Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 30 ఆగస్టు 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 30 ఆగస్టు 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 30 ఆగష్టు 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. ఇవి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

ఎన్‌టి రామారావు స్మారక నాణాన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దిగ్గజ తెలుగు నటుడు మరియు అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు (ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 ఆగస్టు 29న స్మారక నాణాన్ని విడుదల చేశారు. వేడుక న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

వెండితో రూపొందించిన ఈ 100 రూపాయల కాయిన్ ముందు వైపు ఎన్టీఆర్ చిత్రపటాన్ని మరియు వెనుకవైపు అశోకచక్రాన్ని కలిగి ఉంది. ఈ మొదటి కాయిన్ ఏపీ బీజేపీ అధ్యక్షరాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి అందుకున్నారు. ఈ కాయిన్ సామాన్య పౌరులకు కూడా పోస్టు ఆఫీసుల ద్వారా పొందే అవకాశం కల్పించారు. ఈ నాణెం మార్కెట్‌లో సాధారణ చలామణి కోసం ఉద్దేశించబడలేదు, అయితే ఎన్టీఆర్‌కు నివాళిగా భద్రపరచడం కోసం విడుదల చేయబడింది.

నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమలో విశేష ప్రజాదరణ సంపాదించుకున్న ఎన్‌టి రామారావు, 1983 లో తెలుగుదేశం పార్టీ (టిడిపి)ని స్థాపించి అదే ఏడాది ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయన 1983 నుండి 1984 వరకు మరియు 1994 నుండి 1999 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కాలిఫోర్నియా అసెంబ్లీలో కుల వివక్ష వ్యతిరేక బిల్లు ఆమోదం

కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ 28 ఆగస్టు 2023న కుల ఆధారిత వివక్షను చట్టవిరుద్ధం చేసే ఎస్‌బి 403 బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు కుల వివక్షను ఎదుర్కోవడానికి మరియు అట్టడుగు వర్గాలకు రక్షణను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశంలో ఉద్భవించిన సామాజిక కుల వ్యవస్థ ఆధారంగా ఎవరైనా వివక్ష చూపడాన్ని ఈ చట్టవిరుద్ధం చేస్తుంది. భారత సంతతికి చెందిన అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

కాలిఫోర్నియాలోని కుల అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఈ బిల్లు అవసరమని ఆయన అన్నారు. "కాలిఫోర్నియాలో కుల వివక్ష అనేది నిజమైన మరియు విస్తృతమైన సమస్య" అని కల్రా అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విజయం సాధించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. బిల్లు 53-12 ఓట్ల తేడాతో అసెంబ్లీ ఆమోదించింది. ఇది ఇప్పుడు సెనేట్ పరిశీలనకు వెళుతుంది. బిల్లును సెనేట్ ఆమోదించి, గవర్నర్ గావిన్ న్యూసోమ్ సంతకం చేస్తే, కుల వివక్షను ప్రత్యేకంగా నిషేధించే చట్టాన్ని కలిగి ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లో కాలిఫోర్నియా మొదటి రాష్ట్రంగా మారుతుంది.

మురికివాడల నివాసితులకు భూమి హక్కుల పత్రాలను అందజేసిన ఒడిశా ప్రభుత్వం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆ రాష్ట్రంలోని మురికివాడల్లో నివసిస్తున్న 65,000 కుటుంబాలకు భూమి హక్కు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తున్నారు. కళింగ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. మొదటి దశలో, భువనేశ్వర్, కటక్, బెర్హంపూర్, రూర్కెలా మరియు సంబల్‌పూర్‌లోని 875 మురికివాడలకు చెందిన కుటుంబాలకు వీటి పంపిణి జరిగింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో రెండో దశ భూ హక్కుల పంపిణీ జరగనుంది. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని 1010 మురికివాడలను రోడ్లు, ఇంటి వద్ద కుళాయి నీటి సరఫరా, టాయిలెట్ మరియు వీధి దీపాలు వంటి ప్రాథమిక సౌకర్యాలతో బిజు ఆదర్శ కాలనీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ముందుకొచ్చింది. 110 మునిసిపాలిటీలు మరియు న్యాక్‌లలో ఇప్పటికే 1.72 లక్షల కుటుంబాలకు భూమి హక్కులు మంజూరు చేయబడ్డాయి.

