అవన్స్ ఫైనాన్షియల్ స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి
Student Loans

అవన్స్ ఫైనాన్షియల్ స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి

అవన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశీయా మరియు  విదేశీ చదువుల కోసం 100% కస్టమైజ్డ్ విద్యా రుణాలను అందిస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుండి విదేశీ ప్రీమియర్ ఇనిస్టిట్యూట్ల వరకు దాదాపు 500 లకు పైగా ప్రీమియర్ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులకు Avanse విద్యా రుణాలను ఆఫర్ చేస్తుంది.

అవన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎటువంటి మార్జిన్ శాతం వర్తింపజేయకుండా, కోర్సు పూర్తిచేసేందుకు అవసరమయ్యే పూర్తి మొత్తాన్ని ఈ సంస్థ విద్యార్థికి అందజేస్తుంది. స్కూల్, కాలేజీ రుణాలతో పాటుగా ఈ లెర్నింగ్ పోర్టల్స్ అందించే జాబ్ ఓరిఎంటేడ్ కోర్సులకు కూడా Avanse లోను మంజూరు చేస్తుంది. ఈ NBFC అందించే వివిధ విద్యా రుణాల కోసం ఇప్పుడు చూద్దాం.

అవన్స్ స్టూడెంట్ లోన్ దరఖాస్తు విధానం

అర్హుత ఉండే విద్యార్థులు అవన్స్ సంస్థ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వార సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల జాయిన్ అయినా కోర్సు, కాలేజీ, ఆర్థిక స్థితి, రీపేమెంట్ షూరిటీ వంటి అంశాలను పరిశీలించి అర్హులైన వారికీ లోన్ మంజూరు చేస్తారు.

దరఖాస్తుతో పాటుగా జత చేయాల్సిన ధ్రువపత్రాలు

  • చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
  • మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్). ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
  • ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు. ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
  • చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు. తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్‌ ఫోటోలు.
  • విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
  • నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్‌ లాంటివి జత చేయాలి.
  • విదేశీ చదువులు : చెలుబాటు అయ్యే పాసుపోర్టు, i20వీసా, అడ్మిషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ అడ్మిట్ లెటర్, Gap certificate, GRE, GMAT, IELTS, TOEFL, SAT లలో ఏదోకటి ఉత్తీర్ణత పొంది ఉండాలి.

1. Study In India Education Loan

An Educational loan that is quick & hassle-free

Loan Amount Need Based. పరిమితి లేదు. కనీస మొత్తం లక్ష రూపాయల నుండి విద్యార్థి కోర్సుకు సంబంధించి పూర్తి ఫీజు మొత్తానికి సరిపడే రుణాన్ని మంజూరు చేస్తారు.
Courses Covered UGC/AICTE/IMC/Govt గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు. అలానే IIT, IIM లలో డిగ్రీ, డిప్లొమా, పార్ట్ టైమ్ రీసెర్చ్ & ఇతర సర్టిఫికేటెడ్ కోర్సులకు కూడా ఈ ఋణం మంజూరు చేస్తారు.
Expenses Covered
  • పూర్తి ట్యూషన్ ఫీజు & హాస్టల్ రుసుములు
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు
  • పుస్తకాలు / పరికరాల కొనుగోలు
  • కాషన్  డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
  • కంప్యూటర్ / ల్యాప్‌టాప్ కొనుగోలు.
  • విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులు.
Interest Rate Up to 12.65% PA
Processing Charges మంజూరు చేసిన లోనులో 1 - 2 % ప్రాసెసింగ్ చార్జీలు వర్తింపజేస్తారు.
Margin Nil
Security రుణ మొత్తానికి సమానమైన పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.
Repayment విద్యార్థి ఆప్షనల్

2. Study Abroad Education Loan

Avanse ఫైనాన్స్ సంస్థ దాదాపు 50 కి పైగా దేశాల్లో, 900 కి పైగా విదేశీ యూనివర్సిటీలలో, 12 వేలకు పైగా కోర్సులలో 100% కస్టమైజ్డ్ విద్యా రుణాలను అందిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం Bridge Loan, Score Based Loan , Pre-Admission Loan, Fast - Track Loan మరియు Certificate of Availability of Funds పేరుతో ఐదు రకాల రుణాలను మంజూరు చేస్తుంది.

Loan Amount కనీసం మొత్తం కోటి రూపాయలు
Courses Covered Avanse ఆమోదించిన యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, ప్రొఫిషినల్ మరియు టెక్నికల్ కోర్సులు.
Expenses Covered
  • కళాశాల / పాఠశాల / హాస్టల్‌కు చెల్లించాల్సిన రుసుము.
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల రుసుము.
  • విదేశాలలో చదువుకోవడానికి ప్రయాణ ఖర్చులు / పాసేజ్ డబ్బు.
  • కాషన్ డిపాజిట్ / బిల్డింగ్ ఫండ్ / రిఫండబుల్ డిపాజిట్.
  • కంప్యూటర్ / ల్యాప్‌టాప్ కొనుగోలు. విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులు.
Interest Rate Up to 12.65 % PA
Processing Charges మంజూరు చేసిన లోనులో 1 - 2 % ప్రాసెసింగ్ చార్జీలు వర్తింపజేస్తారు.
Margin Nil
Security రుణ మొత్తానికి సమానమైన పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.
Repayment రీపెమెంట్, కోర్సు పూర్తయినా 12 నెలల తర్వాత లేదా ఉద్యోగం వచ్చిన 3 నుండి 6 నెలల నుండి చెల్లించాల్సి ఉంటుంది. రీపెమెంట్ 15 ఏళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

3. School Fee Financing

Loan Amount గరిష్టంగా 3 లక్షల వరకు మంజూరు చేస్తారు.
Courses Covered యూకేజీ to ఇంటర్మీడియట్
Expenses Covered
  • పూర్తి ట్యూషన్ ఫీజు & హాస్టల్ రుసుములు
  • పరీక్ష / లైబ్రరీ / ప్రయోగశాల ఫీజు
  • పుస్తకాలు / పరికరాల కొనుగోలు
Interest Rate Up to 12.65% PA, Avanse యొక్క అనుబంధ స్కూళ్లలో చదివే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తారు.
Processing Charges Rs 999/- only
Margin Nil
Security తల్లిదండ్రుల హామీ ఉంటె సరిపోతుంది.
Repayment లోను మంజూరు అయినా సమయం నుండి 3 లేదా 6 నెలల నిడివితో పూర్తిచేయాల్సి ఉంటుంది.

4. Executive education loans

Avanse provide executive education loans for Postgraduate courses, specialist courses, management courses, vocational upgradation or courses leading to a professional qualification.
Loan Amount The Minimum amount given as study abroad loan is Rs. 1,00,000.00/-

Post Comment