుల కోసం ఆఫర్ చేస్తుంది. 50 వేల కనీస మొత్తం నుండి గరిష్టంగా 30 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు.

యూజీ మరియు పీజీకి సంబంధించి అన్ని రకాల విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల రుణ పథకాలు ఐడిబిఐ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన డాక్యుమెంటేషన్, అన్ని రకాల కోర్సుల కవరేజీ వంటి అద్భుత ఫీచర్లతో ఈ బ్యాంకు విద్యా లోన్లను ఆఫర్ చేస్తుంది.

ఐడిబిఐ ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తు విధానం

ప్రస్తుతం విద్యా రుణాలు అన్నీ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సదురు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి, విద్యార్థి అర్హుతను నిర్ణహిస్తారు. అర్హుత పొందిన విద్యార్థులకు 10 నుండి 15 రోజులలో లోన్ మంజూరు చేస్తారు.

రెండవ విధానంలో విద్యార్థులు నేరుగా దగ్గరలో ఉండే ఐడిబిఐ బ్యాంక్ బ్రాంచుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రాంచు మేనేజర్ లేదా లోన్ సెక్షన్ అధికారులను కలవడం ద్వారా ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి పూర్తి వివరాలు అందజేస్తారు. మీరు అర్హులైతే సంబంధిత సర్టిఫికెట్లు సేకరించి, పరిశీలించి విద్యా రుణనాన్ని మంజూరు చేస్తారు.

ఐడిబిఐ ఎడ్యుకేషన్ లోన్ కోసం జత చేయాల్సిన ధ్రువపత్రాలు

  • చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
  • మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
  • ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
  • చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్‌ ఫోటోలు.
  • విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
  • నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ లాంటివి జత చేయాలి.
  • విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, గ్యాప్ సర్టిఫికేట్, జీఆర్ఈ, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్, శాట్ పరీక్షలలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.

1. నాన్ ఒకేషనల్ కోర్సుల ఐడిబిఐ ఎడ్యుకేషన్ లోన్

Loan Amount Need Based. దేశీయ విద్యార్థులకు గరిష్టంగా 20 లక్షల వరకు, విదేశీ విద్యార్థులకు గరిష్టంగా 30 లక్షల వరకు విద్యా రుణాలను అందిస్తుంది.
Courses Covered దేశీయంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో ఫుల్ టైమ్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులు. అలానే పార్ట్ టైమ్ రీసెర్చ్ & ఇతర సర్టిఫికేటెడ్ కోర్సులకు కూడా ఈ ఋణం మంజూరు చేస్తారు. అలానే విదేశీ ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లలో అందుబాటులో ఉండే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్ కోర్సులు, CIMA (London) CPA (USA) అందించే కోర్సులు కూడా.
Expenses Covered
  • పూర్తి ట్యూషన్ ఫీజు & హాస్టల్ రుసుములు
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు
  • పుస్తకాలు / పరికరాల కొనుగోలు
  • కాషన్  డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
  • కంప్యూటర్ / ల్యాప్‌టాప్ కొనుగోలు.
  • విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులు.
Interest Rate 7.30 % నుండి 9.30% (మహిళా విద్యార్థులకు 0.50% రాయితీ అందిస్తారు)
Processing Charges Not specified
Margin Not specified
Security 4 లక్షల లోపు రుణాలకు విద్యార్థి ఉంటె సరిపోతుంది. 4 నుండి 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రుల హామీతో అందిస్తారు. 7.5 లక్షలకు మించే రుణాలకు స్పష్టమైన పూచీకత్తులు సమర్పించాలి.
Repayment రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల నిడివిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

2. మానేజ్మెంట్ కోటా విద్యార్థుల కోసం ఐడిబిఐ ఎడ్యుకేషన్ లోన్

Loan Amount గరిష్టంగా 10 లక్షల రూపాయలు.
Courses Covered UGC/ Govt. / AICTE/ AIBMS/ ICMR గుర్తింపు పొందిన ఉద్యోగ ఆధారిత కోర్సులు.
Expenses Covered
  • కళాశాల / పాఠశాల / హాస్టల్‌కు చెల్లించాల్సిన రుసుము.
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల రుసుము.
  • విదేశాలలో చదువుకోవడానికి ప్రయాణ ఖర్చులు / పాసేజ్ డబ్బు.
  • కాషన్ డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
  • కంప్యూటర్ / ల్యాప్‌టాప్ కొనుగోలు. విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులు.
Interest Rate Up to 10% PA
Processing Charges మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 1,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు.
Margin 15% మార్జిన్ వర్తింపజేస్తారు.
Security 7.5 లక్షల లోపు రుణాలకు విద్యార్థి మరియు తల్లిదండ్రుల హామీ ఉంటె సరిపోతుంది. 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రుల హామీతో పాటుగా 3rd పార్టీ హామీ తప్పనిసరి.
Repayment రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

3. స్పెషలైజెడ్ కోర్సుల కోసం ఐడిబిఐ ఎడ్యుకేషన్ లోన్

Loan Amount Need Based. గరిష్టంగా 20 లక్షల వరకు
Courses Covered ఐటీఐ, పాలిటెక్నిక్, ఐఐటి, ఎన్ఐటి లు అందించే టెక్నికల్ కోర్సులు మరియు సర్టిఫికెట్ కోర్సులు.
Expenses Covered
  • పూర్తి ట్యూషన్ ఫీజు & హాస్టల్ రుసుములు
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు
  • పుస్తకాలు / పరికరాల కొనుగోలు
  • కాషన్  డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
  • విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులు.
Interest Rate Up to 10 PA.
Processing Charges Not specified
Margin Not specified
Security 4 లక్షల లోపు రుణాలకు విద్యార్థి ఉంటె సరిపోతుంది. 4 నుండి 7.5 లక్షలు దాటే రుణాలకు తల్లిదండ్రుల హామీతో అందిస్తారు. 7.5 లక్షలకు మించే రుణాలకు స్పష్టమైన పూచీకత్తులు సమర్పించాలి.
Repayment రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 ఏళ్ల నిడివిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

4. ఐడిబిఐ స్కిల్ లోన్ స్కీమ్

Loan Amount గరిష్టంగా 50 వేల నుండి  లక్ష ఏభైవేల రూపాయలు.
Courses Covered ITIs, NSDC, NSQF India / State Governments అందించే నైపుణ్యాభివృది కోర్సులు.
Expenses Covered
  • కళాశాల / పాఠశాల / హాస్టల్‌కు చెల్లించాల్సిన రుసుము.
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల రుసుము.
  • విదేశాలలో చదువుకోవడానికి ప్రయాణ ఖర్చులు / పాసేజ్ డబ్బు.
  • కాషన్ డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
Interest Rate Up to 10% PA
Processing Charges మంజూరు చేసిన లోనులో 1% (కనిష్టంగా 1,000/-). దీన్ని తిరిగి విద్యార్థికి చెల్లిస్తారు.
Margin 15% మార్జిన్ వర్తింపజేస్తారు.
Security విద్యార్థి తల్లిదండ్రుల హామీ తప్పనిసరి.
Repayment రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 10 ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

Post Comment