27th డిసెంబర్ 2023 కరెంట్ అఫ్ఫార్స్ | Today Current affairs in Telugu
Telugu Current Affairs

27th డిసెంబర్ 2023 కరెంట్ అఫ్ఫార్స్ | Today Current affairs in Telugu

27th December 2023 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

Advertisement

రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతొ పాంటోయా టాగోరీ

విశ్వభారతి విశ్వవిద్యాలయంకు చెందిన వృక్షశాస్త్ర పరిశోధకులు మొక్కల పెరుగుదలను పెంపొందించే అద్భుతమైన సంభావ్యత కలిగిన బ్యాక్టీరియాను కనుగొన్నారు. దీనికి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవార్థం 'పాంటోయా టాగోరీ'గా నామకరణం చేశారు. ఈ బాక్టీరియాను జార్ఖండ్ మరియు సోనాజురిలోని మట్టి నమూనాల నుండి వేరుచేసారు.

పాంటోయా టాగోరీ మొక్కల పెరుగుదలను పెంపొందించే జీవన విధానం కలిగివున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగపడనున్నట్లు పేర్కొన్నారు. ఇది పొటాషియంను కరిగించడంతో పాటుగా నత్రజని స్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ బాక్టీరియా ఆవిష్కరణ వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చే అవకాశం ఉంది. పాంటోయా టాగోరీను బయోఫెర్టిలైజర్‌గా ఉపయోగించడం ద్వారా, రైతులు రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు, ఇది పర్యావరణం మరియు నేల ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది. అదనంగా ఈ బ్యాక్టీరియా పంట దిగుబడిని మెరుగుపరచడానికి మరియు ఆహార భద్రతకు ఉపయోగపడుతుంది.

యూఏఈ చమురు దిగుమతులకు రూపాయిల్లో చెల్లింపు

ప్రపంచ మూడవ అతిపెద్ద ఇంధన వినియోగదారుడు అయిన భారతదేశం మొదటిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముడి చమురు కొనుగోలు కోసం రూపాయల్లో చెల్లించింది. అంతర్జాతీయ వాణిజ్య పద్ధతి ప్రకారం ముడి చమురు దిగుమతికి సంబంధించిన అన్ని ఒప్పందాలకు డిఫాల్ట్ చెల్లింపు కరెన్సీ యూఎస్ డాలర్ ఉంటుంది. అయితే ఈ ఏడాది జూలైలో భారతదేశం రూపాయి సెటిల్‌మెంట్ల కోసం యూఏఈతో ఒప్పందం చేసుకుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నుండి భారతీయ రూపాయలలో ఒక మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేయడానికి చెల్లింపులు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా స్థానిక కరెన్సీని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక ఆరంభంగా నిలవనుంది. సూచిస్తుంది. రూపాయిని ఆచరణీయ వాణిజ్య పరిష్కార కరెన్సీగా స్థాపించడానికి భారతదేశం యొక్క విస్తృత ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఏడాది జులై 11, 2022 నుండి యూఏఈ యొక్క దిగుమతిదారులు రూపాయిలలో చెల్లించడానికి మరియు ఎగుమతిదారులు స్థానిక కరెన్సీలో చెల్లింపులను స్వీకరించడానికి అనుమతిస్తుంది. భారత్ యొక్క చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి ఉండటంతో భారత ప్రభుత్వం ఈ బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారత్ ఇదే వ్యూహాన్ని అమలు చేసి రష్యా నుండి చమురు కొనుగోలు చేసి బిలియన్ల డాలర్లను ఆదా చేసింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు), భారతదేశం మొత్తం 232.7 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి $157.5 బిలియన్లను ఖర్చు చేసింది. ఈ చమురు కొనుగోలు చేసిన ప్రధాన సరఫరాదారులలో ఇరాక్, సౌదీ అరేబియా, రష్యా మరియు యూఏఈలు ఉన్నాయి. భారత్ పశ్చిమ ఆసియా మొత్తం సరఫరాలలో 58 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయ సరఫరా డిమాండ్‌లో ఇది 15 శాతం కంటే తక్కువగా ఉంది.

సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ అగ్రస్థానం

దేశంలో సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్‌లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం యొక్క రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్ II కింద నివాస భవనాల కోసం దేశంలోని మొత్తం రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్‌లో ఈ రాష్ట్రం 84 శాతం వాటాను కలిగి ఉందని తాజా డేటా తెలియజేస్తుంది. అలానే భారతదేశంలో సౌర విద్యుత్ వినియోగంలో కూడా గుజరాత్ అగ్రగామిగా ఉంది.

మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ 2019లో రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ ఫేజ్-IIని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలలో వ్యక్తిగత నివాస వినియోగదారుల కోసం సబ్సిడీ విధానం అమలు చేస్తుంది. 3 కిలో వాట్స్ నుండి 10 కిలో వాట్స్ సోలార్ ప్లాంట్ కోసం 17వేల నుండి లక్ష రూపాయల సబ్సిడీ అందిస్తుంది. దీని కోసం 11,814 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ 2026 వరకు పొడిగించింది. ఈ ప్రోగ్రామ్ కింద దేశ వ్యాప్తంగా 4000 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్స్ నెలకొల్పే లక్ష్యం పెట్టుకుంది.

బిఎస్‌ఇ చైర్మన్‌గా ప్రమోద్ అగర్వాల్‌

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) ఛైర్మన్‌గా ప్రమోద్ అగర్వాల్ నియామకాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. అయితే ప్రమోద్ అగర్వాల్ జనవరి 17 నుండి ఈ బాధ్యతలను అధికారికంగా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో 2022 మే నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుట్‌గోయింగ్ ఛైర్మన్ మరియు మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన ఎస్ఎస్ ముంద్రా ఉన్నారు.

ముంబైలోని దలాల్ స్ట్రీట్‌లో ఉన్న బీఎస్‌ఈ దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒకటి. బీఎస్‌ఈ 1875లో "నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్"గా స్థాపించబడింది. ఇది ఆసియాలోని పురాతన స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఒకటి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనేది భారతదేశంలోని సెక్యూరిటీలు మరియు కమోడిటీ మార్కెట్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థ. ఇది 1988లో ముంబై కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.

Advertisement

Post Comment