పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 1 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు
Study Material Telugu Gk

పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 1 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు

పరమాణు నిర్మాణం సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను సాధన చేయండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. పరమాణు నిర్మాణం అనేది న్యూక్లియస్ (కేంద్రం)తో కూడిన అణువు యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది, దీనిలో ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థంగా ఉండే న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణువు యొక్క బయటి ప్రాంతాలను ఎలక్ట్రాన్ షెల్స్ అని పిలుస్తారు. వీటిలో ఋణాత్మక ఎలక్ట్రాన్‌లు ఉంటాయి.

Advertisement

1. ఎలక్ట్రాన్ (e), ప్రోటాన్ (p), న్యూట్రాన్ (n), ఆల్ఫా కణముల (a), విశిష్టావేశము విలువలు పెరిగే క్రమము ?

  1. e, p , n , a
  2. n , p , e , a
  3. n , a , p , e
  4. n , p , a , e
సమాధానం
3. n , a , p , e 

2. ఈ క్రింది ఒక దానిలో కాటయన్ మరియు ఆనయాన్ సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్ లను  కలిగి వుంటాయి ?

  1. CaO
  2. KBr
  3. NaF
  4. MgS
సమాధానం
3. NaF 

3. లిథియం నైట్రైడ్ లోని నైట్రైడ్ నందు గల అయాన్ లో ఉండునవి  ?

  1. 7 ప్రోటానులు + 7 ఎలక్ట్రానులు
  2. 10 ప్రోటానులు + 7 ఎలక్ట్రానులు
  3. 7 ప్రోటానులు + 10 ఎలక్ట్రానులు
  4. 10 ప్రోటానులు + 10 ఎలక్ట్రానులు
సమాధానం
3. 7 ప్రోటానులు + 10 ఎలక్ట్రానులు   

4. ఒక పరమాణువు యొక్క Z మరియు A విలువలు 25 మరియు 55 , దాని స్థిరమైన అయాన్ లోని ఎలక్ట్రాన్ , ప్రోటాన్  మరియు న్యూట్రాన్ ల  సంఖ్యలు ?

  1. 25 , 25 , 30
  2. 23 , 25 , 30
  3. 22 , 25 , 30
  4. 20 , 25 , 30
సమాధానం
2. 23 , 25 , 30   

5. ఒక పరమాణువునకు 17 ప్రోటాన్లు మరియు 18 ఎలక్ట్రానులు గలవు అయితే దీని అవేశము ఎంత ?

  1. -1
  2. -2
  3. 0
  4. +1
సమాధానం
1. -1   

6. ఫోటాన్ యొక్క e / m విలువ ఎంత ?

  1. ఎలక్ట్రాన్ e /m  విలువ కంటే తక్కువ
  2. ఎలక్ట్రాన్ e /m  విలువతో సమానం
  3. ఎలక్ట్రాన్ e /m  విలువ కంటే ఎక్కువ
  4. పైవన్నియు
సమాధానం
1. ఎలక్ట్రాన్ e /m  విలువ కంటే తక్కువ  

7. ఉత్సర్గనాళములోని కేథోడ్ కిరణాల విక్షేపణ తీవ్రత ఎప్పుడు ఎక్కువుగా ఉంటుంది ?

  1. కణావేశము  ఎక్కువుగా ఉన్నప్పుడు
  2. విద్యుత్ మరియు అయస్కాంతకేత్రములతో సంబంధము ఉన్నప్పుడు
  3. కణము యొక్క ద్రవ్యరాశి తక్కువు గా ఉన్నప్పుడు
  4. పైవన్నియు
సమాధానం
4.పైవన్నియు 

8. న్యూక్లియాన్లు అనగా ?

  1. ప్రోటాన్లు
  2. న్యూట్రాన్లు
  3. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు
  4. ఎలక్ట్రాన్లు , ప్రోటాన్లు , న్యూట్రాన్లు
సమాధానం
3. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు   

9. ఆర్గాన్ పరమాణువుతో సమ ఎలక్ట్రాన్ విన్యాసము కలిగి ఉండని అయాన్  ?

  1. క్లోరైడ్ అయాన్
  2. కాల్షియం అయాన్
  3. సల్ఫయిడ్ అయాన్
  4. సోడియం అయాన్
సమాధానం
4. సోడియం అయాన్ 

10. ఎలక్ట్రాన్ ఆవేశమును కనుగొన్నవారు ?

  1. జె . జె థామ్సన్
  2. ముల్లికన్
  3. క్రూక్స్
  4. చాడ్విక్
సమాధానం
1. జె .జె  థామ్సన్   

11. న్యూట్రాన్ లను కనుగొన్నవారు ?

  1. జె . జె థామ్సన్
  2. గోల్డస్టీన్
  3. క్రూక్స్
  4. చాడ్విక్
సమాధానం
4. చాడ్విక్   

12. ఉత్సర్గనాళములో ఏ వాయువును తీసుకున్నప్పుడు ఆనోడ్ కిరణాల e /m  విలువ అత్యధికంగా ఉండును ?

  1. హీలియం
  2. హైడ్రోజన్
  3. ఆక్సీజెన్
  4. నియాన్
సమాధానం
2. హైడ్రోజెన్   

13. ఆవర్తన పట్టికలో అతి తేలికైన ఐసోటోప్  ?

  1. ట్రిటియం
  2. డ్యూటీరియం
  3. ప్రోటియం
  4. పైవన్నియు
సమాధానం
3. ప్రోటియం 

14. ఆవర్తన పట్టికలో అతి తేలికైన  రేడియోధార్మిక ఐసోటోప్ ?

