ప్రభుత్వ పథకాలు | కరెంటు అఫైర్స్ 2022మే
Telugu Current Affairs

ప్రభుత్వ పథకాలు | కరెంటు అఫైర్స్ 2022మే

ఏటా మే 1 వ  తేదీన ఉజ్వల దివస్

భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ఇక ఏటా మే 1 వ తేదీని ఉజ్వల దివస్‌గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంను ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన విజయోత్సవంగా జరుపుకొనున్నారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) అనేది దేశంలోని ప్రతి బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌ని అందించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ పథకంను 1 మే 2016న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Advertisement

మహారాష్ట్ర జైలు ఖైదీల కోసం జివ్హాలా పథకం

మహారాష్ట్రలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కోసం మహారాష్ట్ర జైళ్ల శాఖ కొత్తగా జివ్హాలా అనే క్రెడిట్ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఖైదీలకు వారి జైలు శిక్షలు పూర్తయిన తర్వాత పునరావాసం కల్పించేందుకు రుణ ఆర్థిక సహాయాన్ని అందివ్వనున్నారు. మహారాష్ట్ర జైళ్ల శాఖ మరియు మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా అమలు చేయబడనున్న ఈ పథకాన్ని మే 1 న పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ప్రారంభించారు.

హర్యానా పశుగ్రాసం పెంపకందారుల కోసం కొత్త పథకం

హర్యానా వ్యవసాయ మంత్రి జై ప్రకాష్ దలాల్, పశుగ్రాసం పెంపకందారుల కోసం కొత్తగా 'చార-బీజే యోజన ' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 10 ఎకరాల వరకు పశుగ్రాసం పెంచే రైతులకు మరియు గోశాలలు నిర్వహించే రైతులకు ఎకరాకు 10 వేల వరకు ఆర్థికసాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా పరస్పర అంగీకారంతో రైతుల నుండి ప్రశుగ్రాసంతో పాటుగా ఆవు పేడతో రూపొందించిన సేంద్రియ ఎరువులను ప్రభుత్వం సేకరించనుంది.

యుపిలోని రాంపూర్‌లో మొదటి 'అమృత్ సరోవర్' ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని పట్వాయ్‌లో భారతదేశంలోని మొట్టమొదటి "అమృత్ సరోవర్"ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులు ఉండాలని, వాటిని ‘అమృత్ సరోవర్’ అని పిలువాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా నిర్మించిన మొదటి "అమృత్ సరోవర్" రాంపూర్‌లోని పట్వాయ్‌లో ప్రారంభమైంది.

గతిశక్తి సంచార్ పోర్టల్‌ ప్రారంభం

దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సార్వత్రిక మరియు సమానమైన యాక్సెస్ కోసం, ప్రభుత్వం “గతిశక్తి సంచార్” పోర్టల్‌ను ప్రారంభించింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ-2లో ఊహించిన విధంగా “అందరికీ బ్రాడ్‌బ్యాండ్” లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు అడుగులు వేస్తుంది. ఈ పోర్టల్‌ను ఎంపీ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.

నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కోర్సులు ప్రారంభం

వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్ శిక్షణ కోసం శిక్షకుల కేడర్‌ను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కోర్సులను ప్రారంభించినట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతలలోని ఆసుపత్రులు & అంబులెన్స్ సేవల అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ NELS కోర్సు కోసం శిక్షణా పాఠ్యాంశాలు & మాడ్యూళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు మరియు పారామెడిక్స్‌, వైద్య అత్యవసర పరిస్థితుల నుండి మరణాలను తగ్గించేందుకు పనిచేస్తారు.

ఇందులో భాగంగా విపత్తు సంసిద్ధత మరియు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో అత్యవసర వైద్య ప్రతిస్పందన విభాగాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో సర్జికల్ ఎమర్జెన్సీలు, కార్డియాక్ ఎమర్జెన్సీలు, రెస్పిరేటరీ ఎమర్జెన్సీలు, ప్రసూతి అత్యవసర పరిస్థితులు, పిల్లల అత్యవసర పరిస్థితులు, పాము కాటు, విషప్రయోగం మరియు ఇతర వైద్య అత్యవసర పరిస్థితులు అన్నీ కవర్ చేయబడతాయి. అలానే ఆరోగ్య సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్యంను అప్గ్రేడ్ చేసేందుకు దేశవ్యాప్తంగా 120 ఆరోగ్య నైపుణ్యాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు సంసిద్ధం

ప్రఖ్యాత కాటన్ మ్యాన్ సురేష్ భాయ్ కోటక్ అధ్యక్షతన కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . కౌన్సిల్‌కు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు కాటన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు టెక్స్‌టైల్స్, వ్యవసాయం, వాణిజ్యం మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖల నుండి ప్రాతినిధ్యం ఉంటుందని కేంద్ర జౌళి, వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ హక్కులను అందించిన రెండవ రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కంగేర్ ఘాటి జాతీయ ఉద్యానవనంలో ఒక గ్రామం యొక్క కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ (CFR) హక్కులను గుర్తించిన దేశంలో రెండవ రాష్ట్రంగా నిలిచింది. దీని ద్వారా ఆ గ్రామ సరిహద్దులోని అటవీ వనరులు, అటవీ సంరక్షణ మరియు నిర్వహణకు సంబంధించి స్థానిక సాంప్రదాయ పద్ధతులను అనుసరించే అధికారాలు ఆ గ్రామసభకు లభిస్తాయి. ఇలాంటి నిర్ణయం ఇదివరకు ఒడిశా ప్రభుత్వం తీసుకుంది. 2016 లో సిమ్లిపాల్ జాతీయ ఉద్యానవనంలోని గ్రామాలకు కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ హక్కులు అందించిన ద్వారా ఈ నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా నిలిచింది.

 

Advertisement

Post Comment