టీఎస్ ఎడ్‌సెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions TS CETs

టీఎస్ ఎడ్‌సెట్ 2024 నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

టీఎస్ ఎడ్‌సెట్ 2024 షెడ్యూల్ వెలువడింది. ఉపాధ్యాలకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చే రెండేళ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. టీఎస్ ఎడ్‌సెట్ 2024 పరీక్షను మే 23వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా తెలంగాణాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు. రెండేళ్ల బీఈడీ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ప్రైవేట్ స్కూళ్లతో పాటుగా, ప్రభుత్వం భర్తీ చేసే ఉపాద్యాయ ఉద్యోగ ప్రకటనల ద్వారా సర్కార్ బడుల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడొచ్చు.

టీఎస్ ఎడ్‌సెట్  2024 పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు మహాత్మ గాంధీ యూనివర్సిటీ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్ష లో మొత్తం 150 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు 150 నిముషాలలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

Exam Name Ts Ed.CET 2024
Exam Type Entrance Exam
Exam For Admission For B.Ed
Exam Date 23/05/2024
Exam Duration 4 hours (2+2)
Exam Level State Level (Telangana)

టీఎస్ ఎడ్‌సెట్ 2024 సమాచారం

టీఎస్ ఎడ్‌సెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • అభ్యర్థులు తెలంగాణకు సంబంధించి స్థానికతను సంతృప్తి పరచాల్సి ఉంటుంది.
  • 50 శాతం మార్కులతో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 40% మాత్రం మార్కులు తప్పనిసరి.
  • 50 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
  • అభ్యర్థులు వయస్సు నోటిఫికేషన్ సమయానికి 19 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు చేసేందుకు యెటువంటి గరిష్ట వయోపరిమితి లేదు.
పార్ట్ C మెథడాలజీ సంబంధించి అర్హుత నియమాలు
మెథడాలజీ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ
మ్యాథమెటిక్స్  మేథ్స్ ఒక సబ్జెక్టుగా B.A./B.Sc ఉత్తీర్ణత లేదా బీటెక్ /B.C.A (ఇంటర్ ఎంపీసీ)
బయాలజీ బయాలజీ ఒక సబ్జెక్టుగా B.Sc./B.Sc హోమ్ సైన్స్ ఉత్తీర్ణత/B.C.A (ఇంటర్ బైపీసీ)
ఫీజికల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లు ఒక సబ్జెక్టుగా B.Sc/బీటెక్/మెటీరియల్ సైన్సెస్
సోషల్ స్టడీస్ ఇంటర్ లో సోషల్ సైన్సెస్ B.A./B.Com./B.B.M. or B.C.A అభ్యర్థులు
ఇంగ్లీష్ BA స్పెషల్ ఇంగ్లీష్/ MA ఇంగ్లీష్

టీఎస్ ఎడ్‌సెట్ 2024 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ 06 మార్చి 2024
దరఖాస్తు చివరి తేదీ 06 మే 2024
హాల్ టికెట్ డౌన్‌లోడ్ మే 2024
పరీక్ష తేదీ 23 మే 2024
ఫలితాలు జూన్ 2024
కౌన్సిలింగ్ జులై 2024
  • పరీక్ష సమయం : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహం 3 నుండి సాయంత్రం 5 వరకు.

టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు ఫీజు

కేటగిరి రిజిస్ట్రేషన్ ఫీజు
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 450/-
జనరల్ కేటగిరి 650/-
  • 250/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ:
  • 500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ:

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేయండి

టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. తెలంగాణ అధికారిక ఎడ్ సెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

టీఎస్ ఎడ్‌సెట్ రీజనల్ పరీక్షా కేంద్రాలు

ఆదిలాబాద్ హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్ వెస్ట్ హైదేరాబద్ ఈస్ట్
హైదరాబాద్ సౌత్-ఈస్ట్ హైదరాబాద్ నార్త్ నల్గొండ కోదాడ
ఖమ్మం, సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్ నగర్ సిద్దిపేట
నిజామాబాదు వరంగల్ నరసంపేట్ కర్నూల్, విజయవాడ

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అడిగిన వివరాలు పూరించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తు పూర్తిచేసే ముందు మీరు ఇచ్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి.

చివరి దశలో మీ దరఖాస్తు ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

టీఎస్ ఎడ్‌సెట్ ఎగ్జామ్ విధానం

టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానం లో నిర్వహించబడుతుంది. ఐదు భాగాలుగా ఉండే టీఎస్ ఎడ్‌సెట్ ప్రశ్నపత్రంలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ I యందు మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల నుండి 20 ప్రశ్నలు చెప్పున, మొత్తం 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

సెక్షన్ II లో టీచింగ్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు, సెక్షన్ III యందు జనరల్ ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు, సెక్షన్ IV యందు జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషన్ ఇష్యూస్ నుండి 30 ప్రశ్నలు అలానే సెక్షన్ V లో 20 కంప్యూటర్ అవెర్నెస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయించబడుతుంది. 150 ప్రశ్నలు 120 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

పార్ట్/సెక్షన్ సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
I మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ 60 (3 x 20) 60
II టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 20
III జనరల్ ఇంగ్లీష్ 20 20
IV జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఇష్యూస్ 30 30
V కంప్యూటర్ అవెర్నెస్ 20 20
150 ప్రశ్నలు 150 మార్కులు

టీఎస్ ఎడ్‌సెట్ క్వాలిఫై మార్కులు

జనరల్ కేటగిరి అభ్యర్థులు టీఎస్ ఎడ్‌సెట్ యందు క్వాలిఫై అవ్వాలంటే 25 శాతం మార్కులు సాధించాలి. 150 మార్కులకు జరిగే పరీక్షలో 38 మార్కులను దాటి సాధించిన వారినే ర్యాంకింగ్ లోకి పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు యెటువంటి కనీస క్వాలిఫై మార్కులు నిర్ణహించలేదు. ఫీజికల్ సైన్సెస్ మరియు మ్యాథమెటిక్స్ మెథడాలజీస్ ఐచ్చికంగా తీసుకునే మహిళా అభ్యర్థులకు కూడా యెటువంటి కనీస అర్హుత మార్కుల నియమం లేదు.

టీఎస్ ఎడ్‌సెట్ యొక్క ర్యాంకింగ్ ప్రక్రియ పరీక్షలో వివిధ భాగాలలో సాధించిన మెరిట్ ను ఆధారంగా చేసుకుని తుది జాభితా తయారు చేస్తారు. ఇందులో పార్ట్ C మెథడాలజీలో అభ్యర్థులు సాధించిన స్కోరు ర్యాంకింగులో ప్రధానపాత్ర వహిస్తుంది.

మూడు పార్టులలో అభ్యర్థుల స్కోరు సమమైతే కౌన్సిలింగ్ సమయంలో అప్పటి పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటారు లేదా అధిక వయస్సు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. సీట్లు కేటాయింపులో 85 శాతం లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం యూనివర్సిటీల నియమాలనుసారం భర్తీచేస్తారు.

Advertisement

Post Comment