  1. ట్రిటియం
  2. డ్యూటీరియం
  3. ప్రోటియం
  4. పైవన్నియు
సమాధానం
1. ట్రిటియం 

15. ఐసోటోప్ లు ప్రదర్శించు ఒకే రకమైన ధర్మాలు ?

  1. భౌతిక ధర్మాలు
  2. రసాయనిక ధర్మాలు
  3. భౌతిక మరియు రసాయనిక ధర్మాలు
  4. పైవేవీ కాదు
సమాధానం
2. రసాయనిక ధర్మాలు 

16. ఐసోటోప్ లు దేనిలో విభేదిస్తాయి  ?

  1. భౌతిక ధర్మాలు
  2. రేడియోధార్మిక ధర్మాలు
  3. ద్రవ్యరాశి
  4. పైవన్నియు
సమాధానం
4. పైవన్నియు 

17. ఐసోటోప్ లను వేరుచేయు విధానము  ?

  1. అట్మలసిస్
  2. వ్యాపన పద్ధతి
  3. విద్యుత్ విశ్లేషణ
  4. 1 & 2 రెండూ
సమాధానం
2. వ్యాపన పద్దతి 

18. ఈ క్రింది వానిలో ఏ మూలకము ఎక్కువ స్థిరమైన ఐసోటోపులను కలిగి ఉన్నది ?

  1. H
  2. O
  3. Sn
  4. S
సమాధానం
3. Sn   

19. ఇసోబారులు దేనిలో విభేదిస్తాయి ?

  1. నూక్లియానులు
  2. ద్రవ్యరాశి సంఖ్య
  3. పరమాణు సంఖ్య
  4. 1 & 3 రెండూ
సమాధానం
4. 1 & 3 రెండూ 

20. హైడ్రోజన్ రేడియోధార్మిక ఐసోటోప్ లో ఉన్న నూట్రానుల సంఖ్య ?

  1. 2
  2. 3
  3. 5
  4. 1
సమాధానం
1. 2 

21. హైడ్రోజన్ ఐసోటోప్ డ్యూటీరియంలో ఉన్న న్యూట్రానుల సంఖ్య ?

  1. 2
  2. 3
  3. 5
  4. 1
సమాధానం
4. 1 

22. హైడ్రోజన్ యొక్క అస్థిరమైన ఐసోటోప్ అయిన ట్రిటియం న్యూక్లియస్ కలిగివున్నవి  ?

  1. 1 ప్రోటాన్ + 1 న్యూట్రాన్
  2. 1 ప్రోటాన్ + 3 న్యూట్రాన్ లు
  3. 1 ప్రోటాన్ + 0 న్యూట్రాన్ లు
  4. 1 ప్రోటాన్  + 2 న్యూట్రాన్ లు
సమాధానం
4. 1 ప్రోటాన్ + 2 న్యూట్రాన్ లు   

23. క్రింది గల వర్ణములలో దేనికి అధిక తరంగ సంఖ్య కలదు  ?

  1. ఎరుపు
  2. నీలము
  3. ఆకుపచ్చ
  4. ఊదారంగు (వయొలెట్ )
సమాధానం
4.ఊదారంగు ( వయొలెట్ ) 

24. అధిక తరంగ దైర్గ్యాల వర్ణపటాలు  ?

  1. శోషణ వర్ణపటం
  2. ఉద్గార వర్ణపటం
  3. X - కిరణాలు
  4. పరారుణ కాంతి
సమాధానం
2.ఉద్గార వర్ణపటం 

25. ప్లాంక్ స్థిరాంకము యొక్క మితులు ?

  1. బలము  x  కాలము
  2. శక్తి  x  దూరము
  3. శక్తి  x  కాలము
  4. శక్తి / కాలము
సమాధానం
3. శక్తి  x  కాలము   

26. కాంతి యొక్క పౌనఃపున్యము పెరుగుతూ ఉంటె , ఫోటాన్ యొక్క ద్రవ్యరాశి ?

  1. పెరుగుతుంది
  2. తగ్గుతుంది
  3. అలాగేఉంటుంది
  4. చెప్పలేం
సమాధానం
1. పెరుగుతుంది   

27. ఈ క్రింది వానిలో కాంతి విద్యుత్ ఫలితాన్ని చూపించునది ?

  1. పొటాషియం
  2. రుబీడియం
  3. క్షారలోహం
  4. సీజియం
సమాధానం
3. క్షారలోహం   

28. క్రిందివానిలో ఏది రేఖ వర్ణపట స్వభావమును కలిగిఉంటుంది ?

  1. పరమాణువులు
  2. అణువులు
  3. ఘనస్థితిలో గల ఏదైనా పదార్థం
  4. ద్రవస్థితిలో గల ఏదైనా పదార్థం
సమాధానం
1. పరమాణువులు   

29. అన్ని రకాలైన విద్యుత్ అయస్కాంత కిరణాలకు సమానముగా ఉండు ధర్మము  ?

  1. తరంగ దైర్గ్యము
  2. పౌనఃపున్యము
  3. శక్తి
  4. వాయువుల ద్వారా ప్రవేశించుట వలన ఏర్పడే వేగము
సమాధానం
4. వాయువుల ద్వారా ప్రవేశించుట వలన ఏర్పడే వేగము 

30. పట్టి వర్ణపటము ఏర్పడడానికి కారణము ?

  1. అణువులు
  2. పరమాణువులు
  3. ఘనస్థితిలో గల ఏదైనా పదార్ధము
  4. ద్రవస్థితిలో గల ఏదైనా పదార్ధము
సమాధానం
1. అణువులు   

Advertisement

Post Comment