ఎడ్‌ఎక్స్ ఉచిత ఆన్‌లైన్ కోర్సులు : 2500+ యూనివర్సిటీ కోర్సులు
Online Education Useful websites

ఎడ్‌ఎక్స్ ఉచిత ఆన్‌లైన్ కోర్సులు : 2500+ యూనివర్సిటీ కోర్సులు

ఎడ్‌ఎక్స్‌ను సాంప్రదాయక ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా అభివర్ణించవచ్చు. ఇది అమెరికా ప్రధాన కేంద్రంగా 2012 లో హార్వర్డ్ యూనివర్సిటీ మరియు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ.

ఎడ్‌ఎక్స్ ఇంజనీరింగ్, సైన్స్ & టెక్నాలజీ, బిజినెస్ & మానేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, హ్యుమానిటీస్ మరియు ఫారీన్ లాంగ్వేజ్స్ సంబంధించి 150 ఇనిస్టిట్యూట్ల నుండి దాదాపు 2500+ పైగా యూనివర్సిటీ స్థాయి ఆన్‌లైన్ కోర్సులను అందిస్తుంది.

ఎడ్‌ఎక్స్ యందు 20 మిల్లియన్లకు పైగా సభ్యులు దాదాపు 100 మిల్లియన్లకు పైగా కోర్సులకు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు.  ఎడ్‌ఎక్స్ దాదాపు అన్ని కోర్సులను పూర్తి ఉచితంగా అందిస్తుంది. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన సభ్యులకు స్వల్ప రుసుము చెల్లింపుతో వెరిఫై చేయబడిన కోర్సు పూర్తిచేసిన ధృవీకరణ పత్రాన్ని అందిస్తుంది.

విద్య నిపుణులు సిపార్సు చేసే ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికల్లో ఎడ్‌ఎక్స్ ముందు వరుసలో ఉండేందుకు ఇదికూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఉన్నత విద్యకు దూరమైనా ఉద్యోగస్తులు, గృహాణిలు వారి కలను నిజం చేసుకునేందుకు ఎడ్‌ఎక్స్ ఉత్తమైన ఎంపికని చెప్పొచ్చు.

ఎడ్‌ఎక్స్ పాపులర్ ఆన్‌లైన్ కోర్సులు

కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్
Azure
Blockchain
C Programming
Devops
Django
Full Stack Development
Html
Java
Javascript
Python
Artificial Intelligence
Big Data
Cloud Computing
Computer Programming
Data Analysis
Data Mining
Machine Learning
Power BI
Python
Quantum Computing
ఇంజనీరింగ్ హ్యుమానిటీస్
Aerospace Engineering
Biomedical Engineering
Chemical Engineering
Civil Engineering
Computer Engineering
Electrical Engineering
Industrial Engineering
Mechanical Engineering
Software Engineering
Structural Engineering
Art
Child Development
Epidemics
Fashion
History
Human Anatomy
Literature
Psychology
Public Speaking
Shakespeare
బిజినెస్ & మానేజ్మెంట్ లాంగ్వేజ్
Business Administration
Business Analysis
Corporate Finance
Economics
Entrepreneurship
Finance
Financial Literacy
Leadership
Project Management
Statistics
Chinese
English
ESL
Grammar
Italian
Japanese
Mandarin
Sign Language
Spanish
Writing

ఎడ్‌ఎక్స్ కీ పాయింట్స్

  • ఎడ్‌ఎక్స్ దాదాపు అన్ని కోర్సులను ఉచితంగా అందిస్తుంది
  • ఎడ్‌ఎక్స్ కోర్సులు హార్వర్డ్, ఎంఐటీ మైక్రోసాఫ్ట్ వంటి 150 పైగా అంతర్జాతీయ ప్రఖ్యాత యూనివెర్సిటీలచే అందించబడుతున్నాయి
  • ఎడ్‌ఎక్స్ కోర్సులు నిర్దిష్ట సమయాల్లో కాకుండా సభ్యులకు అందుబాటులో ఉండే సమయంలో అభ్యసించుకోవచ్చు
  • ఎడ్‌ఎక్స్ కోర్సుల ఎన్రోల్మెంట్ రుసుములు మిగతా డిజిటల్ లెర్నింగ్ వేదికలతో పోల్చుకుంటే చాలా తక్కువ
  • ఎడ్‌ఎక్స్ యూనివర్సిటీ స్థాయి సాంప్రదాయ కోర్సులను అందిస్తుంది
  • ఎడ్‌ఎక్స్ కోర్సులు పూర్తిచేసిన వారికీ స్వల్ప రుసుములు చెల్లించడం ద్వారా కోర్సు పూర్తిచేసిన సర్టిఫికెట్ అందజేస్తారు
  • ఎడ్‌ఎక్స్ అన్ని కోర్సులకు కొన్ని నియమాలకు లోబడి 14 రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ ఇస్తుంది

ఎడ్‌ఎక్స్ కోర్సుల ప్రతికూలతలు

  • ఎడ్‌ఎక్స్ కోర్సులు అన్ని దాదాపు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి
  • ఎడ్‌ఎక్స్ అందించే కొన్ని కోర్సులు నాణ్యత పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నాయి
  • ఎడ్‌ఎక్స్ అందించే కొన్ని కోర్సులు, సబ్జెక్టు లేదా టాపిక్ సంబంధించి పూర్తిస్థాయిలో ఉండవు
  • ఎడ్‌ఎక్స్ అందించే కొన్ని కోర్సులు నూతన పాఠ్యంశాల నవీకరణకు నోచుకోవడం లేదు
  • ఎడ్‌ఎక్స్ అందించే సర్టిఫికెట్ అన్ని విద్య సంస్థలు ప్రామాణికంగా తీసుకోవు

ఎడ్‌ఎక్స్ కోర్సుల ప్రయోజనాలు మరియు ప్రతికూలతలు కొంచెపు పక్కన పెడితే, ఆన్‌లైన్ ద్వారా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే ఆలోచన ఉన్నవారికి ఎడ్‌ఎక్స్ విస్తృతమైన కోర్సుల ఎంపికను అందిస్తుంది.

ఎడ్‌ఎక్స్ కోర్సులను ఎటువంటి సమయం వృధా కాకుండా మీరున్నా చోట నుండే, మీకు అందుబాటులో ఉండే సమయంల్లో నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగ పదోన్నతి కోసం ప్రయత్నించే వారు, నూతన నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే వారు, గృహాణిలు, విద్యార్థులు ఎడ్‌ఎక్స్ ద్వారా మీ కలలను నిజం చేసుకోవచ్చు.