ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ పథకం : విదేశీ అర్హత పరీక్షల కోసం కోచింగ్
Scholarships

ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ పథకం : విదేశీ అర్హత పరీక్షల కోసం కోచింగ్

ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జిమాట్ వంటి విదేశీ యూనివర్సిటీల అర్హుత పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తారు.

కుటుంబ ఆదాయం రెండు లక్షల లోపు ఉండే విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసేందుకు అర్హులు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏటా జూన్ మరియు అక్టోబర్ నెలలో విడుదల చేస్తారు. అభ్యర్థుల సంఖ్యా ఎక్కువ ఉంటె అర్హుత పరీక్షా నిర్వహిస్తారు.

స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్
స్కాలర్షిప్ టైప్ టోఫెల్ & జిఆర్ఇ, జిమాట్ లకు ఉచిత శిక్షణ
ఎవరికి అందిస్తారు ఎస్సీ విద్యార్థులు
అర్హుత కుటుంబ ఆదాయం 2 లక్షలలోపు

ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ పథకం ఎలిజిబిలిటీ

గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లేదా చివరి ఏడాది చదువవుతున్న ఎస్సీ విద్యార్థులు. కుటుంబ ఆదాయం 2 లక్షలకు మించి ఉండకూడదు.

ఏపీ స్కిల్ అప్‌గ్రేడేషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ

అర్హుత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల అయ్యే సమయంలో, జన్మభూమి పోర్టల్'లో ఉండే స్కిల్ అప్‌గ్రేడేషన్ ట్యాబ్ వద్ద వుండే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు విజయవంతంగా సబ్మిట్ చేసాక, సంబంధిత వివరాలతో కూడిన గుర్తింపు నెంబర్ జెనెరేట్ అవుతుంది.

ఈ నెంబర్ సహాయంతో సంబంధిత పోర్టల్'లో లాగిన్ అవ్వడం ద్వారా మీకు నచ్చే కోచింగ్ సెంటరును ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంను ప్రభుత్వం అమలు చేయటలేదు.

Post Comment