టీఎస్ పీజీఈసెట్ 2024 : నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీ
Admissions TS CETs

టీఎస్ పీజీఈసెట్ 2024 : నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీ

టీఎస్ పీజీఈసెట్ 2024 షెడ్యూల్ వెలువడింది.  తెలంగాణలోని యూనివర్సిటీలు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు మరియు ఫార్మసీ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మా, ఫార్మా డీ కోర్సుల అడ్మిషన్లు జరిపేందుకు నిర్వహించే ఈ పరీక్షను జూన్ 06 నుండి జూన్ 9వ తేదీల మధ్య జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూ హైదరాబాద్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉమ్మడిగా నిర్వహిస్తాయి.

Advertisement
Exam Name TS PGECET 2024
Exam Type Entrance Test
Entrance For M.Tech, M.Pharmacy, M.Arch
Exam Date 06/06/2024 OW
Exam Duration 2 Hours
Exam Level State Level (TS)

టీఎస్ పీజీఈసెట్ 2024 వివరాలు

టీఎస్ పీజీఈసెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • తెలంగాణ విద్యాసంస్థల నియమ నిబంధనలను అనుసరించి అభ్యర్థులు తమ స్థానికతను నిరూపించుకోవాలి.
  • ఏఐసిటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి .
  • అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయిస్తారు.
  • కౌన్సిలింగ్ సమయంలో గేట్, జీప్యాట్ లలో అర్హుత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

టీఎస్ పీజీఈసెట్ 2024 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 16 మార్చి 2024
దరఖాస్తు ముగింపు 10 మే 2024
హాల్ టికెట్ డౌన్‌లోడ్ జూన్ 2024
పరీక్ష తేదీ 06 -09 జూన్ 2024
టీఎస్ పీజీఈసెట్ ఫలితాలు జులై 2024
టీఎస్ పీజీఈసెట్ కౌన్సిలింగ్ జులై 2024

టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తు ఫీజు

కేటగిరి ధరఖాస్తు రుసుము
జనరల్ అభ్యర్థులు 1,100/-
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 600/-

టీఎస్ పీజీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ

తెలంగాణ పీజీఈసెట్ దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ధరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1100 రూపాయలు నిర్ణహించగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 600 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు రుసుములు టీఎస్/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలలో పాటుగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.చెల్లింపు సమయంలో ఉండే అదనపు సర్వీస్ చార్జీలను అభ్యర్థులే భరించాల్సివుంటుంది.

దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

టీఎస్ పీజీఈసెట్ పరీక్ష విధానం

తెలంగాణ పీజీఈసెట్  పూర్తి కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఎగ్జామ్ సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
గ్రాడ్యుయేషన్ సిలబస్ 120 120 2 గంటలు

టీఎస్ పీజీఈసెట్ క్వాలిఫై మార్కులు

తెలంగాణ పీజీఈసెట్ 2020 క్వాలిఫై మార్కులు 25% గా ప్రకటించారు. 120 మార్కులకు జరిగిన పరీక్షలో 30 మార్కులు దాటి సాధించిన అభ్యర్థులను ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి అర్హుత మార్కులు నిర్ణయించలేదు.

టీఎస్ పీజీఈసెట్ సిలబస్ టీఎస్ పీజీఈసెట్ ఎగ్జామ్ లిస్ట్
టీఎస్ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ లింక్ టీఎస్ పీజీఈసెట్ మాక్ టెస్ట్

Advertisement

Post Comment