తమిళనాడు అల్పాహార పథకం విస్తరణ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిరుక్కువలైలో రాష్ట్ర ప్రభుత్వ అల్పాహార పథకం విస్తరణను ఆగష్టు 25న ప్రారంభించారు. తమిళనాడులోని 1,545 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుండి 5 తరగతులకు చెందిన 1.14 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహార అల్పాహారాన్ని అందించడానికి ఈ పథకం మొదట సెప్టెంబర్ 2022లో ప్రారంభించబడింది. ఈ విస్తరణ వల్ల అదనంగా 15.75 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది, మొత్తం లబ్ధిదారుల సంఖ్య 16.89 లక్షలకు చేరుకుంది.

ఈ పథకం తమిళనాడులోని మొత్తం 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ₹404.41 కోట్లతో అమలు చేయబడుతుంది. అల్పాహారం తృణధాన్యాలు, పప్పులు, పండ్లు మరియు కూరగాయలతో కూడిన పోషకమైన అల్పహారాన్ని విద్యార్థులు తరగతులు ప్రారంభించే ముందు ఉదయం సమయాన అందిస్తారు. పాఠశాల విద్యార్థుల పోషకాహార స్థితిని మెరుగుపరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం దీనిని రూపొందించింది. ఇది విద్యార్థుల హాజరు మరియు అకడమిక్ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని భావిస్తున్నారు.

చిన్న నీటిపారుదల సౌకర్యాలు అమలులో యుపి అగ్రస్థానం

మైనర్ ఇరిగేషన్ పథకాల సంఖ్య పరంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు. జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో 20.86 లక్షల చిన్న నీటిపారుదల పథకాలు అందుబాటులో ఉన్నాయి, ఇది దేశంలోనే అత్యధికం. ఈ జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలు తర్వాత నాలుగు స్థానాలలో నిలిచాయి. అలానే ఉపరితల నీటిపారుదల పథకాల అమలులో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా మరియు జార్ఖండ్‌లు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, ముఖ్యమంత్రి కృషి సించాయ్ యోజన, మరియు ఉత్తరప్రదేశ్ మైనర్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ స్కీమ్ వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు రైతులకు చిన్న నీటిపారుదల నిర్మాణాలు, డగ్‌వెల్‌లు, గొట్టపు బావులు మరియు నీటి ట్యాంకులు నిర్మించడానికి ఆర్థిక సహాయం అందిస్తాయి. ఈ నిర్మాణాల నిర్వహణపై రైతులకు శిక్షణ కూడా అందిస్తున్నారు.

గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ యొక్క 7వ అసెంబ్లీకి కెనడా ఆతిధ్యం

కెనడా ఆగస్టు 22 నుండి 26, 2023 వరకు బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ యొక్క 7వ అసెంబ్లీని నిర్వహించింది. ఇది వాతావరణ మార్పులు, జీవవైవిధ్య నష్టం మరియు కాలుష్యం వంటి పర్యావరణ సవాళ్లను పరిష్కరించే ప్రాజెక్ట్‌లు మరియు ప్రోగ్రామ్‌లకు ఫైనాన్సింగ్ అందించే ప్రపంచ భాగస్వామ్యం.

ఈ సమావేశంలో గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ ఫండ్ ప్రారంభించారు. ఇది రాబోయే ఐదేళ్లలో $1.5 బిలియన్లను సమీకరించే అవకాశం ఉంది. అలానే గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ కోసం కొత్త వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనున్నారు, ఇది రాబోయే నాలుగు సంవత్సరాల్లో దాని పనికి మార్గనిర్దేశం చేస్తుంది. అలానే ఇదే వేదిక ద్వారా స్థానిక ప్రజలు మరియు స్థానిక కమ్యూనిటీలతో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ నిశ్చితార్థాన్ని బలోపేతం చేయడానికి పిలుపు నిచ్చారు.

Post Comment