స్వయం సెమిస్టర్ ఎగ్జామ్స్ 2023 : స్వయం ఆన్‌లైన్ సర్టిఫికేషన్
Admissions NTA Exams

స్వయం సెమిస్టర్ ఎగ్జామ్స్ 2023 : స్వయం ఆన్‌లైన్ సర్టిఫికేషన్

డిజిటల్ విప్లవం ప్రారంభమయ్యాక మానవునికి సంబందించిన అన్ని విషయాల్లో సమూలమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవే మార్పులు విద్యార్థి చదువులకు కూడా వర్తిస్తాయి. గత పదేళ్ల కాలాన్ని మనం స్పష్టంగా గమనిస్తే ఈ మార్పును ఆస్వాదించొచ్చు.

రాతపరీక్షలు నుండి ఆన్‌లైన్ ఆధారిత పరీక్షలకు, తరగతి పాఠాల నుండి డిజిటల్ తరగతులకు అలానే ఇనిస్టిట్యూషనల్ కోచింగులు నుండి ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్ పోర్టల వైపు విద్యార్థి గమనం మారింది. ఈ మార్పును, ఈ అవసరాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆవైపుగా అడుగులు వేచింది.

స్టడీ వెబ్ ఆఫ్ యాక్టీవ్ లెర్నింగ్ బై యంగ్ అండ్ యాస్పైరింగ్ మైండ్స్ (SWAYAM). భారత విద్య విధానంలో మార్పులు కల్పించేందుకు, ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించేందుకు మరియు ఉన్నత చదువులు అందరికి అందుబాటులో ఉంచేందుకు యాక్సెస్, ఈక్విటీ మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ నినాదంతో ఈ స్వయం ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్ పోర్టలును 2016 లో భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

దేశ వ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా అనుభవిజ్ఞులైన బోధనా సిబ్బందితో విద్యార్థులకు అవసరమయ్యే అన్ని విధాలైన కోర్సులను రూపొందించింది. ప్రస్తుతం స్వయం వేదికలో 9వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు 80 వేల గంటల నిడివితో దాదాపు 2000 పైగా ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

స్వయం ఆన్‌లైన్ కోర్సులు AICTE, NPTL, UGC, CEC, NCERT, NIOS, IGNOU, IIMB మరియు NITTTR వంటి తొమ్మిది జాతీయ విద్య సంబంధిత సంస్థల సమన్వయంతో నిర్వహించబడుతున్నాయి. ఈ కోర్సులకు ఈ సంస్థల గుర్తింపు ఉంటుంది. SWAYAM ప్రస్తుతం 169 కోర్సులకు భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో కోర్సులు సంపూర్ణగా పూర్తిచేసిన వారికీ పరీక్షలు నిర్వహించి అర్హుత సర్టిఫికెట్లు అందిస్తుంది.

అంతే కాకుండా ఇక్కడ సాధించిన మార్కులు, గ్రేడులను విద్యార్థి అకాడమిక్ రికార్డులతో జత చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన వారికీ "యూజీసీ క్రెడిట్ ఫ్రేంవర్క్" పద్దతిలోనే గ్రేడ్లు ఇవ్వబడతయి, వీటికి దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు ఆమోదిస్తాయి.

స్వయం సెమిస్టర్ ఎగ్జామ్స్ 2023

Exam Name SWAYAM EXAM 2023
Exam Type Academic Qualifying
Exam Date NA
Exam Duration 180 Minutes
Exam Level National Level

స్వయం ఎగ్జామ్స్ వివరాలు

స్వయం 2023 సెమిస్టరు తేదీలు

 దరఖాస్తు తేదీ NA
అడ్మిట్ కార్డు NA
ఎగ్జామ్ NA
రిజల్ట్స్ NA

స్వయం ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు

రిజర్వేషన్ కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి 1000/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు 500/-

స్వయం ఎగ్జామ్ కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
తిరుపతి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

స్వయం ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

స్వయం పోర్టల్ యందు ప్రస్తుతం 169 కోర్సులకు మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న కోర్సు సంపూర్ణగా పూర్తిచేశాక SWAYAM వెబ్సైటులో ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏడాదికోసారి నిర్వహిస్తారు. పరీక్షా వరుస రెండు రోజుల్లో 4 స్లాట్'ల్లో జరుపుతారు. అభ్యర్థి నాలుగు కోర్సులకు సంబంధించి హాజరయితే నాలుగు స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో SWAYAM అధికారిక వెబ్సైటు ద్వారా చేసుకోవాలి. మొదట మొబైల్ మరియు మెయిల్ ఐడీతో అకౌంట్ క్రీయేట్ చేసుకోవాలి. తర్వాత దశలో మీ వ్యక్తిగత సమాచారం, కాలేజీ సమాచారం మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తర్వాత మీరు పూర్తిచేసిన కోర్సును ఎంపిక చేసుకోవాలి.

ఆ తర్వాత మీకు అందుబాటులో ఉండే ఎగ్జామ్ స్లాట్ మరియు పరీక్షా కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి మూడు ఆప్షన్ పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది.

స్వయం ఎగ్జామ్స్ నమూనా

స్వయం పరీక్ష ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 100 ప్రశ్నలతో 100 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాధానాలు కలిగిఉంటుంది. ఇందులో ఒక సరైన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు ఇవ్వబడుతుంది. పరీక్షా రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఈ రెండు షిఫ్టులలో రెండు స్లాట్లు అందుబాటులో ఉంటాయి.

SWAYAM ఎగ్జామ్ ప్రశ్నలు మార్కులు సమయం
ఆప్షనల్ సబ్జెక్టు 100 100 3 గంటలు

స్వయం ఎగ్జామ్ పలితాలు & గ్రేడింగ్

స్వయం పరీక్ష పూర్తియిన వారం నుండి పది రోజుల్లో నేషనల్ టీసింగ్ ఏజెన్సీ వెబ్సైటులో పలితాలు అందుబాటులో ఉంటాయి. పరీక్షలో అర్హుత సాధించాలంటే 50 శాతం దాటి మార్కులు సాధించాలి. 50 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికీ E గ్రేడ్ కేటాయిస్తారు. E గ్రేడ్ వచ్చిన అభ్యర్థులను అనర్హులుగా భావిస్తారు. 50 శాతం దాటి మార్కులు సాధించిన అభ్యర్థులకు స్వయం సర్టిఫికెట్ అందజేస్తారు.arpit

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి

Contact No. : 18001219025
Email : support@swayam.gov.in

Post Comment