టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2023 | 6వ తరగతి ప్రవేశాలు
Admissions School Entrance Exams

టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2023 | 6వ తరగతి ప్రవేశాలు

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2023 ఏడాదికి సంబంధించి అడ్మిషన్ ప్రకటన వెలువడింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 194 ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి యందు ప్రవేశాలు కల్పిస్తారు. దీనితో పాటుగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 7 నుండి 10వ తరగతి అడ్మిషన్లు కూడా భర్తీచేశారు. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు క్వాలిటీతో కూడిన ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యను పొందేందుకు ఈ రోజే దరఖాస్తు చేసుకోండి.

టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 10 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 15 ఫిబ్రవరి 2023
హాల్ టికెట్ 8  ఏప్రిల్ 2023
పరీక్ష తేదీ (క్లాస్ VII - X) 16 ఏప్రిల్ 2023
పరీక్ష తేదీ (క్లాస్ VI) 16 ఏప్రిల్ 2023
ఫలితాలు 20 మే 2023

టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ ఎలిజిబిలిటీ

  • విద్యార్థుల వయస్సు 10 నుండి 12 ఏళ్ళ మధ్య ఉండాలి. షెడ్యూల్ కులాల వారికీ రెండేళ్ల సడలింపు కల్పిస్తారు.
  • పూర్తి అటెండెన్స్ తో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలల్లో క్లాస్ V చదువుకుని ఉండాలి.
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ విద్యార్థులు 125/- రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  • ఓబీసీ మరియు జనరల్ కేటగిరి విద్యార్థుల దరఖాస్తు రుసుము 200/- రూపాయులుగా నిర్ణహించారు.

టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ రిజిస్ట్రేషన్

అర్హుత ఉండే విద్యార్థులు టీఎస్ మోడల్ స్కూల్ వెబ్సైటు (https://telanganams.cgg.gov.in) నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైటు ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించి, దానికి సంబంధించిన జర్నల్ నెంబర్ పొందాల్సి ఉంటుంది. ఆ జర్నల్ నెంబర్ సహాయంతో తర్వాత దశ దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తులో విద్యార్థి విద్య, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చి, వాటికీ సంబంధించిన ధ్రువపత్రాలు సూచించిన ఫార్మేట్ యందు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తిఅయ్యాక ఒక ప్రింట్ కాపీ తీసుకుని భద్రపర్చాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఉన్న దరఖాస్తుదారులకు పరీక్ష తేదికి 10 రోజుల ముందు వెబ్సైటులో హాల్ టిక్కెలు అందుబాటులో ఉంచుతారు.

టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ నమూనా (క్లాస్ VI)

క్లాస్ VI ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల కోసం ఆబ్జెక్టివ్ విధానములో పెన్ మరియు పేపర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నపత్రం క్లాస్ V స్థాయి సిలబస్ తో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ & సోషల్ సంబంధిత అంశాలతో నిర్వహిస్తారు.

ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. వాటిలో నుండి సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు.

సబ్జెక్టు ప్రశ్నలు (100) మార్కులు (100) సమయం
తెలుగు
ఇంగ్లీష్
మ్యాథమెటిక్స్
జనరల్ సైన్స్ & సోషల్
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 మార్కులు
25 మార్కులు
25 మార్కులు
25 మార్కులు
2 గంటలు

టీఎస్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ నమూనా (క్లాస్ VII to క్లాస్ X)

క్లాస్ VII నుండి క్లాస్ X ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల కోసం కూడా స్వల్ప మార్పులతో ఆబ్జెక్టివ్ విధానములో పెన్ మరియు పేపర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా 2 గంటల నిడివితో 100 మార్కులకు జరుపుతారు. ప్రశ్నపత్రం విద్యార్థి ప్రస్తుతం పూర్తిచేసిన అకాడమిక్ స్థాయి సిలబస్ నుండి ఇవ్వబడుతుంది.

ప్రశ్నలు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ & సోషల్ సంబంధిత అంశాలతో ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. వాటిలో నుండి సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు.

సబ్జెక్టు ప్రశ్నలు (100) మార్కులు (100) సమయం
ఇంగ్లీష్
మ్యాథమెటిక్స్
జనరల్ సైన్స్
సోషల్ స్టడీస్
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
25 మార్కులు
25 మార్కులు
25 మార్కులు
25 మార్కులు
2 గంటలు

టీఎస్ మోడల్ స్కూళ్ళ వివరాలు

విద్య పరంగా వెనకబడిన మండలాల్లో  2013-14 విద్య సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం టీఎస్ మోడల్ స్కూళ్లను ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 194 ఆదర్శ పాఠశాలలు నెలకొల్పింది. గ్రామీణ వెనకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు క్లాస్ VI నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తిస్థాయి క్వాలిటీతో కూడిన ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యను అందిస్తుంది.

వీటితో పాటుగా జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తారు. ఈ స్కూళ్లలో ప్రవేశాలు ఏటా ఏప్రిల్ మరియు జూన్ నెలలో నిర్వహిస్తారు. అడ్మిషన్లు ప్రవేశ పరీక్షా ఆధారంగా చేపడతారు. క్లాస్ V వరకు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకు ఒక నెల బ్రిడ్జ్ కోర్సు నిర్వహించి తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి ప్రవేశపెడతారు.

టీఎస్ మోడల్ స్కూళ్లలో ప్రతి తరగతికి సంబంధించి 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రవేశాలు కేవలం క్లాస్ VI మరియు ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి మాత్రమే నిర్వహిస్తారు. మిగతా తరగతులకు ఆయా తరగతులలో ఖాళీ అయినా సీట్ల సంఖ్యఆధారంగా అడ్మిషన్ సమయంలో నిర్ణయం తీసుకుంటారు.

ప్రవేశ పరీక్షా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూళ్లలో మాత్రమే పరీక్షా నిర్వహిస్తారు. తుది ఎంపిక ప్రవేశ పరీక్షా మెరిట్ మరియు రిజర్వేషన్ కోటాల ఆధారంగా ఉంటుంది.

వివిధ కేటగిర్ల వారి రిజర్వేషన్ల కోటా

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఎస్సీ కేటగిరి 15 శాతం
ఎస్టీ కేటగిరి 6 శాతం
ఓబీసీ కేటగిరి 29 శాతం
జనరల్ కేటగిరి 50 శాతం

Post Comment